ఎల్బీనగర్‌లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా? | Shiva Kumar Attack On Pruthvi And Sanghavi At LB Nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌లో దారుణం.. పృథ్వీ మృతి, సంఘవికి తీవ్రగాయాలు

Published Sun, Sep 3 2023 5:01 PM | Last Updated on Sun, Sep 3 2023 6:35 PM

Shiva Kumar Attack On Pruthvi And Sanghavi At LB Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు.

వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్‌ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్‌ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్‌ ఎల్బీనగర్‌కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్‌.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్‌ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్‌ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్‌ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్‌ను రామాంతపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement