బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం | to partner in development of golden Telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం

Published Thu, Jun 5 2014 2:20 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం - Sakshi

బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం

 పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
 
 మణుగూరు, న్యూస్‌లైన్ : బంగారు తెలంగాణ నిర్మాణంలో వైఎస్సార్ సీపీ భాగ్యస్వామ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని పార్టీ మండల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ శాసన సభా ఉప నేతగా తనను ఎంపిక చేసిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం అసెంబ్లీ లోపల, బయట నిర్మాణాత్మకంగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టే ్రపజా సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతామన్నారు.
 
 అసెంబ్లీలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తూ పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ముందుంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో తాను తీసుకొచ్చిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి వాటిని త్వరిత గతిన పూర్తిచేయడానికి కృషిచేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని తాగునీరు, సాగునీరు.బొగ్గుగనుల ఏర్పాటు, బొగ్గు  ఆదారిత పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడాతనన్నారు.
 
 నియోజకవ ర్గంలో ప్రవిహ స్తున్న గోదావరి జాలాలను సాగునీరు, తాగునీటి కోసం సద్వినియోగం చేసుకొని ప్రజల దాహంతోపాటు నియోజవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నందున కొత్త గనుల, ఎన్‌టీపీసీ, 500ల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న రెగులగండి కాల్వలు, రూ. 5 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం, సింగిరెడ్డిపల్లి లిఫ్టు, కిన్నేరసాని కాల్వల నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే నియోజకర్గంలోని వివిధ విభాగాల అధికారులతో చర్చించి సమస్యలను తెలుసుకుంటానన్నారు.
 
 పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు సరైన ప్యాకేజీ అందడంతోపాటు ఆ గ్రామాలను జిల్లాలోనే కొనసాగేలా కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మణుగూరులోని సింగరేణి గనుల్లో పంచ్‌ఎంట్రీ ఏర్పాటు కోసం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కేంద్రాన్ని కలిసి అనుమతి తీసుకొస్తామన్నారు. పంచ్‌ఎంట్రీ ఏర్పాటు వల్ల ఇటీవల మణుగూరు ఏరియా నుంచి బదిలీ అయిన కార్మికులు మళ్లీ ఇక్కడే పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏరియాలో కొత్తగనులు ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
 
అందుకు తన వంతు సహాయ సహాకారాలు ఉంటాయన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పాలకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఆవుల నర్సింహారావు, మండల నాయకులు పెద్ది నాగకృష్ణ, గాండ్ల సురేష్, హరగోపాల్, మెడ నాగేశ్వరరావు, ముసలి శ్రీనివాస్,  ఈసాల ఏడుకొండలు, మిట్టపల్లి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement