ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా : పువ్వాడ అజయ్‌ | Puvvada Ajay Canvass In Khammam | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా : పువ్వాడ అజయ్‌

Published Sat, Dec 1 2018 11:20 AM | Last Updated on Sat, Dec 1 2018 11:23 AM

Puvvada Ajay Canvass In Khammam - Sakshi

మాట్లాడుతున్న పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, ఖమ్మంఅర్బన్‌: గత ఎన్నికల్లో  చెప్పిన పనులన్నీ చేశానని, మళ్లీ ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 4, 6, 22వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం, ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. తాను ఖమ్మానికి అతిథిని కానని, మండే టూ సండే ఎమ్మెల్యేగా నిత్యం తమతోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2 వేల మంది పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా అడపిల్లల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో 2 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టి వివిధ దశల్లో ఉన్నాయని, అదనంగా మరో 5 వేల ఇళ్లకు మంజూరు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సల్వాది వెంకన్న, చావా నారాయణరావు, చిలకల వెంకటేశ్వర్లు, వెంకటనర్సయ్య, మోహన్, లక్ష్మీనారాయణ, పొదిల పాపారావు, రమణ, ప్రభాకర్, దయాకర్, భిక్షం, జయమ్మ, సరళ, పద్మాజారెడ్డి, జ్యోతిర్మయి, చావా రవి, నాగేశ్వరరావు, బసవయ్య, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 
ప్రతి వ్యాపారికి అండగా ఉన్న 
ఖమ్మంమయూరిసెంటర్‌: నగరంలోని ప్రతి వ్యాపారికి అండగా ఉన్నానని, ఖమ్మం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ విజ్ఙప్తి చేశారు. శుక్రవారం నగరంలోని త్రీటౌన్‌లోని ది ఖమ్మం లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధి ఏనాడైనా చూశారా? అని ప్రశ్నించారు. ఖమ్మం ఎమ్మెల్యేగా బాధ్యత చేపటిటనప్పటి నుంచి పట్టువదలకుండా ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నానని తెలిపారు.

గత ఎన్నికల్లో తనపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేసి గెలిపంచినందుకు బాధ్యతను నిర్వర్తించానని, ప్రజలకు చెప్పినవన్నీ చేశానని, అన్ని సందర్భాల్లో ప్రజల మధ్యనే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అనేక రంగాల్లో కార్మికుల ఉన్నతికి పని చేశామని, ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న ప్రతి పైసా ఖర్చు చేసుకొని అన్ని విధాల అభివృద్ధి పరుచుకున్నామని చెప్పారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను అందించిందని, వ్యాపారులకు అండగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నకిరికంటి సత్యంబాబు, బోజెడ్ల పూర్ణ, బాలరాజు, సతీశ్, నాయకులు ఆర్టీసీ వెంకటేశ్వర్లు, కటకం గిరి, మంద రఘురాంప్రసాద్, దేశపతి శివనాగమల్లేశ్వరరావు, కార్పొరేటర్‌ తోట రామారావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తాలు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement