కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. దీంతో ప లుచోట్ల పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా చెట్లు నేల వాలాయి. కల్హేర్ మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇదిలాఉండగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్హేర్, మార్డి చోట్ల పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. వర్షంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఖేడ్‌లో గంటపాటు..
నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం సా యంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు గంట సే పు వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యు త్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు.
చల్లబడిన వాతావరణం
మెదక్ మున్సిపాలిటీ: మెదక్‌లో శుక్రవారం సాయంత్రం కురి సిన చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపగా, సా యంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఐదు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. కాగా వేసవి సమీపిస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం వల్ల మరింతగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
దుబ్బాకలో చిరుజల్లులు
దుబ్బాక: దుబ్బాకలో చిరు జల్లులతో కూడిన వర్షం కురిసిం ది. గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా చిరుజల్లు లు కురిశాయి. అయితే గత ఐదు రోజులుగా ఈదురు గాలు లు వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గే వర్షాలు కురిస్తే మామిడి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు.
కురిసింది వాన
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం సన్నని జల్లులతో ప్రాంభమైన వాన ఆ తరువాత ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారుగా కురి సింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. ప్రధానంగా బ్లాక్ రోడ్డుతో పాటు జాతీయరహదారిపై బాగారెడ్డి విగ్రహాం వద్ద నీరు నిలిచిపోయింది. సుభాష్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చిచేరింది. గురువారం రాత్రి కూడా సన్నని జల్లులు పడ్డాయి.
ఎగిరిన రేకులు
న్యాల్‌కల్, న్యూస్‌లైన్: మండలంలో శుక్రవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు లు ఎగిరిపోయాయి. అదేవిధంగా మండల పరిధిలోని హుస్సెళ్లి గ్రామ సమీపంలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాల య్యాయి. కర్నాటక రాష్ట్రం జబ్గి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు గ్రామంలో చెరకు నరకడానికి వచ్చారు. గ్రామ సమీపంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు.
ఉన్నట్లుండి గాలి వాన రావడం, గుడిసెలు కొట్టుకపోవడంతో పప్పు, బియ్యం ఇతర సామగ్రి కూడా పూర్తిగా పాడైపోయాయి. అంతే కాకుండా కమలాబాయి చేయి విరిగి పోగా చెట్టు కొమ్మ విరిగి మీదపడిన సంఘటనలో రెండేళ్ల బాలునితోపాటు మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యా యి. ఉన్నట్లుండి ఒకే సారి గాలితో కూడిన వడగండ్ల వాన రావడంతో గిరిజనులు భయందోళనకు గురై పరుగులు తీశా రు. వారు పూర్తి నిరాశ్రయులు కావడంతో గ్రామానికి చెంది న ఎండీ అఫీజ్,ఎండీ.మైపూజ్ మాస్టార్ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా వారికి బియ్యం ఇతర వస్తువులు అందజేశారు.
అకాల వర్షం
Published Sat, Mar 1 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement