love problem
-
ప్రేమించి.. నమ్మించి.. మోసంచేసిన యువకుడు!
బల్మూర్: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. పెద్దల సమక్షంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. బల్మూర్ మండలంలోని బాణాలకు చెందిన కోట్ర శారద, అదే గ్రామానికి చెందిన మల్లేష్లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది కిందట యువతి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. అతడికి విడాకులు ఇవ్వాలని.. నేను పెళ్లి చేసుకుంటానని మల్లేష్ నమ్మించడంతో మూడు నెలల కిందట శారద తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం మల్లేష్ వద్ద పెళ్లి ప్రస్తావన తేగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో బుధవారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు బల్మూర్‌లో పంచాయితీ పెట్టి మాట్లాడుతుండగా.. మల్లేష్ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో పాటు కొందరు పెద్దలు శారదను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై యువతితో పాటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నారని, ప్రేమికుడితో పెళ్లి చేయించాలని కోరుతున్నారని ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. -
ఎల్బీనగర్లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు. వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్ ఎల్బీనగర్కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్‌ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్‌ను రామాంతపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు.. -
Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!
దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు(20) విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. బాలికపై 20సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్న నిందితున్ని ఒక్కరు కూడా నిలువరించకపోవడం గమనార్హం.ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది. వివరాలు.. ఢిల్లీ, రోహిణి ప్రాంతంలోని షహబాద్లో 16 ఏళ్ల బాలిక నివసిస్తోంది. సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడితో బాలిక స్నేహంగా ఉంటోంది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం తన స్నేహితురాలి కుమారుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమెను అడ్డగించిన నిందితుడు.. బాలికపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచాడు. ఒకనొక దశలో బాధితురాలి తలలో కత్తి ఇరుక్కుపోయేంత విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతటితో అగకుండా బండరాయితో మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్లు నిందితున్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అనంతరం ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. నిందితున్ని సాయిల్‌గా గుర్తించారు. అయితే.. బాధితురాలు, సాయిల్ ప్రేమించుకున్నారని సమాచారం. అమ్మాయి అతనితో గొడవపడిన అనంతరం నిందితుడు ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 18 గంటల అనంతరం నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి తగిన శిక్ష విధించాలని బాధితురాలి తల్లి కోరింది. మహిళలను రక్షించలేనప్పుడు ఆ పదవి ఎందుకని లెఫ్టినెంట్ గవర్నర్‌ను విమర్శించారు ఆప్ నేత అతిషి మర్లెన. తమ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ విమర్శించారు. ఇదో లవ్ జివాద్ కేసని అన్నారు. ఇదీ చదవండి:బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ! -
మరో వ్యక్తితో లవర్‌కు పెళ్లి ఫిక్స్.. ప్రియుడు ఏం చేశాడంటే..
ప్రేమ పేరుతో యువతులపై దాడులు మరింతగా పెరుగుతున్నాయి. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో కొందరు ప్రేమికులు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడి దాడిలో గాయపడిన యువతి మృతిచెందగా.. అతడు ఆసుప్రతిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని దావణగెరెలో పట్టపగలే ఓ వ్యక్తి.. యువతిపై కత్తితో దాడి చేశాడు. కాగా, అదే ప్రాంతానికి చెందిన సుల్తానా అనే యువతిని కొంత కాలంగా సాదత్ అలియాస్ చాంద్పీర్ అనే యువకుడు ఫాల్ చేస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా.. పెళ్లి చేసుకుంటానని కూడా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో సాదత్.. ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకుంటానని కోరాడు. కానీ, దీన్ని ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంకోసారి తమ కూతురు వెంటపడితే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే సుల్తానాకు ఆమె పేరెంట్స్ మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన సాదత్.. ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే గురువారం ఓ షాపు వద్ద ఉన్న సుల్తానా దగ్గరకు వెళ్లిన సాదత్.. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించి తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం, బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు సుల్తానాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత.. సాదత్ కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్సలో భాగంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ಪ್ರೀತಿ ನಿರಾಕರಿಸಿದ ಯುವತಿ - ನಡು ರಸ್ತೆಯಲ್ಲೇ ಕೊಂದ ಪಾಗಲ್ ಪ್ರೇಮಿ https://t.co/qCFZISKAU5 #Davanagere #Police #Crime #Love #YoungWomen — PublicTV (@publictvnews) December 22, 2022 -
వీడలేని ప్రేమ బంధం.. ప్రాణాలను బలితీసుకుంది
రాయచూరు రూరల్: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మస్కి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సింధనూరు డీఎస్పీ వెంకటప్ప నాయక్ కథనం మేరకు.. మస్కి తాలూకా కురేకల్లూరుకు చెందిన మేఘన(18), బాగల్‌కోట జిల్లా హునగుంద తాలూకా ఇలకల్ నివాసి ముత్తన్న నాయక్(18) ఆరు నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో వివాహానికి ఇరుకుటుంబాలవారూ నిరాకరించారు. దీంతో ఆ జంట తీవ్ర మనో వేదనకు గురైంది. ఈక్రమంలో మేఘన బుధవారం రాత్రి మస్కిలోని బావిలో దూకగా, ముత్తన్న నాయక్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మస్కి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
వరంగల్ (పాలకుర్తి) : ప్రేమించొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మండలంలోని మల్లంపల్లి గ్రామం బిక్షునాయక్ తండాకు చెందిన గుగులోతు ప్రియాంక(18) శనివారం ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె ఒకరిని ప్రేమించిందని తల్లిదండ్రులు మందలించారు. మనస్థాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియాంక తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. -
ఫేస్బుక్ ప్రేమ.. యువతి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: ఫేస్బుక్లో పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి రూ.3 లక్షల నగదు కాజేశాడు. ఆపై పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు..బెంగళూరుకు చెందిన ఓ యువతి (26), అక్కడే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. మదనపల్లె రెడ్డీస్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ కుమారుడు అబిద్ ఫేస్బుక్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఇది కాస్త ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. కొద్దిరోజులు గడిచాక ఇంటిపెద్దలు అంగీకరించలేదని పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో తట్టుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయంపై యువతి ఈ నెల12న మదనపల్లెకు వచ్చి అతని ఇంటిముందు బైఠాయించింది. ఈ క్రమంలో గురువారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దీనిపై ఫిర్యాదు చేసింది. అనంతరం మదనపల్లెలోని ఓ లాడ్జిలో ఆమె తన సోదరుడితో కలిసి గదిని అద్దెకు తీసుకుని అక్కడే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సోదరుడు లాడ్జీ సిబ్బంది సాయంతో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్రవంతే.. కావ్య, మనీషాలా మారి వేధించింది.. చివరికి..
సాక్షి, రాయపర్తి: ఒకే అమ్మాయి. మూడు పేర్లతో వ్యవహరించింది. మూడు వేర్వేరు ఫోన్ నంబర్లు వాడింది. ఓ యువకుడికి ప్రేమ వల విసిరింది. రకరకాల కథలు చెప్పింది. వేధింపులకు గురి చేసింది. బెదిరింపులకు కూడా దిగింది. చివరకు అతని ఆత్మహత్యకు కారణమయ్యింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మెరిపిరాలకు చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ కుమారుడు మైలపాక సందీప్‌కుమార్ (23) మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. తన సోదరితో కలిసి చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన స్రవంతి ఫోన్లో పరిచయమైంది. ఇద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే ఆమే మరో ఇద్దరు యువతుల్లాగా (కావ్య, మనీషా పేర్లతో) వేరే నంబర్లతో ఫోన్ చేయడం ప్రారంభించింది. ముగ్గురు అమ్మాయిల మాదిరి వ్యవహరిస్తూ నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని చెప్పొకొచ్చింది. కేవలం ఫోన్లో మాట్లాడటం తప్ప వారిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసుకోలేదు. ఇలా మాట్లాడే క్రమంలో సందీప్.. తాను మొదట పరిచయమైన స్రవంతినే ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. ఈ క్రమంలో స్రవంతికి పెళ్లి అయ్యింది. కానీ ఆమె మిగతా ఇద్దరిలాగా ఫోన్లో సందీప్‌తో మాట్లాడుతూనే ఉంది. మనీషా పేరుతో ఫోన్ చేస్తే.. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా.. నన్ను పెళ్లి చేసుకో అనేది. కావ్య పేరుతో ఫోన్ చేసినప్పుడు కూడా అలాగే అనేది. అయితే సందీప్ తాను ఒకే అమ్మాయిని ప్రేమించానని, ఆమె పెళ్లయిపోయింది కాబట్టి ఇక ఎవరినీ ప్రేమించలేనని చెప్పేవాడు. ఆరు నెలలు ఇలానే గడిచాయి. తర్వాత స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని, కాబట్టి తమను ప్రేమించకపోయినా పర్వాలేదుకానీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మిగతా ఇద్దరు పేర్లతో ఫోన్ చేసి వేధించడం ప్రారంభించింది. అయితే సందీప్.. తాను గతంలో ప్రేమించానని, తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఆమెను ఎలా చేసుకుంటానని చెప్పేవాడు. అయినా నీ కోసమే భర్తను వదిలేసి వచ్చిందని, పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని ఆ రెండు పేర్లతో ఫోన్లో మాట్లాడుతూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ ఈనెల 12న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. -
మూడు నెలలుగా చూస్తున్నా.. అతను రావడం లేదు
దొడ్డబళ్లాపురం : ప్రేమించానని రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకువచ్చిన ప్రియుడు ప్రియురాలిని అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోగా, ఎప్పటికయినా తన ప్రియుడు రాకపోతాడా అని ఆ యువతి గత మూడు నెలలుగా అదే చోట వేచి చూస్తున్న సంఘటన దేవనహళ్లి తాలూకా కారళ్లిలో వెలుగు చూసింది. కారళ్లి ప్రసిద్ధ నందికొండ వద్ద ఉంది. కారళ్లి గ్రామం పరిసరాల్లో గత మూడు నెలలుగా తిరుగుతున్న యువతి బేకరి, దుకాణాలు, బస్టాండులో సేదతీరుతూ, రోడ్డుకు అటూ, ఇటూ తిరుగుతూ, రాత్రి పూట స్థానిక బ్యాంకు ముందు పడుకుంటూ కాలం గడుపుతోంది. మొదట ఆమెను మానసిక అస్వస్థురాలుగా భావించిన గ్రామస్తులకు ఇటీవలే ఆమె విషాద ప్రేమ కథ తెలిసింది. కన్నడ భాష రాకపోవడంతో హిందీ తెలిసిన గ్రామస్తురాలయిన హసీనా అనే మహిళతో మాట్లాడించి వివరాలు తెలుసుకున్నారు. కోల్‌కతాకు చెందిన ఆ యువతిని అజయ్ అనే యువకుడు ప్రేమించాడు. ఇక్కడే నివసిద్దామని కారళ్లి వద్దకు తీసుకువచ్చి ఒక ఇంట్లో కొన్ని రోజులు ఉంచాడు. తరువాత కోల్‌కతా వెళ్లిపోదామని చెప్పి తీసికెళ్లి మార్గం మధ్యలో ఎక్కడో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ప్రియుడిపై ప్రేమను, నమ్మకాన్ని చంపుకోలేని యువతి ఎప్పటికయినా ప్రియుడు తనను వెదుక్కుంటూ ఇక్కడికే వస్తాడని ఆశతో కారళ్లి వద్దే వీధుల్లో నివసిస్తోంది. కథ విన్న గ్రామస్తులు ఆమె భద్రత కోసం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను బలవంతం మీద మహిళా సాంత్వన కేంద్రానికి తరలించి రక్షణ కల్పించారు. ఆ యువతి ప్రస్తుతం మానసికంగా బాగా కుంగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. -
దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!
సాక్షి, చిత్తూరు : తాను ఇష్ట పడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేనిపక్షంలో దూకేస్తానంటూ ఓ భగ్న ప్రేమికుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అంతే..! ట్రాఫిక్ జామ్..సెల్ కెమెరాలు టవర్ వైపు జూమ్..సామాజిక మాధ్యమాల్లో లైవ్..ఇతగాడు దిగతాడా? దూకేస్తాడా? అనే చర్చ. దిగరా నాయనా..అంటూ తల్లి, అమ్మమ్మ సెల్ఫోన్లో పదే పదే కోరుతున్నా ‘పెళ్లి చేస్తేనే’ అంటూ అక్కడే భీష్మించుకున్నాడు. ఈ ప్రేమికుడి యవ్వారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చిర్రెత్తించింది. మధ్యలో పూతలపట్టు ఎమ్మెల్యే కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొత్తానికి అందరికీ చుక్కలు చూపిన అతగాడిని ఎట్టకేలకు కిందకు దించగలిగారు. ఇక అతడికి తమదైన ‘పెళ్లి’ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఇక మేటర్లోకి వెళితే... స్థానిక వళ్లియప్పనగర్‌కు చెందిన సంపత్‌కుమార్ (25) ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఆటోలో వస్తూన్న తవణంపల్లె మండలానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరుకావడంతో ఆ యువతితో పెళ్లికి సంపత్‌కుమార్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదట! దీంతో మనస్తాపం చెందిన ఆ వీర ప్రేమికుడు ఓటీకే రోడ్డులో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. మేటరేమిటో తెలిశాక జనం చిన్నపాటి జాతర లెవెల్లో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ కూడా స్తంభించింది. అత్యుత్సాహవంతులు సెల్ కెమెరాలో దీనిని చిత్రీకరించి వైరల్ చేశారు. పోలీసులకూ సమాచారం అందడంతో టూటౌన్ సీఐ యుగంధర్, వన్ టౌన్ ఎస్ఐ మనోహర్ అక్కడికి చేరుకున్నారు. సెల్‌టవర్ నుంచి అతగాడు కిందకు విసిరేసిన చీటీలో తన ప్రేమ యవ్వారం గురించి ప్రస్తావించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎంతనచ్చచెప్పినా అతగాడు దిగలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగి సెల్ టవర్ చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వచ్చి తనకు న్యాయం చేయాలని సంపత్ పట్టుబట్టడంతో సమాచా రాన్ని ఆయనకు చేరవేశారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌కు చెందిన అమ్మాయి కావడంతో ఆయనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. చివరకు ఎంఎస్ బాబు అక్కడికి రాక తప్పలేదు. సెల్ఫోన్లో ఆయన సంపత్తో మాట్లాడి నచ్చచెప్పారు. దీంతో అతగాడు సెల్‌టవర్ దిగాడు. దీంతో గంటన్నర పాటు ఉత్కంఠకు తెరపడింది. అతడు ఇష్టపడిన అమ్మాయి మైనరని, ఆ అమ్మాయి అతగాడినేమీ ఇష్ట పడటం లేదని, ఇతడిదో వన్ సైడ్ లవ్ అని తెలిసింది. పోలీసులు కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. అతడిపై కేసు నమోదుకు రెడీ అవుతున్నారు. ఎవరైనా సెల్ టవర్ ఎక్కి ఇలాంటి పనులకు పూనుకుంటే ఉపేక్షించేది లేదని సీఐ తీవ్రంగా హెచ్చరించారు. పోలీసుల ట్రీట్మెంట్తో అతగాడి ప్రేమ మైకం దిగుతుందో, లేదో మరి! -
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
సాక్షి, అడ్డతీగల(తూర్పు గోదావరి) : ప్రేమ వ్యవహారం ఇద్దరు యువతీ యువకుల ప్రాణాలను తీసింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక.. పెద్దలు వారి ప్రేమ వివాహానికి అంగీకరించరనే అనుమానంతో ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. అడ్డతీగల మండలం డి.భీమవరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిది.. డి.భీమవరానికి చెందిన చెక్కాలింగేశ్వరరెడ్డి(20), మాకారపు సంధ్య భార్గవి(19) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు మందలించి కులాల వేర్వేరు కావడంతో వివాహం కుదరదని చెప్పి ముందు చదువులపై దృష్టి సారించమని చెప్పారంటున్నారు. అయినా ఇద్దరు ప్రేమ కొనసాగించడంతో ఆఖరికి పెద్దలు వివాహం చేయడానికి చూస్తామని చదువులు పూర్తి చేయమని ఇరువురికి హామీ ఇచ్చారు. నమ్మకం కలగని వీరిద్దరూ పెద్దలను బెదిరించి తమ దారికి తెచ్చుకుందామని తలచి ఈనెల 15న మండలంలోని పింజరికొండకు వెళ్లి వారి వెంట తీసుకువెళ్లిన పురుగు మందును తొలుత సంధ్య భార్గవి తాగింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను లింగేశ్వరరెడ్డి అక్కడి స్థానికుల సహాయంతో అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అదే రోజు మెరుగైన వైద్యం కోసం కాకినాడ రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన చెక్కా లింగేశ్వరరెడ్డి పింజరికొండ చేరుకుని అక్కడ దాచిపెట్టిన పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానిక గిరిజనులు గమనించి అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. లింగేశ్వరరెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పేరుతో వంచన
నువ్వంటే ఇష్టమన్నాడు. నువ్వులేనిదే లేనన్నాడు. పెళ్లిపేరుతో లొంగదీసుకున్నాడు. చివరికి తాళి కట్టమంటే పత్తాలేకుండా పోయాడు. తట్టుకోలేని బాధితురాలు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదోని టౌన్: మండల పరిధిలోని కుప్పగల్ గ్రామానికి చెందిన గురుస్వామి, తిప్పమ్మ కుమారుడు బోయ శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి మాయ మాటలకు నమ్మి సర్వం అర్పించింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని శ్రీనివాసుల వద్ద ప్రస్తావించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. నిరాకరించడంతో కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. చేసేదేమీ లేక వెనుదిరిగింది. మరోపక్క తల్లిదండ్రులు యువతిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబును ఆరా తీయగా ప్రేమపేరుతో మోసం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, విచారించి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు. -
మీ పార్టనర్‌తో బ్రేకప్ అయ్యారా ?
రిలేషన్షిప్లో అన్నీ అనుకున్నట్టే జరగవు. పరిస్థితులు సరిగా లేనవుడు సంయమనం కోల్పోవడం వల్ల రిలేషన్షిప్ కొన్ని సార్లు బ్రేకప్ అవుతుంది. అతడు/ఆమె మీకు సరైన జోడీనే అయినప్పటికీ చిన్న కారణాలకే మీరు బ్రేకప్ అయి ఉంటే కింది విషయాలు మీరు లోతుగా ఆలోచించుకొని బంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి. మీ సమస్యకు పరిష్కారం లేదా ? మీరు విడిపోవడానికి అసలు బలమైన కారణం ఉందా? లేక భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక జరిగిన గొడవ వల్ల విడిపోయారా? రిలేషన్‌షిప్‌లోని ప్రతీ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించవచ్చు. విడిపోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారమవుతుందా అనే ప్రశ్నను వేసుకొని లోతుగా పరిశీలించుకోవాలి. సెన్సిటివ్ విషయాలను సరిగా డీల్ చేయడం నేర్చుకుంటే చాలా వరకు రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవచ్చు. నిజంగా అతడు/ఆమె మీద కోపమేనా? కొన్నిసార్లు ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మీ పార్టనర్ మీద చూపించి ఉంటారు. ఉదాహరణకు ఆఫీస్‌లో బాస్ మిమ్మల్ని తిడితే, మీరు అతన్ని ఏమీ అనలేక ఇంటికెళ్లాక మీ పార్టనర్ మీద చూపించి ఉండవచ్చు. లోతుగా పరిశీలించుకుంటే తప్ప ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. అతడు/ఆమె మీకు కరెక్టేనా ? కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనపుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి తమను పట్టించుకోవడం లేదనిపించడం సహజం. అలాంటి సమయంలో ఒకటికి రెండు సార్లు పరిస్థితిని క్షుణ్ణంగా వివరించడం ఉత్తమం. మీ పార్ట్నర్ను అడగకుండా మీకై మీరే ఓ అభిప్రాయానికి రావడం సరైనది కాదు. ఇద్దరూ ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నంత కాలం విడిపోవడమనేది సరైన నిర్ణయం అనిపించుకోదు. ఇంకా ప్రేమిస్తున్నారేమో..! ఏదైనా కారణం వల్ల మీరు విడిపోయినప్పటికీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉండొచ్చు. గతంలో మీరు మెలిగిన తీరును బట్టి మీరు చేసిన తప్పును మన్నించి రెండో అవకాశం ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉండవచ్చు. గొడవ జరిగి విడిపోయినప్పటికీ కొంత కాలానికి తిరిగి మిమ్మల్ని కోరుకుంటూ ఉండవచ్చు. కాబట్టి ఒకసారి మీ పార్ట్నర్తో మాట్లాడటానికి ప్రయత్నించండి. గతం గుర్తొస్తుందా..? మీరు గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు మీకు చాలా సార్లు గుర్తొస్తూ ఉండవచ్చు. మీరు విడిపోయిన క్షణం చాలా బలహీనమైనదని, ఆ నిర్ణయం తీసుకున్నందుకు మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఇంకా మీ పార్టనర్ పట్ల ప్రేమను కలిగివున్నారనే అర్థం. మరిక ఆలస్యం దేనికి.. వెంటనే మీ పార్టనర్‌కి కాల్ చేసేయండి. కాల్ చేసే ధైర్యం లేకపోతే మెసెజ్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఇందుకే ఉన్నాయి మరి... -
ప్రేమ వివాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య
బనశంకరి: చిన్నపాటి మనస్పర్థల కారణంగా ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రేమికురాలు కూడా బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఉడిపి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వివరాలు... దావణగెరె జిల్లా మలెబెన్నూరు హిడగనగట్టి గ్రామానికి చెందిన నాగరాజు (27) ఉడిపి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇదే పీఎస్‌లో రమ్య (23) మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువైపులా కూడా వీరి పెళ్లికి సమ్మతించారు. ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్న విషయాలకు త రచూ గొడవపడేవారు. ఆదివారం తెల్లవారుజామున నాగరాజు తన చావుకు ఎవరూ కారణంగా కాదని లేఖ రాసి క్వార్టర్స్‌లోనే ఫ్యాన్‌కు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణవార్త తెలియగానే రమ్య స్టేషన్ ఆవరణలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. సహచర పోలీసులు హుటాహుటిన బావిలోకి దిగి ఆమెను కాపాడారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాయమాటలు చెప్పి ...
పెళ్లి చేసుకోమని ప్రియురాలి మౌనదీక్ష సుందరాడ(తెర్లాం రూరల్): ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకొని ముఖం చాటేశాడొక ప్రేమికుడు. దీంతో దగాపడిన ప్రేమికురాలు సుందరాడలోని ప్రేమికుని ఇంటి ముందు బుధవారం మౌనదీక్ష ప్రారంభించింది. బాధితురాలు పద్మ విలేకరులకు అందించిన వివరాలివి. సుందరాడ గ్రామానికి చెందిన ముత్తా పెదలక్ష్మణ, సీతల కుమార్తె పద్మ(19) అదే గ్రామానికి చెందిన సిగిరికోట గణపతి, కృష్ణవేణిల కుమారుడు శివాజీతో ఏడాదికి పైగా ప్రేమ వ్యవహారం నడిచింది. కానీ పద్మకు 2015లో పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామానికి చెందిన శంకర్‌తో తల్లిదండ్రులు వివాహం చేశారు. పద్మ, శంకర్లు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ లో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో శివాజీ హైదరాబాద్ వెళ్లి పద్మకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఇది భర్త శంకర్‌కు తెలియడంతో ఉభయుల తల్లిదండ్రులు, రెండు గ్రామాల పెద్దల ముందు సమస్య పెట్టాడు. శివాజీని ఇరు గ్రామాల పెద్దలు నిలదీయగా పద్మ అంటే తనకు ఇష్టమని, భర్తతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పద్మ, శంకర్లకు విడాకుల అగ్రిమెంట్లు రాయించి పద్మను సుందరాడకు తీసుకొచ్చారు. సుందరాడ వచ్చాక శివాజీ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసు స్టేషన్లో కేసులు పెట్టనని, శివాజీ పెళ్లి చేసుకొనేంత వరకు అతని ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తి లేదని పద్మ స్పష్టం చేసింది. ఆమె చెప్పిన విషయాలన్నీ వాస్తవమని గ్రామస్తులు చెప్పారు. పద్మ ప్రేమ వ్యవహారంపై ప్రియుడు శివాజీని ప్రశ్నించగా తనకెలాంటి సంబంధం లేదని, కావాలనే నిందలు వేస్తున్నారన్నాడు. పద్మ, శివాజీ ప్రేమ వ్యవహారంపై ఫిర్యాదు అంద లేదని తెర్లాం ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. శివాజీపై కేసు నమోదు చేయవద్దని, అతనితో పెళ్లి చేయించమని పద్మ కోరిందన్నారు. సమస్యపై గ్రామపెద్దలతో మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిపారు. నా కుమార్తెకు న్యాయం చేయండి నా కుమార్తె ప్రేమించిన శివాజీతో వివాహం చేయించి న్యాయం చేయండి. కుమార్తెకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే శివాజీ వే ధించాడు. భర్తతో తెగతెంపులు చేయించాడు. పెళ్లి చేసుకుంటానని గ్రామ పెద్దల ఎదుట చెప్పి ఇప్పుడు కాదనడం ఎంతవరకు న్యాయం. - ముత్తా పెదలక్ష్మణ -
ప్రేమే తొక్కేసింది
రెండక్షరాల ప్రేమ చాలా శక్తి కలది. అది మనిషి జీవితాన్ని ఆకాశానికి ఎత్తేయగలదు, పాతాళానికి తొక్కేయగలదు. నటి ఆర్తి అగర్వాల్ జీవితం రెండో కోవకు చెందినది. తమిళంలో బంపర కన్నాలే చిత్రం ద్వారా పరిచయమైన ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించి టాప్నాయకిగా వెలుగొందారు. అలాంటి ఆర్తి ప్రేమలో పడి అందులో పరాజయం పాలై చివరికి ఆత్మహత్యకు యత్నించారు. ఆ దుర్ఘటన తరువాత అవకాశాలిచ్చే వారే లేకపోయే. ఆర్తి మాట్లాడుతూ, ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని కథానాయికగా లైమ్‌లైట్‌లో వున్న తాను మంచి అవకాశాలను దూరం చేసుకున్నానని తెలిపారు. అయితే తన జీవితంలో ఆశించిందేదీ సరిగా జరగలేదన్నారు. ప్రేమ కారణంగా చాలా నష్టపోయానని పేర్కొన్నారు. ఒకప్పుడు కోరి వచ్చిన అవకాశాలను తిరస్కరించిన తాను ఇప్పుడు నటిద్దామన్నా అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళం, తెలుగు ఏ భాషలోనైనా మంచి అవకాశం వస్తే నటించడానికి సిద్ధం అన్నట్లు ఆర్తి అగర్వాల్ పేర్కొన్నారు.