మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష | Former MLA Payam Venkateswarlu Jailed For 6 Months | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష

Published Thu, Aug 12 2021 7:20 PM | Last Updated on Fri, Aug 13 2021 7:52 AM

Former MLA Payam Venkateswarlu Jailed For 6 Months - Sakshi

సాక్షి, ఖమ్మం : పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష పడింది. ఆయనకు 6 నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది.

2018లో అశ్వాపురం పీఎస్‌లో పాయం వెంకటేశ్వర్లుపై ఈ మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై కోర్టు గురువారం విచారణ జరిపి, తీర్పు నిచ్చింది. ఆయన రూ. 10 వేల జరిమానాను కట్టారు.. అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధపడటంతో కోర్టు జైలు శిక్ష నిలిపివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement