
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్యని, కంటిపాపల్లా చూసుకోవాల్సిన ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. బీహెచ్‌ఈఎల్ సమీపంలోని తెల్ల పల్లికి చెందిన సురేందర్, వరలక్ష్మీకి నితీశ్, యశస్విని అనే ఇద్దరు పిల్లలు. సురేందర్ తన భార్యాపిల్లలతో కలిసి ఉగాది పండుగకు గాను మీర్చేట శివ నారాయణపురంలోని అత్తగారింటికి వెళ్లారు.
ఇంతలో ఏమైందో తెలియదు.. సురేందర్ ఈ రోజు తెల్లవారుజామున తన భార్యాపిల్లల్ని అతి దారుణంగా హతమార్చి మీర్పేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిహెచ్ఇఎల్ సమీపంలోని తెల్ల పల్లికి చెందిన సురేందర్ తన భార్య వరలక్ష్మి ఇద్దరు పిల్లలు నితీశ్ యశస్వినిని తీసుకుని ఉగాది పండుగ కు గాను మీర్పేట శివ నారాయణపురంలోని అత్తగారింటికి వచ్చారు ఏమైందో తెలవదు కానీ ఈ రోజు తెల్లవారుజామున భార్యను ఇద్దరు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి మీర్పేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు .ఇటీవల కాలంలో మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండవది . గత నెలలో ఓ ల్యాబ్ టెక్నిషియన్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment