పెద్దపల్లి: వేసవి కాలంలో అడవి అంతటా ఆకులు రాలుతాయి.. కానీ, ఛత్తీస్‌గఢ్ అడవిలో ప్రాణాలే రాలిపోతున్నాయి. వారం రోజుల క్రితం 10 మంది మావోలు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే మావోయిçస్టు పార్టీ
టీసీవోసీ (టాక్టికల్ కౌంటర్ అఫెన్స్ కాంపెయిన్) దళాలదాడిలో మంగళవారం 9 మంది జవాన్లు హతమయ్యారు.
వర్షాకాలం వరకు కలిసే..
ఛత్తీస్‌గఢ్ అడవులు రానున్న మూడునెలల కాలం యుద్ధానికి నిలయం కానున్నాయి. ఏటా మావోయిస్టు పార్టీ దళాలన్ని ప్లాటూన్‌తో కలసి మార్చి నుంచి జూన్ వరకు దాడులకు దిగుతున్నాయి. మైదాన
ప్రాంతంలో పోలీసు లు డ్రోన్ కెమెరాల ద్వారా ఆపరేట్ చేస్తూ అడవిలో ఉన్న దళాలను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం ప్రవేశించే సమయం వరకు మావో దళాలన్నీ కలసి ఉంటాయని
సమాచారం. ఈ అవకాశం రెండు వర్గాలు ఇటు పోలీసులు, అటు మావోయిస్టు లు వినియోగించుకుంటూ ఎవరికి వారు పైచే యి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆకురాలే సీజన్‌లో పోలీసులు అడవుల్లో
కూంబింగ్ చేపడుతుండగా ప్రతిదాడి కోసం ఎత్తుగడల వ్యూహం తో మావోలు ఎదురుదాడికి దిగుతున్నారు.
నారాయణపూర్, కాంకేర్, దర్బా డివిజన్‌లతో పాటు పశ్చిమ, దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌కు దిగుతుండటంతో ప్రతీ వేసవి సీజన్‌లో రెండు వైపులా ఓ వంద ప్రాణాలు గాలిలో
కలుస్తున్నాయి. తెలంగాణకు ఉత్తరం దిశగా ఉన్న గోదావరి, ప్రాణహిత అవతల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఖమ్మం వరకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ
అధీనంలో ఉంచుకున్నారు. దండకారణ్యంలో జనతన∙సర్కార్ నడుపుతున్న మావోయిస్టులకు వేసవి సీజన్ మొదలైందంటే ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. గత కొంతకాలంగా పోలీసులు సైతం
మైదాన ప్రాంతాలకు అనువుగా ఉన్న అటవీ ప్రాంతాలలో సైతం చొరబడి తమ ఆధిపత్యాన్ని సాధించుకోగలుతున్నారు. ఇటీవల ఖమ్మం సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు
చనిపోయిన ఘటన తరువాత ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ ప్రతీకార చర్యలకు పాల్పడుతూనే ఉంది. గడిచిన వారం రోజుల్లోనే మూడు చోట్ల మందుపాతరలు పేల్చిన మావో లు మంగళవారం కిష్ణాపురం వద్ద 9
మంది కమాండోలను హతమార్చి తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.
కమాండోలకు డ్రోన్ కెమెరాలు
నల్లమల అటవీప్రాంతం, తెలంగాణ మైదాన ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు పైచేయిగా నిరూపించుకున్నారు. పోలీసులు గత కొంతకాలంగా కేకేడబ్ల్యూ కమిటీ వెంటపడి ఆ కమిటీకి చెందిన సభ్యులను
ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. మావో యిస్టు కార్యకలాపాల అణచివేతలో పోలీసులు డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో డ్రోన్ కెమెరాల సహాయం
తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. మైదాన ప్రాంతంలో పోలీసులు సురక్షితంగా ఉంటూ డ్రోన్ కెమెరాల ద్వారా అడవిలో ఉన్న దళాలను కనిపెట్టే అవకాశం లేకపోలేదు. టెక్నాలజీ, ఆకురాలే సీజన్
అడవులను యుద్ధ వాతావరణానికి దగ్గరగా తీసుకెళ్తున్నాయని చెప్పవచ్చు.
వేసవి సీజన్‌లో జరిగిన సంఘటనల్లో కొన్ని...
- 2006 ఏప్రిల్ 28 :కడప జిల్లా సుండుపల్లి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో 9మంది మావోయిస్టులు మరణించారు.
- 2011 మార్చి 13 : ప్రకాశం, వరంగల్ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లు శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండల్‌రెడ్డి అలియాస్ టెక్ రమణ మరణించారు.
- 2012 మార్చి 18: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మరణించారు.
- 2013 మే 25 : దర్బా డివిజన్‌లో జరిగిన మందు పాతర సంఘటనలో కాంగ్రెస్ నాయకులతో సహా పోలీస్ సిబ్బంది 28 మంది మరణించారు.
- 2014 ఏప్రిల్ 12 : ఛత్తీస్‌గఢ్ చింతల్‌నాల్ వద్ద మావోలు పేల్చిన మందు పాతరకు 32 మంది పోలీసులు బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment