‘చనిపోతున్నాను.. రక్షించండి’ | Help Me, Begged Woman Slashed With Axe By Husband | Sakshi
Sakshi News home page

‘చనిపోతున్నాను.. రక్షించండి’

Jul 3 2017 2:59 PM | Updated on Sep 5 2017 3:06 PM

‘చనిపోతున్నాను.. రక్షించండి’

‘చనిపోతున్నాను.. రక్షించండి’

మరోసారి మానవత్వం మంటగలిసింది. భర్త చేతిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కొట్టుకుంటూ రక్షించండి అని అరుస్తున్నా చుట్టుపక్కల వారు నిర్దయగా వ్యవహరించారు.

జింద్‌: మరోసారి మానవత్వం మంటగలిసింది. భర్త చేతిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కొట్టుకుంటూ రక్షించండి అని అరుస్తున్నా చుట్టుపక్కల వారు నిర్దయగా వ్యవహరించారు. ఆమెకు సహాయం చేయాల్సింది పోయి తమ మొబైల్‌ ఫోన్‌లలో వీడియోలు తీసుకుంటూ ఉండిపోయారు. ఆమె కన్నబిడ్డలు చుట్టూ చేరి రోదిస్తున్నా ఒక్కరూ కనికరించలేదు. ఈ దయనీయ ఘటన హర్యానాలోని జింద్‌లో చోటు చేసుకుంది. మరోలీ అనే గ్రామంలో సంజూ అనే మహిళ ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త నరేశ్‌ మంచివాడు కాదు. నిత్యం గొడవపడుతూ హింసిస్తుండేవాడు.

ఈ క్రమంలో ఒకసారి తన భర్తపై కేసు పెట్టింది. శుక్రవారం రోజు సాయంత్రం బయటకు వెళ్లిన సంజు ఇంటికి రాగానే వెంటనే ఆమె కళ్లలో కారం పోశాడు. ఆ వెంటనే చెట్లను, మొద్దులను కత్తిరించేందుకు ఉపయోగించే రంపంతో ఆమె భుజంపై, కడుపులో, మొకాలిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఇంటిముందే నడివీధిలో పడిపోయింది. తాను చనిపోతున్నానని, రక్షించాలని ప్రాధేయపడినా ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా ఓ వ్యక్తి వీడియో తీసుకుంటూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని గట్టిగా మందలించిన పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోనే ఉంది. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement