
ఫైల్ ఫోటో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా జరగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్పై నేడు శాసనసభలో చర్చ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా జరగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్పై నేడు శాసనసభలో చర్చ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం బడ్జెట్పై చర్చ ప్ర్రారంభిస్తారు. కాగా ప్రతిపక్ష నేత నాలుగు రోజుల ముందే బడ్జెట్పై అధికార పార్టీని కడిగి పారేస్తామని వెల్లడించటంతో ప్రభుత్వానికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది. దీంతో వైఎస్ జగన్ ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రతిపక్షంపై ఎదురు దాడి చేసేందుకు కొంతమంది మంత్రులను సిద్ధం చేసినట్లు సమాచారం.