నూజివీడులో మామిడి పౌడర్‌ యూనిట్‌ | Mango Powder Unit at Nuziveedu | Sakshi
Sakshi News home page

నూజివీడులో మామిడి పౌడర్‌ యూనిట్‌

Published Wed, Jun 7 2023 4:42 AM | Last Updated on Wed, Jun 7 2023 4:42 AM

Mango Powder Unit at Nuziveedu - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గా­లులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. అ­కా­ల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దె­బ్బ­తిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్‌ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయిస్తోంది.

రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వా­మ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు స­బ్సి­­డీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్‌ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కా­నుంది.  నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్‌ ఉంది.

ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాల­తో మార్కెట్‌ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్‌లో ఉంటాయి.

మార్కెట్‌ యార్డ్‌లో ప్రాసెసింగ్‌ యూనిట్‌ 
ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజి­వీడు మార్కెట్‌ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయా­లని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్‌) సేకరించే యూనిట్‌ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్‌ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్‌ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం కానుంది.

డీఆర్‌డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్‌ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ 
రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్‌ యూ­ని­ట­Œæ ఇది. నూజివీడులో­ని మా­­ర్కె­ట్‌ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పా­టు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉపయుక్తంగా 
ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్‌డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు.    – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement