Girl stabbed
-
‘నాన్న నేను లాయర్ అవుతానని చెప్పి.. ఉన్మాది కత్తికి బలైంది’
న్యూఢిల్లీ: రోజూ వారి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంచే ఆ తండ్రి సంపన్నుడు కానప్పటికీ తన కూతురిని ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. ఇక ఆ బాలిక కూడా అందుకు తగ్గట్లే ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. ఆ ఆనందాన్ని కుటుంబంతో పంచుకుని తాను లాయర్ కావాలన్న తన కలను తండ్రితో పంచుకుంది. అయితే పాపం తనకు తెలియదు స్నేహితుడే కాలయముడై తన కలలని కాలరాస్తూ, అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తాడని. స్నేహితురాలి ఇంటి నుంచి వస్తున్న ఆమెను మృత్యువు వెంబడిస్తోందని తెలుసుకోలేకపోయింది.. దారుణంగా హతమైంది. ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షాబాద్ డెయిరీ ప్రాంతానికి చెందిన సాక్షి అనే పదహారేళ్ల బాలిక ఉన్నాది కత్తికి బలైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న తన కూతురు మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి జనక్‌రాజ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డ లాయర్ కావాలనుకుంటున్నట్లు తనకు చెప్పిందని.. కానీ ఇలా దారుణం జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.తన కూతురిని కిరాతకంగా చంపిన నిందితుడిని ఉరిశిక్ష విధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సాహిల్(నిందితుడు) గురించి తనకు ఏమీ తెలియదని, సాక్షి తన స్నేహితుల గురించి మాకు చెప్పింది, కానీ అతని గురించి ఎప్పుడూ చెప్పలేదని చెప్పాడు. పోలీసులు మాత్రం సాక్షికి, నిందితుడు సాహిల్ గత కొంత కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారని, శనివారం వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని చెబుతున్నారు. ఆదివారం పుట్టినరోజు వేడుక కోసం బయటకు వచ్చిన సాక్షిని అనుసరించి ఆమెతో మరోమారు సాహిల్ వాగ్వివాదానికి దిగాడు. #WATCH | Delhi | CCTV visuals show accused Sahil in the Shahbad Dairy area, before he murdered the 16-year-old girl, on 28th May. (Video: CCTV visuals confirmed by Police) pic.twitter.com/VAmr0EikXu — ANI (@ANI) May 30, 2023 ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయి ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఈ దారుణం జరుగుతుండగా ఆ వీధిలో పలువురు చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవ్వరూ అతడిని ఆపేందుకు ప్రయత్నించలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్ డెయిరీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి అరెస్టు చేశారు. #WATCH | Uttar Pradesh: Sahil, accused of killing a 16-year-old minor girl in Delhi's Shahbad dairy, was brought to a local hospital in Pahasu, Bulandshahr. pic.twitter.com/bL1w4gewT7 — ANI (@ANI) May 29, 2023 చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!
దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు(20) విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. బాలికపై 20సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్న నిందితున్ని ఒక్కరు కూడా నిలువరించకపోవడం గమనార్హం.ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది. వివరాలు.. ఢిల్లీ, రోహిణి ప్రాంతంలోని షహబాద్లో 16 ఏళ్ల బాలిక నివసిస్తోంది. సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడితో బాలిక స్నేహంగా ఉంటోంది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం తన స్నేహితురాలి కుమారుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమెను అడ్డగించిన నిందితుడు.. బాలికపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచాడు. ఒకనొక దశలో బాధితురాలి తలలో కత్తి ఇరుక్కుపోయేంత విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంతటితో అగకుండా బండరాయితో మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్లు నిందితున్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అనంతరం ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. నిందితున్ని సాయిల్‌గా గుర్తించారు. అయితే.. బాధితురాలు, సాయిల్ ప్రేమించుకున్నారని సమాచారం. అమ్మాయి అతనితో గొడవపడిన అనంతరం నిందితుడు ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 18 గంటల అనంతరం నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి తగిన శిక్ష విధించాలని బాధితురాలి తల్లి కోరింది. మహిళలను రక్షించలేనప్పుడు ఆ పదవి ఎందుకని లెఫ్టినెంట్ గవర్నర్‌ను విమర్శించారు ఆప్ నేత అతిషి మర్లెన. తమ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ విమర్శించారు. ఇదో లవ్ జివాద్ కేసని అన్నారు. ఇదీ చదవండి:బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ! -
బస్సులోంచి బయటకు లాక్కెళ్లి...
భోపాల్: నడుస్తున్న బస్సులోంచి యువతిని బయటకు లాగి దారుణంగా పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకుంది. మాడ్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోట్రా గ్రామంలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. డిగ్రీ విద్యార్థిని సంజూ(18)ను నిందితుడు శివేంద్ర సింగ్ అలియాస్ శిబ్బు పొడిచి చంపాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సంజూను బస్సులోంచి దౌర్జన్యంగా బయటకు లాక్కొచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన బస్సు కండక్టర్ ను కూడా అతడు కత్తితో పొడిచాడు. ఎవరైన తనను అడ్డుకుంటే పెట్రోల్ పోసి బస్సను తగలబెడతానని ప్రయాణికులను శిబ్బు బెదిరించాడని పోలీసులు తెలిపారు. పలుమార్లుకత్తితో పొడవడంతో సంజూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిందని చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా సంజూను శిబ్బు వేధిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సంజూ మృతదేహంతో ధర్నాకు దిగారు.