కారు-బైకు ఢీ
Published Sun, Feb 19 2017 1:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
నల‍్గొండ: జిల్లాలోని కోదాడ మండలం కుమారబండ బైపాస్‌లో ఆదివారం మధ్యాహ‍్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ‍్యక్తి గాయపడ్డాడు. ఎదురుగా వెళుతున‍్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement