Satheesh
-
డల్లాస్‌లో గాంధీ స్మారకాన్ని సందర్శించిన డా.సతీష్ రెడ్డి
డల్లాస్: భారత రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి.. అమెరికా డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. బాపూ విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. సతీష్ రెడ్డికి గాంధీ మెమోరియల్ సెక్రెటరీ కల్వల రావు స్వాగతం పలికారు. డా.ప్రసాద్ తోటకూర స్ఫూర్తితోనే గాంధీ స్మారకాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్ముని పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ దేశాల నాయకులు ఆయన నుంచి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అజయ్ కలవల, రంగారావు, గోపి చిలకూరి, ప్రవీణ్ రెడ్డి, బీమ పెంట, జీవీఎస్ రామకృష్ణ, కృష్ణారెడ్డి కోడూరు, శరత్ రెడ్డి యర్రం, శ్రీకాంత్ పోలవరపు, ఇతరులు పాల్గొన్నారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పినపాక, న్యూస్‌లైన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సీతంపేటకు చెందిన సంతపురి సతీష్(27) మంగళవారం ఇంట్లో నీటి కోసం విద్యుత్ మోటార్ స్విచ్ వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పైన ఉన్న వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. టాటా ఏస్ వాహనం నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్న సతీష్‌కు భార్య నళిని, కుమార్తె నందిని, కుమారుడు సాయిలు ఉన్నారు. సతీష్ మృతితో ఆ కుటుంబం వీధినపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారేపల్లిలో మహిళ.. కారేపల్లి : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కారేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మంజులవాడకు చెందిన బాస శాంతమ్మ(60) స్థానిక బస్టాండ్ సెంటర్లో ఓ హోటల్లో పని చేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లగా తీగెలు తగిలి విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయింది. హోటల్ నిర్వాహకులు, స్థానికులు ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు శాంతమ్మకు భర్త రాములు, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిగాయి.