కొత్త పేట చౌరస్తాలో దారుణం | husband attack wife with knife in kotthapet | Sakshi
Sakshi News home page

కొత్త పేట చౌరస్తాలో దారుణం

Published Sat, Dec 3 2016 8:27 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

husband attack wife with knife in kotthapet

హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది. కాపురానికి రావడం లేదని ఓ యువకుడు తన భార్యపై బ్లేడుతో శనివారం సాయంత్రం దాడి చేశాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఉస్మానియ ఆస్పత్రికి తరలిచి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

వివరాలు..సంగారెడ్డి జిల్లాకు చెందిన మమత(19) నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ నర్సింగ్ విద్యనభ్యసిస్తొంది. ఈ క్రమంలో బీకామ్ చదువుతున్న రమేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరు పెద్దలకు చెప్పకుండా.. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిని మందలించి మమతను అతని నుంచి దూరం చేశారు. అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తున్న రమేష్ శనివారం ఆమెపై బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement