మాట్లాడుతున్న అజయ్‌కుమార్
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం సమగ్రాభివృద్ధితో పాటు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేశానని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం నగరంలోని వెగ్గళం వారి కల్యాణ మండపంలో, ఎంఎన్ ఫంక్షన్‌హాల్ వద్ద వివిధ వర్గాల వారి ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అజయ్‌కుమార్ మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని, వారి కష్టాలను ఎన్నడు విస్మరించిన దాఖలాలు లేవన్నారు. వ్యాపార రంగాల వారికి అన్ని సందర్భాల్లో చేదోడు వాదోడుగానే ఉన్నానని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజల కోసం నిత్యం ఖమ్మంలోనే ఉన్నానన్నారు. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న రోడ్లను, డ్రెయిన్లను ఇప్పుడు ఆధునీకరించుకున్నామంటే అది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమేనన్నారు. ఎన్నికల్లో మరో సారి తనను గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు మరింత అభివృద్ధిని అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్జేసీ కృష్ణ, సీహెచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరికలు ..
ఖమ్మంమయూరిసెంటర్: నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన యువకులు 65 మంది బుధవారం పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పువ్వాడ తన క్యాంపు కార్యాలయంలో యువకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్, సాయి, సంజయ్, దా మోదర్, సాయికుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment