
దొంగలెక్కలన్నీ వాళ్ల గెజిట్ ఈనాడులోనే ఉన్నాయి!
విద్యుత్ ఛార్జీల పెంపుపై శ్వేతపత్రంలో చంద్రబాబు దొంగలెక్కలు చూపారని, అసలు ఆయన వివిధ అంశాలపై విడుదల చేసిన శ్వేతపత్రాల గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు దొంగలెక్కల విషయం వాళ్ల అధికార గెజిట్ ఈనాడు పేపర్‌లోనే ఉందని ఆయన అన్నారు. బాబు శ్వేతపత్రాల్లో కనీసం ఒక్కచోట కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పలేదన్నారు.
వైఎస్ఆర్ హయాంలో నీటి ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, ఇతర పన్నులు వేయలేదని చెప్పలేదని గుర్తు చేశారు. చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ వక్రీకరణ పత్రాలేనని, ఇంత వక్రీకరణలను చంద్రబాబు ఎలా చెబుతారోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవరికైనా వేల ఎకరాలు భూమలు ఇచ్చినా తప్పులేదు గానీ, పరిశ్రమలకు వైఎస్ రాజశేఖరరెడ్డి భూములిస్తే మాత్రం తప్పా అని ఆయన ప్రశ్నించారు.