
డల్లాస్: భారత రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి.. అమెరికా డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. బాపూ విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు.
సతీష్ రెడ్డికి గాంధీ మెమోరియల్ సెక్రెటరీ కల్వల రావు స్వాగతం పలికారు. డా.ప్రసాద్ తోటకూర స్ఫూర్తితోనే గాంధీ స్మారకాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటున్నట్లు చెప్పారు.
డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్ముని పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ దేశాల నాయకులు ఆయన నుంచి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అజయ్ కలవల, రంగారావు, గోపి చిలకూరి, ప్రవీణ్ రెడ్డి, బీమ పెంట, జీవీఎస్ రామకృష్ణ, కృష‍్ణారెడ్డి కోడూరు, శరత్ రెడ్డి యర్రం, శ్రీకాంత్ పోలవరపు, ఇతరులు పాల్గొన్నారు.
చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..
Comments
Please login to add a commentAdd a comment