షార్ట్ ఫిల్మ్స్‌లో సన్నివేశాలను చిత్రీకరిçస్తున్న దృశ్యాలు
పినపాక ఖమ్మం : అల్లరిచిల్లరిగా తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా..సమాజానికి ఏదైనా సం దేశం ఇవ్వాలనే లక్ష్యంతో షార్ట్‌ఫిల్మ్‌లు రూ పొందిస్తూ.. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం, సీతంపేట గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆకట్టుకున్నారు. వీరంతా ఓ బృందం గా ఏర్పడి..లఘు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలనే ధ్యేయంతో భిన్నంగా ఆలోచిస్తూ..శెభాష్ అనిపించుకుంటున్నారు.
ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పులివర్తి పెద్దాచారి, సీతంపేటకు చెందిన ఆర్.రాజశేఖర్‌లు టీం లీడర్లుగా ఉంటూ మరో 20మంది యువకులతో ప్రత్యేకం గా బృందాన్ని ఏర్పరుచుకుని..తొలినాళ్లలో కేవ లం కామెడీ అంశాలను ఆధారంగా చేసుకొని షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న పరిసరాలను, పొలాలను, పాఠశాలలను, రైతుల నే ఇతివృత్తంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నారు.
ఆర్‌ఎస్ క్రియేషన్స్ పేరుతో 25షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరించే వరకు వీరి ప్రయాణం సాగింది. రైతులకు పెట్టుబడి ధరలు రావాలని, పంటల సాగుకు ప్రోత్సాహమివ్వాలని, ఊర్లను బాగు చేయాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సర్కారు బడులను ప్రోత్సహించాలని..సందేశమిచ్చేలా షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేస్తుం డడంతో వేలామంది వీక్షకులు వాటిని చూశారు. ఈ లఘుచిత్రాలన్నీ సెల్‌ఫోన్ ద్వారానే తీశామని ఆనందంగా అంటున్నారు. వీడియో కెమెరా కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని, మొబైల్‌లోనే ఎడిటింగ్ ప్రక్రియను కూడా పూర్తిచేస్తున్నామని వివరించారు.
దాతలు సహకరించాలి..
సమాజంలో ప్రజలను చైతన్యపరిచేందుకు షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మిస్తున్నాం. ముందుగా ఐదుగురితో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు 20 మందికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితి చాలక..వీడియో కెమెరా కొనలేదు. సెల్‌ఫోన్‌తోనే చిత్రాలు నిర్మిస్తున్నాం. దాతలు సహకరిస్తే సమాజంలో సమస్యల పరిష్కారానికి, మార్పు కోసం మా వంతుగా కృషి చేస్తాం.
–పి.పెద్దాచారి, ఏడూళ్లబయ్యారం, పినపాక మండలం
యూట్యూబ్‌లో చూడండి..
ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్న మా యువకులకు చెందిన ఆర్‌ఎస్ క్రియేషన్స్ పేరిట ఉన్న యూబ్యూబ్ చానెల్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు. మరింతగా ఆదరిస్తే మాకు వచ్చే పాయింట్ల మూలంగా మరింత ఉత్సాహంగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మిస్తాం.
– ఆర్.రాజశేఖర్, సీతంపేట, పినపాక మండలం
Comments
Please login to add a commentAdd a comment