పినపాక, న్యూస్‌లైన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సీతంపేటకు చెందిన సంతపురి సతీష్(27) మంగళవారం ఇంట్లో నీటి కోసం విద్యుత్ మోటార్ స్విచ్ వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పైన ఉన్న వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. టాటా ఏస్ వాహనం నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్న సతీష్‌కు భార్య నళిని, కుమార్తె నందిని, కుమారుడు సాయిలు ఉన్నారు. సతీష్ మృతితో ఆ కుటుంబం వీధినపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారేపల్లిలో మహిళ..
కారేపల్లి : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కారేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మంజులవాడకు చెందిన బాస శాంతమ్మ(60) స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లగా తీగెలు తగిలి విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయింది. హోటల్ నిర్వాహకులు, స్థానికులు ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు శాంతమ్మకు భర్త రాములు, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిగాయి.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
Published Wed, Jan 1 2014 5:10 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement