భద్రాచలం: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య వరుసగా పరస్పర దాడులు జరుగుతుండటంతో సోమవారం భద్రాచలం నుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సరిహద్దు లోని బేస్ క్యాంప్‌లకు 215 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన పోలీసు బలగాలను తరలించారు. భద్రాచలం శివారులోని పురు షోత్తపట్నం టుబాకో బోర్డు ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు.
హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని మలికపండా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావో లు, బలంగిరి వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో రైలు పట్టాలపై మావోయిస్టులు సోమవారం చెట్లు నరికి పడేశారు. పైలట్ గార్డ్ వద్ద వాకీటాకీలను మావోయిస్టులు ఎత్తుకుపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై అక్కడి పోలీసు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment