కట్టుకున్నవాడే కాలయముడై..!
Published Sun, Nov 13 2016 1:55 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
నల్లజర్ల: నల్లజర్ల కోనేటి కాలనీలో ఓ మహిళ హత్యకు గురైంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు శనివారం విలేకరులకు చెప్పారు. వివరాలిలా ఉన్నా యి.. కాలనీకి చెందిన కొవ్వల శ్రీను అదేకాలనీకి చెందిన లక్షి్మని ఏడేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో ఇరుపక్షాల వారు వీరిని దగ్గరకు రానివ్వకపోవడంతో కాలనీ శివారులో పూరింట్లో నివాసముంటున్నారు. వారికి ఆరేళ్ల కుమార్తె అనిత ఉంది. వ్యసనాలకు బానిసైన శ్రీను తరచూ లక్షి్మతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మ«ధ్యాహ్నం నుంచే భార్యభర్తలిద్దరూ తగదా పడినట్టు పరిసర ప్రాంత వాసులు చెబుతున్నారు. రాత్రి 9 గంటల సమయంలో లక్ష్మి స్నేహితురాలు కృష్ణవేణి వచ్చి చూసేసరికి లక్ష్మి నేలపై అచేతనంగా పడి ఉంది. దీంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించింది. అనంతపల్లి ఎస్సై వెంకటేశ్వరావు, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మధుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసుగా నమోదు చేశారు. మృతురాలు లక్ష్మి (23) గొంతు మీద, చాతీ మీద గాయాలున్నాయి. ముఖం అంతా కమిలిపోయి ఉంది. భర్త శ్రీను అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు శ్రీను ప్రేమించినట్టు నటించి తన కూతురు జీవితం మట్టిపాలు చేశాడని మృతురాలి తండ్రి పాముల వెంకటేశ్వరావు, తమ్ముడు చిన్నబాబు, నాయనమ్మ తులసమ్మ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మధుబాబు తెలిపారు.
వ్యసనాలకు బానిసై..
వ్యసనాలకు బానిసైన శ్రీను కొంత కాలంగా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నాడని కోనేరు కాలనీవాసులు చెబుతున్నారు. దీంతోపాటు ఆమెకు మద్యం అలవాటు చేశాడని, వ్యభిచారం చేయనంటే చితకబాదేవాడని అంటున్నారు. శుక్రవారం రాత్రి కూడా ఈ విషయంలోనే వీరి మధ్య గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాలనీ శివారు పడిపోయేస్థితిలో ఉన్న పూరింట్లో వీరు నివాసముంటున్నారు. లక్ష్మి మృతితో కుమార్తె అనిత అనాథగా మారింది. చిన్నారి బిత్తర చూపులు స్థానికులను కంటతడి పెట్టించాయి.
Advertisement
Advertisement