తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం: ఈటెల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ నిరుపేద వర్గాలను ఆదుకోవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు న్యాయం జరగటం లేదన్నారు. లబ్దిదారుల ఎంపికలో బ్యాంకులను పక్కన పెట్టాలని సూచించారు.