US Woman Arrested After Allegedly Murdered His Husband - Sakshi
Sakshi News home page

ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..

Published Sun, May 14 2023 12:54 PM | Last Updated on Sun, May 14 2023 2:17 PM

US Woman Arrested After Allegedly Murdered His Husband - Sakshi

భర్తను చాలా తెలివిగా ప్లాన్‌ చేసి చంపేసింది. ఆ తర్వాత భర్తను కోల్పోయిన స్త్రీ ఎలా లైఫ్‌ని లీడ్‌ చేసేందుకు ఇబ్బంది పడిందో వివరిస్తూ.. ఓ పుస్తకం రాసింది. తాను ఎంతగానో తన భర్తను మిస్సవ్వుతున్నట్లు ఆ పుస్తకంలో కలరింగ్‌ ఇచ్చింది. ఆ పుస్తకం తనలాంటి ఆడవాళ్లకు ఓదార్పు అందిస్తుందని చెప్పింది. అమెజాన్‌లో ఈ పుస్తకాన్ని మంచి ప్రమోషన్‌ ఇచ్చి మరీ సేల్స్‌ చేసింది. తీరా పోలీసులు అసలు నిందితుడు ఎవరో తెలుసుకుని కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..కౌరీ డార్టెన్‌ రిచిన్స్‌ అనే మహిళ తన భర్త ఎరిక్‌ చనిపోయాడంటూ ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా పోలీసులకు ఫోన్‌ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా అతడు మరణించినట్లు ధృవీకరించారు. పోలీసులు కూడా సహజ మృతిగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టంలో ఫెంటానిల్‌ అనే డ్రగ్‌ ఓవర్‌ డోస్‌ వల్లే చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు చాలా రహస్యంగా ఈ కేసుని విచారించడం ప్రారంభించారు. సదరు జంటకు ముగ్గురు పిల్లలు కూడా. తన భర్త మరణించిన ఒక ఏడాది తర్వాత ఓ పుస్తకాన్ని సైతం ప్రచురించింది. ఇది ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన కష్టమైన అనుభవం నుంచి పిల్లలను సున్నితంగా మార్గనిర్దేశం చేసేలా భరోసా ఇచ్చే పుస్తకం అని  అమెజాన్‌లో వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉండగా, ఆ రోజు రిచన్స్‌ భర్త చనిపోయే రోజు రాత్రి ఆ ఇద్దరు ఇంటిలో వేలంటైన్స్‌ డే వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భర్తలో చలనం లేదని, అందుకోసం రకరకాలుగా ప్రయత్నించిన ఫలితం కనిపించలేదని పోలీసులకు కాల్‌ చేసింది. ఆ రోజు అతను మిక్సిడ్‌ వోడ్కా డ్రింక్‌ తీసుకున్నాడని పోస్టమార్టం రిపోర్ట్‌లో తేలింది. అంతకు మునుపు మూడురోజుల ముందే రిచన్స్‌ హైడ్రోకోడోన్ మాత్రలు కొనుగోలు చేసినట్లు తేలింది.

అలాగే వైద్యుల కూడా పోస్టమార్టంలో ఎరిక్‌ ఐదు రెట్లు హైడ్రోకోడోన్‌ అనే ప్రాణాంతక మందులు సేవించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఎరిక్‌ మరణించి ఏడాది తర్వాత పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించి మరీ ఎరిక్‌ని అరెస్టు చేశారు. అంతేగాదు రిచిన్స్‌ తన భర్త చనిపోయిన తర్వాత రోజే తన స్నేహితులకు పెద్ద పార్టీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు పోలీసులు. తదితర ఆధారాల రీత్యా రిచన్స్‌ తన భర్తను హత్య చేసినట్లు నిర్థారించారు పోలీసులు.  

(చదవండి: పాక్‌ ఆర్మీపై నిప్పులు చెరిగిన ఇమ్రాన్‌ ఖాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement