ప్లీనరీలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు జగన్
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మణుగూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేశారు. పార్టీ రెండు ప్లీనరీ ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, పది నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి వారితో జగన్ సమీక్షించారు.
అనంతరం ప్రస్తుతం పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఉన్న పాయం వెంకటేశ్వర్లును అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. పాయం నియామకం పట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు.
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా పాయం
Published Mon, Feb 3 2014 2:47 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement