budget discussion
-
‘టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ ’
-
‘టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ’
అమరావతి: శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని... టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని నిర్మాణాలు తాత్కాలికమే అని బుగ్గన అన్నారు. సెక్రటేరియట్ నుంచి ప్రాజెక్టుల వరకూ అన్నీ టెంపరరీ నిర్మాణాలే అని ఆయన ఎద్దేవా చేశారు. వెలగపూడిలో సెక్రటేరియట్ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వరకూ అంతా టెంపరరీయే అని అన్నారు. పట్టిసీమకు రూ.1300 కోటర్లు ఖర్చు చేశారని బుగ్గన అన్నారు. అయితే బుగ్గన మాట్లాడుతుండగానే మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బుగ్గన అరవై నిమిషాలు మాట్లాడినప్పటికీ చర్చను ముగించలేదని స్పీకర్ పేర్కొన్నారు. సమయం ముగిసినందునే మైక్ కట్ చేసినట్లు ఆయన తెలిపారు. దయచేసి సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని, సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. -
‘టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ’
-
ఏపీ బడ్జెట్ అంకెల గారడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి అవాస్తవాలతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బడ్జెట్‌పై చర్చలో మాట్లాడుతూ.. 'ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలను ముందుకుతీసుకెళ్లేది కాదు. విభజన తర్వాతి పరిస్థితిలో ఈ బడ్జెట్ రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదముంది. ఆర్థిక వ్యూహం రాష్ట్రానికి ప్రమాదం తెచ్చేలా ఉంది. రాష్ట్ర అప్పులు వచ్చే సంవత్సరంనాటికి 1,96,000 కోట్లకు చేరుతాయని అంటున్నారు. బడ్జెట్ 20 శాతం పెరిగినా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అన్నింటికీ నిధులు తగ్గించేశారు' అని చెప్పారు. ఈ బడ్జెట్ అంకెల గారడీ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 'మనం 11 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించామని చెబుతున్నారు. చంద్రబాబు అవినీతి, అన్యాయాలు, దోపిడీ వల్ల పంట విస్తీర్ణం తగ్గిపోయింది. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి వచ్చిన పాపాన పోలేదు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగితేనే జీఎస్డీపీ పెరుగుతుంది. ఆ రెండు రంగాలూ కుంటుపడినా కూడా జీఎస్డీపీ పెరిగిందనడం పూర్తిగా తప్పు. ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన ముఖ్యమంత్రి అవాస్తవాలు చెబుతూ మభ్యపెడుతున్నారు' అని చెప్పారు. -
వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతింది
-
మండలానికి ఒక స్కూల్ అంటే ఎలా
-
డీజల్,పెట్రోల్ ధరల పై మాట్లాడుతోన్న జగన్
-
'క్షమాపణ చెప్పేందుకు అభ్యంతరం లేదు'
-
చంద్రబాబు క్షమాపణ చెప్పలేదు: వైఎస్ జగన్
-
ప్రజల సమస్యలు మాట్లాడటానికే అసెంబ్లీ ఉంది
-
బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్
-
రెండు నిమిషాలు మైక్ ఇచ్చే బదులు...
-
రాజధాని అంశంపై 344 కింద చర్చకు అడిగాం
-
చంద్రబాబు శ్రీరామనవమి కానుక ఇచ్చారు
-
పవర్ అనేది చాలా ముఖ్యం : చంద్రబాబు
-
అధికారపక్షం తీరును తప్పుపట్టిన కామన్ పీపుల్!
-
సభ చివరి 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే..!
-
గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు
-
నేటితో ముగియనున్న బడ్జెట్ చర్చ
హైదరాబాద్: బడ్జెట్ పై చివరి రోజు చర్చలో భాగంగా గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉదయం ప్రారంభించబోయే ప్రశ్నోత్తరాల సమయం రద్దైంది. దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై చర్చను కొనసాగించనున్నారు. బడ్జెట్ పై చర్చను ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బడ్జెట్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిస్తారు. బడ్జెట్ పై జరుగుతున్న చర్చ నేటితో ముగియనుంది. -
ఆవేశపడొద్దు మార్కులు పడతాయి...
-
పట్టిసీమకు టెండర్లు వేసింది ఇద్దరే - జగన్
-
టెండర్లలో లేని బోనస్ తరువాత ఇవ్వడం ఏంటీ?
-
రైతు బంధు అమలు చేస్తాం:హరీష్‌రావు
-
''నదుల అనుసంధానంపై జాతీయస్థాయిలో చర్చ''
-
ప్రతిపక్షం వాయిస్ వినాలి: వైఎస్ జగన్
-
హోంమంత్రి గారు అరెస్టులు భావ్యమేనా?
-
మంత్రిగారు క్లారిఫికేషన్ ఇవ్వండి: వైఎస్ జగన్
హైదరాబాద్ : గృహ నిర్మాణ రంగంపై మంత్రి కిమిడి మృణాళిని ఇచ్చిన జవాబుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది. జియో ట్యాగింగ్ విధానంపై మంత్రి జవాబును తాను సరిగ్గా వినలేకపోయాననని, దానిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. తాను మంత్రిగారిని కేవలం క్లారిఫికేషన్ మాత్రమే కోరానని, ప్రశ్నించటం లేదని ఆయన అన్నారు. గృహ నిర్మాణ రంగంలో అవకతవకలు జరిగాయా లేదా అనే విషయాన్ని స్పష్టంగా తెలిపాలన్నారు. ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జోక్యం చేసుకుని వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. అయితే మంత్రి సమాధానం స్పష్టంగా లేదని ప్రతిపక్షం మరోసారి ప్రశ్నించింది. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా మంత్రి సూటిగా సమాధానం చెప్తే బాగుంటుందని సూచించారు. అంతకు ముందు మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. కాగా గతంలో నిర్మించిన ఇళ్లు వాస్తవంగా నిర్మించారా.. లేదా అసలైన లబ్ధిదారులే ఉన్నారా? తదితర వివరాలు సేకరించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. -
'ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై వివరణివ్వండి'
-
బడ్జెట్‌పై చర్చ ప్రారంభించనున్న వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా జరగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌పై నేడు శాసనసభలో చర్చ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం బడ్జెట్‌పై చర్చ ప్ర్రారంభిస్తారు. కాగా ప్రతిపక్ష నేత నాలుగు రోజుల ముందే బడ్జెట్‌పై అధికార పార్టీని కడిగి పారేస్తామని వెల్లడించటంతో ప్రభుత్వానికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది. దీంతో వైఎస్ జగన్ ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రతిపక్షంపై ఎదురు దాడి చేసేందుకు కొంతమంది మంత్రులను సిద్ధం చేసినట్లు సమాచారం. -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
-
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలు, మద్దతు ధరపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులు కోరగా, నోటీసు ఇస్తే చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ తెలిపారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. -
అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలు, మద్దతు ధరపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు బడ్జెట్‌పై నేటి నుంచి చర్చ ప్రారంభం కానుంది. శాసనసభాప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తారు. -
నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ!
-
నేటీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ పై చర్చ
-
తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌పై చర్చ
హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో శుక్రవారం నుంచి బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమర్పించిన బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో భూముల క్రమబద్దీకరణ, ఉద్యోగులకు వేతన సవరణ, నదుల అనుసంధానం, దీపం పథకం, మిషన్ కాకతీయ, యాదగిరిగుట్ట అభివృద్ధి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్‌కు నూతన భవన నిర్మాణం లాంటి అంశాలు సభ ముందుకు రానున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశముంది. రైతుల ఆత్మహత్యలు, సమస్యలు , కరువుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. -
ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు
ప్రభుత్వంపై జగన్ ధ్వజం బాబొస్తేనే జాబొస్తుందంటూ ఊదరగొట్టారు జాబులు రాలేదు.. జీతాలూ రావడం లేదు చంద్రబాబు పుణ్యమా అని ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు నిరుద్యోగ భృతి కోసం 1.75 కోట్ల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి డీఎస్సీ, ఏపీపీఎస్సీ అభ్యర్థులు చదువుకుంటూనే ఉన్నారు సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ పత్రిక చూసినా జాబు రావాలంటే బాబు రావాలి, బాబొస్తేనే జాబొస్తుంది అంటూ ఊదరగొట్టారు. పోస్టర్లు, పాం ప్లెట్ల ద్వారా ఇంటింటి ప్రచారం చేశారు. బాబొచ్చి 9 నెలలు పూర్తయింది. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా..’ అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం వైఎస్సార్సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతుండగా.. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. దీంతో జగన్ కలుగజేసుకుని.. ‘ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు. ఉద్యోగాలు రాకపోతే ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఈవేళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారా? ఇదిగో చూడండి మీ గెజిట్ (ఈనాడు)లోనే వచ్చింది, 10 నెలలుగా జీతాలు లేక ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెం దారు. ఇది చంద్రబాబు పుణ్యమే..’ అని ధ్వజ మెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని జగన్ మండిపడ్డారు. డీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం నిరుద్యోగ యువకులు చదువుతూనే ఉన్నారు.. చదువుతూనే ఉన్నారు. కానీ నోటిఫికేషన్లు రా వు. ఉద్యోగాలు రావు, కనీసం సర్వీస్ కమిషన్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేకపోయా రు.’ అని ధ్వజమెత్తారు. 1.75 కోట్ల కుటుంబా లు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయని, కానీ చంద్రబాబు సంతకం పెట్టి వదిలేశారని ఎద్దేవాచేశారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు: అచ్చెన్నాయుడు జగన్ వ్యాఖ్యలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదన్నారు. గతంలో లాగా సొంత మనుషులకు ఉద్యోగాలు కట్టబెట్టకుండా అందరికీ వృత్తి నైపుణ్యాల పేరుతో శిక్షణ ఇచ్చి (స్కిల్ డెవలప్మెంట్) ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని అన్నారు. బాబు వచ్చారు కాబట్టి జాబు తప్పకుండా వస్తుందని చెప్పుకొచ్చారు. పదివేల పోస్టులకు నోటిఫికేషన్... ప్రతిపక్ష నేత జగన్, వైఎస్సార్సీపీ సభ్యుడు బుగ్గన వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. బాబొస్తే జాబొస్తుందని చెప్పామని, అందుకే వచ్చే మేలో 10,312 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతి విషయాన్నీ అబద్ధంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మా సభ్యులు ఎలా మాట్లాడాలో మీరెలా నిర్ణయిస్తారు? శాసనసభలో ఏం మాట్లాడాలనే విషయంలో ప్రతిపక్ష సభ్యులకు హక్కు ఉంటుందని, ఏం మాట్లాడాలనేది శాసనసభాపతి నిర్దేశించలేరని జగన్ చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైఎస్సార్సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో వివరణ కోసం టీడీపీ సభ్యుడు శ్రవణ్‌కుమార్‌కు స్పీకర్ మైకు ఇచ్చారు. అదే సందర్భంలో కోడెల.. మీరు సభలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని బుగ్గనను ఉద్దేశించి అన్నారు. గత శాసనసభలో తెలుగువారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని, అలా మాట్లాడకూడదని చెప్పారు. బుగ్గన స్పందిస్తూ తాను అలా మాట్లాడలేదని, ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదని వివరించారు. ఈ దశలో జగన్ జోక్యం చేసుకుని స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది. మా సభ్యులు ఎలా మాట్లాడాలో కూడా మీరే నిర్ణయిస్తారా? మీరు స్పీకరా? టీడీపీ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారా?’ అంటూ ప్రశ్నించారు. స్పీకర్‌గా వ్యవహరించాలని, టీడీపీ సభ్యులుగా కాదని సూచించారు. తమ నేత వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్సార్సీపీ సభ్యులు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ తిరిగి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మైకు ఇచ్చారు. -
బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్
* ప్రభుత్వానికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హెచ్చరిక * గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్... * ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం * 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి విపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు * గవర్నర్ ప్రసంగం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఫస్ట్ టైమ్ అన్న సీఎం సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడటం లేదు. బడ్జెట్ మీద జరిగే చర్చలో మాట్లాడతా. ప్రభుత్వాన్ని కడిగేస్తా. కాస్త ఒపికపట్టండి..’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షానికి సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద విపక్ష నేత జగన్ మాట్లాడకపోవడాన్ని బుధవారం టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. ‘ధన్యవాద తీర్మానం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఇదే తొలిసారి. నాయకత్వ దివాలాకోరుతనం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సీఎం విమర్శకు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని జగన్ స్పీకర్‌ను కోరారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడమని స్పీకర్ సూచించారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన తర్వాత.. జగన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్కరోజూ హాజరు కాలేదు... ఆ విషయం గుర్తులేదా? అని జగన్ ప్రశ్నించారు. ఏపీ తొలి బడ్జెట్ సమావేశంలో తాను మాట్లాడితే.. తాను మిగతా సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. బడ్జెట్ మీద తాను పూర్తిస్థాయిలో మాట్లాడతానని, ప్రభుత్వాన్ని అప్పుడు ఉతికేస్తానని చెప్పారు. ‘మిమ్మల్ని ఎలా కడిగేస్తానో ఆరోజు చూపిస్తా..’ అని అన్నారు. నిబంధనలు తెలియని విపక్ష నేత సభలో ఉన్నారంటూ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు జగన్ ఘాటుగా స్పందించారు. ‘నిబంధనలు, సభా సంప్రదాయాలు తెలియకపోతే తెలుసుకోవాలి. చదువు మీరు (అధికారపక్ష సభ్యులు) నేర్చుకోవాలి. నేర్చుకోని వచ్చిన తర్వాత మాట్లాడండి. ప్రతిపక్ష నేత ఎన్నిసార్లు మాట్లాడతారు. ధన్యవాద తీర్మానం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే మాట్లాడతారు. నిబంధనలు తెలుసుకోవాల్సింది నేను కాదు.. చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నవ్వడం.. మానసిక రోగమట! చంద్రబాబు కొత్త భాష్యం ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి, విపక్ష సభ్యులు సభలో నవ్వడంపై ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు. నవ్వడం మానసిక రోగమంటూ కొత్త అర్థం చెప్పారు. ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చకు బుధవారం సభలో తాను సమాధానం ఇస్తున్నప్పుడు.. విపక్ష సభ్యులు నవ్వుతూ కనిపించడంతో చంద్రబాబు అసహనానికి గురై స్పందించారు. ‘మనకు విచిత్రమైన ప్రతిపక్షం ఉంది. 35 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదు. జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, జనార్దన్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్.. తదితర ముఖ్యమంత్రుల వద్ద పనిచేస్తున్నప్పుడు గర్వంగా ఉండేది. నాలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులకే సభలో మాట్లాడాలంటే ఇంత ఇబ్బంది (సఫకేషన్)గా ఉంటే.. మిగతా వారి సంగతేమిటి?’ అని ప్రశ్నించారు. ‘నేను చెప్పేది అర్థంకాక నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. వెకిలి చేష్టలు చేస్తున్నారు. నవ్వడం ఒక మానసిక రోగం. మీకు మానసిక రోగం ఉంది. దానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఎప్పుడో ఒకసారి కామెంట్ చేస్తే ఫర్వాలేదని, కానీ నిరంతరం నవ్వుతుంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఎలాంటి వాళ్లు ఉన్నా సమాధానం చెబుతానని, అది తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతిపక్షం నవ్వుతుంటే స్పందించవద్దని, స్పీకర్‌కే వదిలిపెడదామంటూ అధికార పక్ష సభ్యులకు సూచించారు. -
లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
* బడ్జెట్ లెక్కలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద * విరుచుకుపడ్డ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ * ఇంత తక్కువ సమయంలో ఎలా ఖర్చుచేస్తారో చెప్పాలని డిమాండ్ * బడ్జెట్ చూస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తుంది * ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి * గత పాలకులేం అన్యాయం చేశారు.. మీరేం చేస్తారో చెప్పండి * సభలో లేవనెత్తిన ఏ అంశానికి ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వలేదు... సాక్షి, హైదరాబాద్: ‘వేల మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ, ఇప్పుడు ఈ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తుంది. మొదటి రెండు మాసాల నిధుల వినియోగం గడచిన మూడేళ్ల సగటుతో పోల్చితే తక్కువే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?’ అని శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘2011 నుంచి 2014 వరకు రాష్ట్రంలో ప్రణాళిక.. ప్రణాళికేతర నిధుల ఖర్చుల వివరాలు నా దగ్గరున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరం అంటే 2013-14లో తెలంగాణలోనే రమారమి రూ. 68 వేల కోట్ల నిధుల వినియోగం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు తీసుకున్నా. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో రూ. 5,935 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ లెక్కన పది నెలల్లో రూ. 50 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. మరి లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు..?’ అని నిలదీశారు. శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘సభలో మేము లేవనెత్తిన ఏ అంశానికీ ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వలేదు. విద్యుత్, వ్యవసాయం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తా. జవాబు లేదు. తెలంగాణ వస్తే సమస్యలు తీరుతాయని ప్రజలు భావించారు. బడ్జెట్ చూస్తే ఎంత ఆదాయం ఉంది.. ఎంత ఖర్చు ఉందో చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. విద్యుత్తు సమస్యలాగే ఆర్థిక సమస్య ఉంది. వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు. ప్రభుత్వం వీటిని కావాలనే దాస్తోంది. ఓ మిత్రుడిగా చెపుతున్నా, శ్వేతపత్రం విడుదల చేయండి’ అని ప్రభుత్వానికి సూచించారు. ‘యాభై ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయం ఒక్క ఏడాదిలో సమసిపోతుందని అనుకోవటం లేదు. బంగారు తెలంగాణ సాధనకు మరో అయిదు, పదేళ్లయినా ఓపిక పడదాం. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలేం చేశాయి. ఇప్పుడు రాష్ట్రం ఏ స్థితిలో ఉంది. మీరేం చేస్తారో.. ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పండి. గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని భావిస్తే ఆ వివరాలు బయటపెట్టండి. తెలంగాణ నిధులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్నాయి. వాటి విడుదలకు చర్యలు తీసుకోండి..’ అని ప్రభుత్వానికి అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో రెండు వేల మందికి పైగా ఉద్యోగులుంటే, మైనారిటీ విభాగంలో కేవలం వంద మంది ఉద్యోగులున్నారని, వీళ్లతో మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన రూ.1,030 కోట్లు ఖర్చు చేయటం సాధ్యమేకాదని ఆయన పేర్కొన్నారు. -
బడ్జెట్ పై కొనసాగుతున్న చర్చ
-
మాట ఇవ్వడం.. తప్పడం బాబుకు కొత్తకాదు
-
మాట ఇవ్వడం.. తప్పడం బాబుకు కొత్తకాదు
హైదరాబాద్ : మాట ఇవ్వటం...మాట తప్పటం చంద్రబాబు నాయుడుకు కొత్తకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌ను చూపించేటప్పుడు పునాదులు పటిష్టంగా ఉండాలన్నారు. ఆర్థిక మంత్రి తప్పులను ఒప్పుకోవాల్సిందిపోయి కప్పిపుచ్చుకుంటున్నారని వైఎస్ జగన్ అన్నారు. మా కోసం ఏమైనా కేటాయింపులు ఉంటాయా అని కోటిమంది ఎదురు చూశారన్నారు. రైతులు, విద్యార్థులకు నిరాశపర్చిన బడ్జెట్ అని, రాష్ట్రం విడిపోతే సమస్యలుంటాయని అందరికీ తెలిసిన సంగతేనని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే గత ప్రభుత్వాలపై నిందలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రణాళికా వ్యయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కన్నా తక్కువగా ఉందన్నారు. ప్రణాళికా వ్యయం తగ్గించి చూపిస్తే రాష్ట్ర జీడీపీపై ప్రభావం చూపిస్తుందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని తాము అడుగుతున్నామన్నారు. -
దొంగలెక్కలన్నీ వాళ్ల గెజిట్ ఈనాడులోనే ఉన్నాయి!
-
బాబు విత్తనాలేవీ మొలకలెత్తలేదు!!
-
దొంగలెక్కలన్నీ వాళ్ల గెజిట్ ఈనాడులోనే ఉన్నాయి!
విద్యుత్ ఛార్జీల పెంపుపై శ్వేతపత్రంలో చంద్రబాబు దొంగలెక్కలు చూపారని, అసలు ఆయన వివిధ అంశాలపై విడుదల చేసిన శ్వేతపత్రాల గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు దొంగలెక్కల విషయం వాళ్ల అధికార గెజిట్ ఈనాడు పేపర్లోనే ఉందని ఆయన అన్నారు. బాబు శ్వేతపత్రాల్లో కనీసం ఒక్కచోట కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పలేదన్నారు. వైఎస్ఆర్ హయాంలో నీటి ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, ఇతర పన్నులు వేయలేదని చెప్పలేదని గుర్తు చేశారు. చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ వక్రీకరణ పత్రాలేనని, ఇంత వక్రీకరణలను చంద్రబాబు ఎలా చెబుతారోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవరికైనా వేల ఎకరాలు భూమలు ఇచ్చినా తప్పులేదు గానీ, పరిశ్రమలకు వైఎస్ రాజశేఖరరెడ్డి భూములిస్తే మాత్రం తప్పా అని ఆయన ప్రశ్నించారు. -
బాబు విత్తనాలేవీ మొలకలెత్తలేదు!!
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చంద్రబాబు ఓ సరికొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తాను వేసిన విత్తనాలన్నీ రాజశేఖరరెడ్డి హయాం నాటికి మొలకలెత్తాయని, ఆ ఫలాల వల్లే ఆయన పాలనలో అభివృద్ధి రేటు నమోదైందని చంద్రబాబు చెప్పారన్నారు. అయితే తొమ్మిది సంవత్సరాల పాటు చంద్రబాబు వరుసపెట్టి విత్తనాలు వేస్తూనే ఉన్నా.. ఒక్కటి కూడా మొలకెత్తలేదని, తర్వాత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవి మొలకలెత్తాయని, అది ఎందుకో అందరికీ తెలుసని చురకలు వేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా తదితరులు 'చంద్రబాబు హయాం అంతా కరువే' అంటూ బల్లలు చరిచారు.