
నేటితో ముగియనున్న బడ్జెట్ చర్చ
హైదరాబాద్: బడ్జెట్ పై చివరి రోజు చర్చలో భాగంగా గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉదయం ప్రారంభించబోయే ప్రశ్నోత్తరాల సమయం రద్దైంది. దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై చర్చను కొనసాగించనున్నారు. బడ్జెట్ పై చర్చను ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బడ్జెట్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిస్తారు. బడ్జెట్ పై జరుగుతున్న చర్చ నేటితో ముగియనుంది.