గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు | four teenagers missing in Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

Published Fri, Feb 24 2017 10:48 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు - Sakshi

గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): మహాశివరాత్రిని పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరిచండానికి గోదావరిలో దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతలబయ్యారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.

గ్రామ శివారులోని గోదావరి ఒడ్డు పై ఉన్న శివాలయంలో పూజలు చేయడానికి వచ్చిన తంతరపల్లి మురళి(18), అల్లు నాగేంద్రబాబు(19), గూడె ప్రేమ్‌ కుమార్‌(22), పవన్‌(18), అనే నలుగురు యువకులు  పవిత్ర స్నానమాచరించడానికి గోదావరిలో దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజఈతగాళ్ల సాహయంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement