
దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు(20) విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. బాలికపై 20సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్న నిందితున్ని ఒక్కరు కూడా నిలువరించకపోవడం గమనార్హం.ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది.
వివరాలు.. ఢిల్లీ, రోహిణి ప్రాంతంలోని షహబాద్‍లో 16 ఏళ్ల బాలిక నివసిస్తోంది. సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడితో బాలిక స్నేహంగా ఉంటోంది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం తన స్నేహితురాలి కుమారుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమెను అడ్డగించిన నిందితుడు.. బాలికపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచాడు.
ఒకనొక దశలో బాధితురాలి తలలో కత్తి ఇరుక్కుపోయేంత విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతటితో అగకుండా బండరాయితో మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్లు నిందితున్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అనంతరం ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. నిందితున్ని సాయిల్‌గా గుర్తించారు. అయితే.. బాధితురాలు, సాయిల్ ప్రేమించుకున్నారని సమాచారం. అమ్మాయి అతనితో గొడవపడిన అనంతరం నిందితుడు ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 18 గంటల అనంతరం నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితునికి తగిన శిక్ష విధించాలని బాధితురాలి తల్లి కోరింది. మహిళలను రక్షించలేనప్పుడు ఆ పదవి ఎందుకని లెఫ్టినెంట్ గవర్నర్‍ను విమర్శించారు ఆప్ నేత అతిషి మర్లెన. తమ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ విమర్శించారు. ఇదో లవ్ జివాద్ కేసని అన్నారు.
ఇదీ చదవండి:బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!
Comments
Please login to add a commentAdd a comment