marriage failure
-
విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పిందని..హత్య చేసిన మాజీ భర్త!
ఇటీల ఏం జరిగిన ప్రతి విషయాన్ని సోషల్ మాధ్యమ్యంలో షేర్ చేయడం ఒక అలవాటైపోయింది జనాలకు. ఇవి ఒక్కోసారి వారిని ఇబ్బందులకు గురి చేస్తాయనే స్ప్రుహ కూడా ఉండటం లేదు. అదీగాక వ్యూస్, ఫాలోవర్స్ మాయలో ఏ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వ్యక్తిగత విషయాలు గురించి చెప్పేటప్పుడూ కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీతో ఉండే వ్యక్తులకు అలా చెప్పడం నచ్చుతుందో లేదో తెలియదు. అందువల్ల లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక మహిళ సామాజిక మాధ్యమంలో తన వ్యక్తిగత విషయాలను చెప్పి.. విగత జీవిగా మారింది. వివరాల్లోకెళ్తే...పాకిస్తానీ అమెరికన్ మహిళ సానియా ఖాన్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించి వివాహం ఎందుకు విఫలమయ్యిందో, అందుకు దారితీసిని విషయాల గురించి సోషల్ మాధ్యమంలో షేర్ చేసింది. పైగా విడాకుల తీసుకున్న మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా వివరించింది. పైగా ఆమె మాజీ భర్త కుటుంబం నుంచి తనకు ఎదురైన కూడా పంచుకుంది. అంతే ఇది నచ్చిన ఆమె మాజీ భర్త ఆమెను చంపేందుకు రెడీ అయిపోయాడు. వాస్తవానికి సానియా ఖాన్ తన మాజీ భర్త రహెల్ అహ్మద్ ఇద్దరు ఐదేళ్లు డేటింగ్ చేసి గతేడాది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు చికాగోలో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. ఏమైందో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తి కొద్దిరోజుల్లోనే విడిపోయారు. దీంతో ఆమె టేనస్సీకి వెళ్లిపోదాం అనుకుంది. ఐతే ఆమె టిక్‌టాక్, ఇన్స్ట్రాగ్రాంలో మంచి యాక్టివిగ్ ఉంటుంది. తనకు ఆనందం కలిగినా, బాధ కలిగినా ఆ విషయాలను సోషల్ మీడియాలోని నెటిజన్లతో షేర్ చేసుకోవడం అలవాటే. అలానే ఆమె టేనస్సీకి బయలుదేరే సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయాలన్ని వివరిస్తూ...పోస్ట్‌లు పెట్టింది. పైగా తనలాంటి వాళ్ల కోసం పాటుపడతానని, సమాజం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి అవమానాన్నైనా తట్టుకుంటానంటూ చెప్పుకొచ్చింది. అంతే ఇది తెలుసుకున్న జార్జియాలో ఉన్న ఆమె మాజీ భర్త చికాగోలో ఉన్న తన వద్దకు వచ్చి తుపాకితో ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే అహ్మద్ తల్లిదండ్రలు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాధ ఘటన వెలుగు చూసింది. ఏదీ ఏమైన కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. (చదవండి: అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...) -
పెళ్లి రోజు ఆ మహిళ ఏం చేసిందో తెలుసా ?
చాలా మందికి తమ జీవితంలో పెళ్లి రోజులు చాలా మధురమైనవి. పెళ్లి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో బంధించుకొని జీవితాంతం దాచుకుంటారు. ఇలాగే తాను కూడా దాచుకోవాలని, భర్తతో కలసి ఉండాలని కలలు కనింది. కానీ పెళ్లి రోజు రాత్రి వచ్చిన కొన్ని మెసేజ్‌లు ఆమె జీవితాన్నే మార్చేశాయి. చివరకు పెళ్లిలో తోడుగా ఉంటానన్న ప్రామిస్ బదులు, ఆ మెసేజ్‌లు చదివి పెళ్లిని ఆపేసింది. ఆస్ట్రేలియాలో ఈ ఉదంతం వెలుగు చూసింది. మియా (పేరు మార్చాం) తాను ఆరేళ్లుగా ప్రేమిస్తున్న అలెక్స్‌ను (పేరు మార్చాం) పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంది. తెల్లవారితే పెళ్లి అనగా, ముందు రోజు రాత్రి గుర్తు తెలియని నంబర్ నుంచి కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. అది తెరచి చూస్తే, నేనతన్ని పెళ్లి చేసుకోను.. నువ్వు చేసుకుంటావా ? అనే మెసేజ్‌తో పాటు కొన్ని స్క్రీన్షాట్లు ఉన్నాయి. ఆ స్క్రీన్షాట్లలో తనకు కాబోయే భర్త మరెవరో ఓ అమ్మాయితో చేసిన చాటింగ్ ఉంది. అందులో కొద్ది నెలల నుంచి గత కొద్ది రోజుల వరకు జరిగిన చాటింగ్ ఉంది. తనకు కాబోయే భర్త మరొకరితో సన్నిహితంగా ఉండడం, సెక్సీగా ఉన్నావంటూ చేసిన ఆ చాట్ మియాను కుంగదీసింది. అతన్ని నమ్మినందుకు సిగ్గు పడుతూ, మోసపోయినందుకు కన్నీళ్ల పర్యంతమైంది. తెల్లవారితే జరిగే పెళ్లిని ఆపేయాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం తాను ఎంతగానో కలలుగన్న పెళ్లి గౌనును ధరించి చర్చిలోకి వచ్చింది. చర్చి అంతా బంధువులతో, స్నేహితులతో నిండిపోయి ఉంది. నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. అని బిగ్గరగా చెప్పింది. హాజరైన వారంతా ఏం జరిగిందా అని సైలెంట్ అయిపోయారు. రాత్రి వచ్చిన మెసేజ్‌లను అందరిముందు చదవడానికి సిధ్ధమైంది. అలెక్స్ ముందుకు వచ్చి ఆమె చేతులను పట్టుకున్నాడు. అయినా మియా చెప్పడానికే నిశ్చయించుకుంది. రాత్రి తనకు వచ్చిన మెసేజ్‌లు అన్నీ ఒక్కొక్కటిగా చదవడం ప్రారంభించింది. చదువుతూ ఉంటే అలెక్స్ ముఖంలో రంగులు మారసాగాయి. తప్పు చేసిన భావన అతడి ముఖంలో స్పష్టంగా కనబడింది. తర్వాత అక్కడికి వచ్చిన అతిథులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘వచ్చినందుకు మీకందరికి కృతజ్ఞతలు. ఇవాళ పెళ్లి వేడుకలు లేవు. నిజాయితీ, నిజమైన ప్రేమ గెలిచినందుకు వేడుకలు చేసుకుందాం. బాధ కలిగినప్పటికీ మనసు చెప్పినట్టు నడుచుకున్నాన’ని పేర్కొంది. ఇది విన్న వారంతా చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. ‘నా పెళ్లి రోజు గురించి ఎన్నో కలలు కన్నానని కానీ ఇలా జరిగిపోయిందని’ చెబుతూ ఆమె ముగించారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనను లెక్క చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి రావట్లేదన్న మనస్తాపంతో అతడీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరిగి సీతారామపురం కాలనీకి చెందిన ఆంజనేయులు (21) కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు హిందూపురానికి చెందిన ఓ యువతిని నాలుగు నెలల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరూ అదే కాలనీలోని తమ సొంతింట్లోనే కాపురం ఉంటున్నారు. అయితే, కొన్నాళ్ల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది, మళ్లీ తిరిగి రాలేదు. దాంతో ఆంజనేయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు గడియ పెట్టుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును 108 వాహనంలో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించేందుకు యత్నిస్తుండగానే మృతి చెందాడు.