హత్యకు గురైన రేవతి (ఫైల్)
తిరుత్తణి: ఆరు సవర్ల నగల కోసం మహిళను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెలుగుచూసింది. తిరుత్తణి తాలూకా తిరువాలాంగాడు లక్ష్మీవిలాసపురం గ్రామం సమీపంలో తల నరికిన స్థితిలో మహిళ మొండెంను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం గాలింపు చేపట్టి అదే ప్రాంతంలోని చెరువు కట్ట వద్ద తలను గుర్తించారు. కేసును ఛేదించేందుకు తిరుత్తణి డీఎస్పీ బాలచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళ చెన్నై అంబత్తూరు సమీపం పట్రవాక్కంకు చెందిన రేవతి(42)గా తెలిసింది. ఈమె పదేళ్ల కిందట భర్త రామచంద్రన్ విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
ఇలాఉండగా తిరువళ్లూరు సమీపం వేపంపట్టుకు చెందిన మారియప్పన్(37) పట్రవాక్కంలో రేవతి ఇంటికి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు. ఈ క్రమంలో రేవతి, మారియప్పన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 10న రేవతి, మారి బైక్‌పై వాలాజాలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తా ను వ్యాపారంలో నష్టపోయానని ఆదుకోవాలని మారి రేవతిని కోరాడు. అతనికి సహాయపడేందుకు రేవతి సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహించిన మారి కత్తితో ఆమె తల నరికి మెడలో ఉన్న ఆరుసవర్ల నగలు తీసుకుని తలను అక్కడి సమీపంలోని చెరువుకట్ట ప్రాంతంలో వేసి పరారయ్యాడు. నగల కోసం హత్య చేసినట్టు మారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment