మణుగూరు: ప్రభుత్వ పథకాలను అధికారులు పక్కదోవ పట్టించొద్దని మహబూబాద్ పార్లమెంట్ సభ్యుడు అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గురువారం మణుగూరు ఏరియాలో పర్యటించిన అయన ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ జీసీసీస్టోర్‌లో ఆహర భద్రతా పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆహార భద్రత పథకాన్ని, సమితిసింగారం హస్టల్‌లోని సన్నబియ్యం పథకం ప్రారంభించారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు నష్ట పరిహరం చెల్లిస్తామన్నారు. మణుగూరు ఒపెన్‌కాస్టు నిర్వాసిత ప్రాంతంలోని 181మంది గిరిజనులకు ఉద్యోగాఅవకాశాలు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పాయం
ప్రభుత్వం ప్రవేశపెడుత్ను పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు మండలంలోని భగత్‌సింగ్‌నగర్, సమితిసింగారం పంచాయతీల్లో ఆహార భద్రత పథకాలను ప్రారంభించారు. నిజయమైన లభ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని అదికారులను సూచించారు.
నియోజకవర్గ అబివృద్ది కోసం తాను నిరంతరం పాటుపడతానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోకవర్గ ఇన్‌చార్జి శంకర్‌నాయకు, పాయం నర్సింహారావు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆవుల నర్సింహారావు, కృష్ణ, తిరుమలేష్, పెద్దినాగకృష్ణ, సురేష్, రంజిత్, శ్రీనివాస్, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.
పథకాలను పక్కదోవ పట్టించొద్దు
Published Fri, Jan 2 2015 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement
Advertisement