పినపాక (ఖమ్మం జిల్లా) : పినపాక మండలం మోతె గ్రామం వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని పినపాక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.