అవిశ్వాసం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమే: టీ ఎంపీలు | should not go for no confidence motion against own government, say Telangana MPs | Sakshi
Sakshi News home page

అవిశ్వాసం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమే: టీ ఎంపీలు

Published Tue, Dec 10 2013 3:16 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

should not go for no confidence motion against own government, say Telangana MPs

యూపీఏ సర్కారు మీద సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం అనైతికమని, మందా జగన్నాథం అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని, అప్పట్లో సీమాంధ్ర ఎంపీలు కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని, ఇక రేపో, ఎల్లుండో రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే రాజీనామా చేయాలని, విభజన వల్లే రెండు రాష్ట్రాలకు లాభం జరుగుతుందని మరో ఎంపీ వివేక్ అన్నారు.

కాగా, సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమేనని, సోనియాగాంధీపై అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. సమన్యాయం ఏమిటో చంద్రబాబు చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement