![maoists attack in pinapaka, 2 killed - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/27/maoist_0.jpg.webp?itok=U8iLyz7b)
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేట సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు హల్‌చల్ చేశారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఒకరిపై కాల్పులు జరపగా, మరొకరిని గొడ్డలితో నరికి చంపారు. గ్రామ శివారు గోదావరి ఒడ్డున గిరిజన సొసైటీ పేరుతో ఇసుక క్వారీ నడుస్తోంది. ఇక్కడికి వచ్చిన మావోయిస్టులు నాలుగు లారీలు, మూడు జేసీబీలు, ఒక డోజర్, ఒక ట్రాక్టర్‌ను దహనం చేశారు.
అనంతరం జానంపేట పంచాయతీ సుందరయ్యనగర్‌కు (వలస గొత్తికోయ గ్రామం) చెందిన మడివి రమేష్, జోగయ్యలను పోలీస్ ఇన్ ఫార్మర్లుగా భావించారు. వీరిలో రమేష్‌పై కాల్పులు జరిపారు. జోగయ్య(42)ను గొడ్డలితో నరికి చంపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మణుగూరు కమిటీ పేరుతో లేఖలు వదిలారు. 45 మంది మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే మణుగూరు డీఎస్పీ సాయి బాబా ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment