సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్‌తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్‌కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్‌లో కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment