
గాంధీనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు
సాక్షి,బూర్గంపాడు: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం అని పినపాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల అన్నారు. శుక్రవారం సారపాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.లక్ష ఆర్థిక చేయూతనందిస్తున్నామన్నారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.8వేలు, రూ.5లక్షల బీమా, 24గంటల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు.
కేసీఆర్ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్, భాస్కర్‌నగర్ గ్రా మాలకు చెందిన 200కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్ సూరపాక విజయనిర్మల, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గొనె దారుగా, పాండవుల మధు తదితరులు పాల్గొన్నారు.