ప్రేమ పేరుతో యువతులపై దాడులు మరింతగా పెరుగుతున్నాయి. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో కొందరు ప్రేమికులు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడి దాడిలో గాయపడిన యువతి మృతిచెందగా.. అతడు ఆసుప్రతిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
వివరాల ప్రకారం.. కర్నాటకలోని దావణగెరెలో పట్టపగలే ఓ వ్యక్తి.. యువతిపై కత్తితో దాడి చేశాడు. కాగా, అదే ప్రాంతానికి చెందిన సుల్తానా అనే యువతిని కొంత కాలంగా సాదత్ అలియాస్ చాంద్‌పీర్ అనే యువకుడు ఫాల్ చేస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా.. పెళ్లి చేసుకుంటానని కూడా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో సాదత్.. ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకుంటానని కోరాడు. కానీ, దీన్ని ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంకోసారి తమ కూతురు వెంటపడితే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యే సుల్తానాకు ఆమె పేరెంట్స్ మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన సాదత్.. ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే గురువారం ఓ షాపు వద్ద ఉన్న సుల్తానా దగ్గరకు వెళ్లిన సాదత్.. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించి తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం, బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు సుల్తానాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత.. సాదత్ కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్సలో భాగంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ಪ್ರೀತಿ ನಿರಾಕರಿಸಿದ ಯುವತಿ - ನಡು ರಸ್ತೆಯಲ್ಲೇ ಕೊಂದ ಪಾಗಲ್ ಪ್ರೇಮಿ https://t.co/qCFZISKAU5 #Davanagere #Police #Crime #Love #YoungWomen
— PublicTV (@publictvnews) December 22, 2022
Comments
Please login to add a commentAdd a comment