వీవీపాలెంలో మాట్లాడుతున్న పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అవసరమైన సహకారం అందించడంలో ఉత్సాహం చూపే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యాపారి ఈశ్వరప్రగడ హరిబాబు అన్నారు. సోమవారం నగరంలోని 35వ డివిజన్‌లో దుద్దుకూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ పువ్వాడ అజయ్‌కుమార్ లాంటి వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా అనేక సమస్యలకు మార్గం లభిస్తుందన్నారు. సేవే లక్ష్యంగా ప్రతి నిత్యం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయన్నారు. తోటి వ్యక్తికి సహాయపడాలనే ఆశయం ఉన్న వ్యక్తులకు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా మన నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్ ద్వారా పదిమందికి మంచి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అజయ్‌ని గెలిపించుకొని ఖమ్మాన్ని మరింత అభివృద్ధి పరుచుకుందామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉట్కూరి లక్ష్మీసుజాత, దోరేపల్లి శ్వేత, నాయకులు శాబాసు శ్రీను, ఉట్కూరి రవికాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, దుద్దుకూరి సత్యనారాయణ, పాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అజయ్‌కుమార్‌ను గెలిపించాలి ..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన ఖమ్మం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మళ్లీ ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని అజయ్‌కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలో పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటు వేసి అజయ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోల్లు పద్మ పాల్గొన్నారు.
చేసిన అభివృద్ధిని వివరించాలి ..
రఘునాథపాలెం: చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని వీవీపాలెంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రమేశ్, సొసైటీ అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, కాపా భూచక్రం, యరగర్ల పద్మ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment