వరంగల్ (పాలకుర్తి) : ప్రేమించొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మండలంలోని మల్లంపల్లి గ్రామం బిక్షునాయక్ తండాకు చెందిన గుగులోతు ప్రియాంక(18) శనివారం ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె ఒకరిని ప్రేమించిందని తల్లిదండ్రులు మందలించారు. మనస్థాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియాంక తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment