ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కోరారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం ఓ వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తిపేరు బ్యాలెట్ పేపర్లలో ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఓటు చెల్లదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించడం బాధ్యతా రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు.