'అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం' | payam venkateswarlu fire on kcr on farmer problems issue | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం'

Published Tue, Sep 22 2015 6:26 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం' - Sakshi

'అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం'

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలు, కరువు, రుణమాఫీ అంశాలపై పోరాడుతామని టీవైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోడుభూములు, దళితులు, గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో లెవనెత్తుతామన్నారు. రైతులు, రైతుల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. కరువు ప్రాంతాలను గుర్తించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు ఇప్పటికీ మంజూరు కాలేదన్నారు. మొదటి విడత రుణమాఫీ కూడా అమలు కాని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement