తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవోలతోనే సరిపెట్టిందని, అన్ని సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్నిరకాలుగా ప్రజలను ఆదుకుంటామని ఈటెల ఈ సందర్భంగా సభలో హామీ ఇచ్చారు.
కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై వైఎస్ఆర్ సీపీ, గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీపై సీపీఎం, సీపీఐ, పెన్షన్లు, ఆహార భద్రతపై టీడీపీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఉద్యోగుల భర్తీపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.