ఎంతో చేశా..ఇంకా చేస్తా : తుమ్మల | TRS Candidate Thummala Canvass In Khammam | Sakshi
Sakshi News home page

ఎంతో చేశా..ఇంకా చేస్తా : తుమ్మల

Published Wed, Dec 5 2018 1:01 PM | Last Updated on Wed, Dec 5 2018 1:01 PM

TRS Candidate Thummala Canvass In Khammam - Sakshi

మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, ఖమ్మంరూరల్‌:పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి  ఇం తకాలం ఎంతో చేశానని, తనను గెలిపిస్తే మిగిలిన పనులను పూర్తిచేసి, కొత్తవి కొనసాగిస్తానని టీఆర్‌ఎస్‌ పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గువ్వలగూడెం, నేలకొండపల్లి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. వేలకోట్ల రూపాయల నిధులతో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోనే అత్యంత కరవు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలానికి భక్తరామదాసు ప్రాజెక్ట్‌తో సాగునీటినందించి బీడు భూములన్నీ సస్యశ్యామలం చేశానన్నారు. ఇప్పుడు ఆ భూముల్లో రైతులు రెండు పంటలు పండించుకున్నారని చెప్పారు. నేలకొండపల్లిలో ఆరులేన్ల రోడ్డుగా మార్చి సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మైసా శంకర్, వంగవీటి గేశ్వరరావు, శాఖమూరి రమేష్, వెన్నపూసల సీతారాములు, కాసాని నాగేశ్వర రావు, తలశిల రాధాకృష్ణ, కోటి సైదిరెడ్డి, నలమల శేఖర్, నాగేశ్వరరావు, నెల్లూరి భద్రయ్య, దాసరి రాములు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement