Women farmers
-
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్‌ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్‌షాప్‌ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్‌గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్‌పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
గుడ్‌న్యూస్.. మహిళా రైతులకు రూ.12,000? ఈ బడ్జెట్లోనే..!
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు అంటే రూ. 12,000 లకు పెంచాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పురుష, మహిళా రైతులిద్దరికీ రూ.6,000లను అందిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు 15 విడతల్లో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఇంతకు ముందు ఎప్పుడూ చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించే ఈ చర్యగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రణాళికపై అటు వ్యవసాయ శాఖ గానీ, ఇటు ఆర్థిక శాఖ గానీ స్పందించలేదు. -
G20 Summit: చిరుధాన్యలక్ష్మికళ
కలెక్టర్ పిల్లలు కలెక్టర్, హీరో పిల్లలు హీరో, రాజకీయ నాయకుడు పిల్లలు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటే, ఇక మధ్యతరగతి తల్లిదండ్రులు... తమలా తమ పిల్లలు ఇబ్బందులు పడకూడదని, తిని, తినక ఒక్కోరూపాయి పోగుచేసి, కష్టపడి చదివించి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం తమ పిల్లలు తమలా రైతులు కావాలని అస్సలు కోరుకోవడం లేదు. ‘‘పెద్దయ్యాక రైతును అవుతాను’’ అని కూడా ఎవరూ చెప్పరు. ‘‘మేము వ్యవసాయం చేస్తాం, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు ప్రపంచ దేశాధ్యక్షులు సైతం మేము చెప్పబోయేది ఆసక్తిగా వినబోతున్నారు అదీ వ్యవసాయం గొప్పతనం’’ అని చాటిచెబుతున్నారు ఇద్దరు మహిళా రైతులు. అవును గొప్పగొప్ప చదువులు చదివినవారికంటే..తమ పూర్వీకుల నాటి నుంచి ఆచరిస్తోన్న పద్ధతులతో వ్యవసాయం చేస్తూ అందరి దృష్టి తమవైపు తిప్పుకున్న రైతులకు జీ–20 సదస్సుకు ఆహ్వానాలు అందాయి. పెద్దపెద్ద డిగ్రీలు, హోదాలు లేకపోయినప్పటికీ.. కేవలం వ్యవసాయం చేస్తున్నారన్న ఒక్క కారణంతో ... ప్రపంచ దేశాధ్యక్షులు పాల్గొనే ‘జీ–20 సమితి’లో పాల్గొనే అవకాశం ఇద్దరు మహిళా రైతులకు దక్కింది. ఒడిశాకు చెందిన గిరిజన మహిళా రైతులు ౖ‘రెమతి ఘురియా, సుబాసా మోహన్తా’లకు ఈ అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ, గిరిజన చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు పద్ధతులను జీ–20 వేదికపై ఈ ఇద్దరు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. కోరాపుట్ జిల్లాలోని నౌగుడా గ్రామానికి చెందిన రైతే 36 ఏళ్ల రైమతి ఘురియా. భూమియా జాతికి చెందిన రైమతికి ముగ్గురు పిల్లలు. మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తోంది. ఏళ్లపాటు వరిధాన్యాలు పండించే రైమతి... చిరుధాన్యాల సాగు మెళుకువలు నేర్చుకుని మిల్లెట్స్ సాగు మొదలు పెట్టింది. అధునాతన సాంకేతికతను జోడించి పంటలో అధిక దిగుబడిని సాధిస్తోంది. సాగులోలేని 72 దేశీయ వరి రకాలు, ఆరు చిరుధాన్యాలతో కలిపి మొత్తం 124 రకాల ధాన్యాలను అంతరించిపోకుండా కాపాడుతోంది. మంచి దిగుబడితో సాధిస్తున్న రైతుగానేగాక, తోటి గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగులో సాయం చేస్తూ వారికీ జీవనోపాధి కల్పిస్తోంది. సంప్రదాయ పంటలైన వరి, మిల్లెట్ రకాలను పండిస్తూనే తన గిరిజన మహిళలెందరికో ఆదర్శంగా నిలుస్తూ... మిల్లెట్ సాగును ప్రోత్సహిస్తోంది. పంటమార్పిడి, అంతర పంటలు, సేంద్రియ పంటల్లో తెగులు నివారణ మెళకువల గురించి, స్కూలును ఏర్పాటు చేసి ఏకంగా 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. చిరుధాన్యాల సాగులో రైమతి చేసిన కృషికిగా గుర్తింపుగా అనేక ప్రశంసలు కూడా అందుకుంది. 2012లో జీనోమ్ సేవియర్ కమ్యునిటీ అవార్డు, 2015లో జమ్షెడ్జీ టాటా నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు, టాటా స్టీల్ నుంచి ‘బెస్ట్ ఫార్మర్’ అవార్డులేగాక, ఇతర అవార్డులు అందుకుంది. చిరుధాన్యాల సాగులో అనుసరిస్తోన్న పద్ధతులు, దిగుబడి, తోటి రైతులను ఆదుకునే విధానమే రైమతిని జీ20 సదస్సుకు వెళ్లేలా చేసింది. ఈ సదస్సు లో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో వివిధ రకాల చిరుధాన్యాలు, ఈ ధాన్యాలతో చేసిన విభిన్న వంటకాలు, చిరుధాన్యాలతో వేసిన ముగ్గులను ప్రదర్శించనుంది. చిరుధాన్యాల సాగులో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అధిక దిగుబడి కోసం అవలంబిస్తోన్న విధానాలు వివరించనుంది. మిల్లెట్ సాగులో అనుసరించాల్సిన అధునాతన సాంకేతికత, దాని ఉపయోగాల గురించి ఎమ్ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ ఇచ్చిన శిక్షణ సంబంధిత అంశాలను ప్రస్తావించనుంది. సుబాసా మొహన్తా మయూర్భంజ్ జిల్లాలోని గోలి గ్రామానికి చెందిన చిరుధాన్యాల రైతే 45 ఏళ్ల సుబాసా మొహన్తా. తన జిల్లాలో ఎవరికీ చిరుధాన్యాల సాగుపై ఆసక్తి ఏమాత్రం లేదు. 2018లో ఒడిశా ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల సాగు చేయమని మిల్లెట్ మిషన్‌ను తీసుకొచ్చింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకొచ్చింది సుబాసా. ఏళ్లనాటి గిరిజన సాగుపద్ధతులను ఉపయోగిస్తూ రాగుల సాగును ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లెట్స్‌ను పండిస్తూ అధిక దిగుబడిని సాధిస్తోంది. ఇది చూసిన ఇతర రైతులు సైతం సుబాసాను సాయమడగడంతో వారికి సాగు పద్ధతులు, మెళకువలు నేర్పిస్తూ మిల్లెట్ సాగును విస్తరిస్తోంది. సుబాసాను ఎంతోమంది గిరిజన మహిళలు ఆదర్శంగా తీసుకుని చిరుధాన్యాలు సాగుచేయడం విశేషం. సుబాసా కృషిని గుర్తించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. జీ20 సదస్సుకు హాజరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిరుధాన్యాల సాగు, ఈ ధాన్యాల ప్రాముఖ్యత గురించి అందరికీ చెబుతాను. గిరిజన మహిళగా గిరిజన సాగు పద్ధతులను మరింత విపులంగా అందరికీ పరిచయం చేస్తా్తను. – రైమతి ఘురియా చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిచేస్తాయి. ఇవి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు గిరిజనుల ప్రధాన ఆహారం చిరుధాన్యాలు. కానీ ఇప్పుడు పొలాల నుంచి దాదాపు కనుమరుగయ్యాయి. నేను ధాన్యాలు పండించడం మొదలు పెట్టిన తరువాత నన్ను చూసి చాలామంది రైతులు చిరుధాన్యాలు సాగుచేయడం ప్రారంభించారు. ఇతర రైతులకు వచ్చే సందేహాలు నివృత్తిచేస్తూ, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాను. వరికంటే చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు వస్తుండడంతో అంతా ఈ సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. – సుబాసా మోహన్తా -
మహిళా రైతులతో సోనియా ముచ్చట్లు: మీరే పిల్లను చూడండి..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి నవ్వులు పూయించింది. హరియాణాకు చెందిన కొందరు మహిళలు ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌కు వచ్చి సోనియాగాంధీ కుటుంబంతో కాసేపు గడిపారు. వారిని సాదరంగా ఆహ్వానించిన గాంధీ కుటుంబం ఆతిథ్యమిచ్చింది. ఆ మహిళలతో కలిసి సోనియా, ప్రియాంక, రాహుల్ భోజనాలు చేశారు. ఆ తర్వాత కాసేపు వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ సోనియాతో ‘‘రాహుల్‌కి పెళ్లి చేద్దామా’’ అని అడిగారు. దానికి సోనియా నవ్వుతూ ‘‘మీరే పిల్లని చూడండి’’ అని వాళ్లతో చెప్పారు. పక్కనే ఉండి ఇదంతా వింటున్న రాహుల్ ‘‘అవుతుంది. అవుతుంది’’ అని అన్నారు. దీంతో ప్రియాంక రాహుల్ స్వీట్‌గా కనిపిస్తున్నా చాలా కొంటెవాడని చెప్పారు. వారి సమావేశం అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు హరియాణా సోనిపట్ జిల్లాకు చెందిన మహిళలతో ముచ్చటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మహిళా కార్మికులతో కలిసి నాట్లు వేశారు. తాము ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీని చూడలేదని వారు చెబితే అప్పట్లోనే రాహుల్ వారికి ఢిల్లీకి పిలుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి ఢిల్లీ చూపించాక తమ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. కొందరు మహిళలు రాహుల్‌కు ప్రేమగా తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోని రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మా ఇంటికి ప్రత్యేక అతిథులు వచ్చారు. ఈ రోజు మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. వారితో కలిసి భోజనం చేశాం. ముచ్చట్లు చెప్పుకున్నాం. వారంతా మాకు ఎంతో అమూ ల్యమైన కానుకలు ఇచ్చారు. దేశీ నెయ్యి, స్వీట్ లస్సీ, ఇంట్లో చేసిన ఊరగాయలు ఎంతో ప్రేమతో ఇచ్చారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ మహిళ లతో కలిసి సోనియా, ప్రియాంక స్టెప్పులు వేశారు. ఇదీ నేపథ్యం... నా ఇంటిని ప్రభుత్వం లాగేసుకుంది జూలై 8న భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హరియాణాలోని సోనిపట్ జిల్లా మదినా గ్రామానికి వెళ్లారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు, రైతు కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఢిల్లీలోని రాహుల్ సొంతింటిని గురించి అడిగారు. అందుకు రాహుల్..తనకు సొంతిల్లు లేదని, దానిని ప్రభుత్వం తీసేసుకుందని బదులిచ్చారు. ఢిల్లీలోని తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఫోన్ చేశారు. రైతు మహిళలు భోజనానికి రావాలనుకుంటున్నారని చెప్పారు...ఇదంతా 12 నిమిషాల నిడివున్న వీడియోలో ఉంది. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్‌గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్‌తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్‌కారులో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్‌లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్‌లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్‌గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
ఊరంతా బాగుండాలి.. అందులో నేనుండాలి! ఎమ్మే బీఈడీ చదివి ఇప్పుడిలా..
ఎమ్మే బీఈడీ చదివినా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ.. ఎకరం కౌలు పొలంలో 20 రకాలకుపైగా కూరగాయల సాగు.. గ్రామస్తులకు, స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి కూరగాయలు సరఫరా.. తిరుపతి జిల్లా ఎస్బీఆర్ పురం వాసి కోనేటి శైలజ ఆదర్శ సేద్యం ఎమ్మే బీఈడీ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. తన కుటుంబంతో పాటు... గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఎకరం భూమిని లీజుకు తీసుకొని అందులో 20 రకాలకుపైగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్లో విక్రయించకుండా... తన ఊర్లో వారికి, అంగన్వాడీ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోనేటి శైలజ. శైలజ స్వస్థలం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామం. పుట్టినిల్లు.. మెట్టినిల్లు కూడా అదే ఊరు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డవారే. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, ప్రైవేటు కాలేజ్‌లో బీఈడీ పూర్తి చేశారు. వ్యవసాయదారుడు మాధవ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సొంత భూమిలో మామిడి తోట సాగులో ఉంది. ఏపీ రైతు సాధికార సంస్థ ప్రోత్సాహంతో శైలజ ప్రకృతి సేద్యంలో కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోనే ఎకరం భూమిని లీజుకు తీసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో 20 రకాల కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.13,500 చేశారు. శైలజ తోటలో కిలో పచ్చిమిర్చి రూ. 60, క్యారెట్, బీట్రూట్ రూ. 50, టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాకర, అలసంద రూ. 40, ముల్లంగి (కట్ట) రూ.15, గోంగూర(కట్ట) రూ. 10 చొప్పున అమ్ముతున్నారు. మొన్నటి వరకు రూ.17,500 ఆదాయం వచ్చింది. ఏడాది పొడవునా రోజూ కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని శైలజ వివరించారు. మధ్యాహ్న భోజనంలో ఇవే కూరలు శైలజ పండించే కూరగాయలను గ్రామస్తులకే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ, ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నారు. ఘనజీవామృతం, ఆవు పేడ, పంచితం, మజ్జిగతో కషాయాలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుండటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు సాధికర సంస్థ సిబ్బంది, శైలజ, ఆమె భర్త మాధవ వర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కూరగాయలు కొంటున్నారు. అంగన్వాడీ పిల్లలు, స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కూరగాయలు కూడా శైలజ పండిస్తున్నవే. ‘శైలజ పండించిన కూరగాయలను ధర కాస్త ఎక్కువైనా కొని వాడుతున్నా. పిల్లలు కూరలు రుచిగా ఉన్నాయని చెబుతుంటే సంతోషంగా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు పూర్ణ. గ్రామస్తులు, స్కూలు పిల్లల కోసమే! ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేను పండించే కూరగాయలు తిని మా ఊరివాళ్లంతా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ప్రస్తుతం నేను పండించే కూరగాయలు మా ఊరి వాళ్లకే సరిపోతున్నాయి. గ్రామస్తులు, స్కూలు పిల్లల తరువాతే ఎవరికైనా. ఏడాది పొడవునా కూరగాయలు పండించి ఇవ్వాలన్నదే నా తపన. – కోనేటి శైలజ, (9912197746),ఎస్బీఆర్ పురం, వడమాలపేట మం., తిరుపతి జిల్లా కొసమెరుపు: గ్రామానికి చెందిన వెంకట్రామరాజు శైలజ పండించే కూరగాయలను కొనుగోలు చేసి చెన్నైలో ఉంటున్న తన కుమారుడు డాక్టర్ రామకృష్ణంరాజుకు వారానికి ఒక రోజు పంపుతుండటం మరో విశేషం. – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. ఫొటోలు: కేతారి మోహన్‌కృష్ణ నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా? -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్‌ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్‌కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
సేద్యానికి ఆర్థిక దన్ను
మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పొదుపు సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ, వ్యవసాయానికి కావాల్సిన యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి, సీఐఎఫ్, గ్రూపు అంతర్గత అప్పులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోంది. ఆయా రుణాలను మహిళలు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళల కోసం వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): సన్న, చిన్న కారు మహిళా రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహిళా రైతులతో ‘రైతు ఉత్పత్తి దారుల సమాఖ్య’ గ్రూపులను ఏర్పాటు చేసి, వివిధ శాఖల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. బ్యాంక్‌లు, ప్రభుత్వ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు వారే కల్పించుకునేలా వసతులు సమకూరుస్తోంది. ఇప్పటికే మూడు విడతల్లో 24 మండలాల్లో 27,412 మంది సభ్యులతో 2,492 గ్రూపులు ఏర్పాటయ్యాయి. తొలివిడతలోని గ్రూపులు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. మహిళా రైతులు సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. డీఆర్డీఏ ద్వారా అమలు ఈ సంఘాల ఏర్పాటు బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. మండలానికి 150 గ్రూపులు లక్ష్యంగా నిర్దేశించింది. సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలి, వారికి ప్రభుత్వ శాఖల సహకారం ఏ విధంగా అందించాలి. వారి ఉత్పత్తులకు ధర పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. దీంతో డీఆర్డీఏ అధికారులు అంచలంచెలుగా జిల్లా అంతటా సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే తొలిదశలో సైదాపురం, రాపూరు, చేజర్ల, కలువాయి, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, రెండో దశలో మనుబోలు, వెంకటాచలం, ఇందుకూరుపేట, అల్లూరు, విడవలూరు, సంగం, అనంతసాగరం, ఏఎస్‌పేట, వింజమూరు, మూడో దశలో కావలి, జలదంకి, సీతారామపురం, కొడవలూరు, కోవూరు, నెల్లూరు, ముత్తుకూరు, బోగోలు మండలాల్లో సంఘాలు ఏర్పాటయ్యాయి. సత్ఫలితాల దిశగా తొలిదశ సంఘాలు తొలి దశలో ఏర్పాటైన సంఘాలు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. చేజర్ల, రాపూరు, కలువాయి తదితర మండలాల్లో రుణం పొంది మినీ రైస్ మిల్లు, పిండి మిల్లు, పొట్టేళ్ల పెంపకం, సేంద్రియ ఎరువులతో పెరటి తోటల పెంపకం చేస్తున్నారు. తద్వారా వచ్చే నాణ్యమైన ఉత్పత్తులను ‘కాలుగుడి’ యాప్‌లో పొందు పరచి ఆన్లైన్ మార్కెట్ చేసి లాభపడుతున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సహకారం వ్యవసాయశాఖ సంఘాలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. మౌలిక వసతులను కల్పిస్తోంది. భూసార పరీక్షలు చేయించడం. సమగ్ర వ్యవసాయ విధానంపై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. సెర్ఫ్: బ్యాంక్ ఖాతాలను తెరిపించడంతో పాటు రుణాలు పొందే విధంగా ప్రోత్సహిస్తుంది. పుస్తక నిర్వహణపై శిక్షణ ఇస్తుంది. ఉద్యానశాఖ: ప్రభుత్వ, ఇతర సంస్థల సబ్సిడీ పథకాలను సంఘాలకు అందిస్తుంది. సాంకేతిక సహకారమందిస్తుంది. సమీకృత వ్యవసాయంపై శిక్షణ ఇస్తుంది. రైతు సాధికార సంస్థ: సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు అందేలా చూడడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం చేస్తుంది. పశుసంవర్థశాఖ: పాడి పశువులు, సన్న జీవాల కొనుగోలుకు సహకారమందిస్తుంది. వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయిస్తుంది. డెయిరీ కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్: గొర్రెలు, మేకలు, కోళ్లు, పశువుల షెడ్స్, ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది. రుణ పరపతి: ఒక్కో సంఘ సభ్యురాలికి రూ.25 వేల రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. సభ్యులంతా కలిపి తీసుకోవాలంటే రూ.1.50 లక్ష వరకు రుణం పొందవచ్చు. సభ్యులు పొదుపులోని నగదును రుణంగా పొందవచ్చు. వీటితోపాటు ఉద్యానశాఖ 75 శాతం రాయితీతో ఇస్తున్న పథకాలు పొందవచ్చు. సంఘాలు ఏర్పాటు చేశాం ఒకే రకం పంట సాగు చేసే మహిళా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు కూడా ఆరంభించాం. అధికారుల సూచనలు, సలహాలతో ఎలాంటి పంటలు వేస్తే లాభ దాయకంగా ఉంటుంది. ఆ సాగు పద్ధతులను గురించి అవగాహన చేసుకుంటున్నాం. మార్కెట్ మెళకువలు తెలుసుకుని త్వరలోనే ప్రక్రియ ప్రారంభిస్తాం. – జి.లక్ష్మిరాణి, అన్నదాత రైతు ఉత్పత్తి దారుల సంఘం, కొడవలూరు లాభదాయక సంఘాల స్ఫూర్తితో సాధికారత తొలి దశలో ఏర్పాటైన మా సంఘాలు ఇప్పటికే వివిధ రకాల పంటలు, రైస్ మిల్లు, ఆన్లైన్ మార్కెట్లు చేస్తూ లాభ పడుతున్నాయి. ఆ సంఘాల స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. వివిధ శాఖలు సహకారమందిస్తున్నందున తప్పక లాభాల బాట పడుతామన్న ధీమా ఉంది. ఉద్యాన శాఖ ద్వారా 75 శాతం రాయితీ రావడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం మెరుగ్గా ఉంది. – కె.సుభాషిణి, వాసు రైతు ఉత్పత్తిదారుల సంఘం త్వరలో రూ.1.20 కోట్లతో సేకరణ కేంద్రాల ఏర్పాటు సంఘాలు పండించిన ఉత్పత్తులను ఒక చోటకు సమీకరించి గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి మండలానికో షెడ్డు నిర్మించనున్నాం. ఒక్కో షెడ్డుకు ప్రభుత్వం రూ.20 లక్షల వంతున మంజూరు చేస్తోంది. రూ.15 లక్షలు షెడ్డుకు, రూ.5 లక్షలు కోల్డ్ రూమ్‌కు మంజూరు చేస్తోంది. తొలివిడతలో కలువాయి, రాపూరు, చేజర్ల, గుడ్లూరు, సైదాపురం, ఓలేటివారిపాళెంలో షెడ్ నిర్మాణాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. రైతులు పండించిన పండ్లు, నిమ్మకాయలు, కూరగాయల్లాంటివి రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉండాల్సి వస్తే చెడిపోకుండా కోల్డ్ రూమ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఉత్పత్తిదారుల సంఘాలను కూడా దశల వారీగా 37 మండలాల్లో ఏర్పాటు చేయనున్నాం. – కేవీ సాంబశివారెడ్డి, డీఆర్డీఏ పీడీ నెల్లూరు -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
తిక్రి వద్ద మహిళా రైతులను ఢీకొట్టిన ట్రక్కు
బహదూర్‌ఘర్: ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని తిక్రి వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిక్రి వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పంజాబ్‌లోని మన్సా జిల్లా ఖీరా ద్యాలువాలా గ్రామానికి చెందిన మహిళారైతులు పాల్గొన్నారు. అనంతరం వారు బహదూర్‌ఘర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు పకోడా చౌక్ వద్ద ఆటో కోసం నిల్చుని ఉండగా ఒక ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. రైతులను అణచివేస్తున్నారు: రాహుల్ గాంధీ తిక్రి వద్ద మహిళా రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూరత్వం, విద్వేషం దేశాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. -
8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్ సంసద్’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దేశ రాజధానిలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న ప్రారంభమైన రైతుల ఆందోళనలకు నేటితో 8 నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల దీక్షకు మద్దతుగా మహిళా రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్నారు. కిసాన్ సంసద్ పేరిట మహిళా రైతులు ఆందోళన చేపట్టనున్నారు. ఈ క్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా రైతులకు చెందిన పలు కాన్వాయ్‌లు సోమవారం ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని.. మహిళా కిసాన్ సంసద్ పేరిట నిరసన తెలుపుతారు అని పేర్కొంది. భారతీయ వ్యవసాయ రంగంలో మహిళా రైతు పాత్రను ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం అని ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రైతులు జంతర్ మంతర్ వద్ది కిసాన్ పార్లమెంటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 200 మంది రైతుల పార్లమెంటు వెలుపల కూర్చుని నిరనస తెలుపుతారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఢిల్లీ సరిహద్దుల్లో నినదించిన మహిళా రైతులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు సోమవారం మహిళా రైతుల నిరసనలతో మారుమోగాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాలంటూ సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లలో రైతులు మూడు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ సమస్యలతోపాటు మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు. ఇతర సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు. పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించిన మహిళలు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కొందరు భాంగ్రా నృత్యాలు చేశారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రైతు నిరసనల్లో పాల్గొనే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని వారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు, కార్లు, టెంపోలు, జీపుల ద్వారా వారు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పారు. -
ఉద్యమ వేదికల వద్ద మహిళా దినోత్సవం
న్యూఢిల్లీ/భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ వేదికల వద్ద సోమవారం అన్ని కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలో జరగనున్నాయి. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ ఉద్యమ కేంద్రాల వద్ద వేదిక ఏర్పాటు, ప్రసంగాలు, కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల నుంచి ఆహార పంపిణీ వరకు అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించనున్నారు. వేలాదిగా మహిళా రైతులు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఉద్దేశంతో, వారికి సముచిత గుర్తింపు, గౌరవం అందించే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజు పూర్తిగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పాలు పంచుకోవడం కోసం పంజాబ్, హరియాణాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వస్తున్నారని రైతు ఉద్యమ నేతలు తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ సింగ్ తికాయత్ మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న పలు రైతు సభల్లో పాల్గొననున్నారు. మార్చి 8న షోపూర్లో, మార్చి 14న రేవాలో, మార్చ్ 15న జబల్పూర్లో జరిగే సభల్లో ఆయన పాల్గొని, రైతు ఉద్యమానికి మద్దతు కూడగడ్తారని బీకేయూ ప్రతినిధి వెల్లడించారు. ఉత్తరాఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణల్లోనూ పర్యటిస్తారన్నారు. కాగా, తికాయత్‌పై మధ్య ప్రదేశ్‌లో 2012 నాటి ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ వారంట్ పెండింగ్‌లో ఉంది. ఆ సమయంలో జైతారిలో పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తికాయత్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి తికాయత్ అరెస్టయ్యారు. బెయిల్‌పై విడుదలైన తికాయత్ ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, వారంట్ జారీ అయింది. -
నన్ను బెదిరించలేరు, కొనలేరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ భారతీయ మహిళా రైతులకు అంకితం ఇచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి వద్ద జరుగుతున్న రైతు నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న 20 మంది మహిళా రైతులు చంకలో బిడ్డల్ని ఎత్తుకొని నినాదాలు చేస్తున్న ఫొటోని మార్చి సంచికలో కవర్ పేజీగా ప్రచురించింది. ‘‘నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు’’ శీర్షికతో ఉన్న ఆ కథనంలో ఎన్ని బాధలు ఎదురైనా వెన్ను చూపకుండా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని కీర్తించింది. నిరసనలు కట్టిపెట్టి మహిళల్ని, వృద్ధుల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం చెప్పడం, సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలు వెనక్కి వెళ్లేలా బుజ్జగించండి అంటూ చెప్పినప్పటికీ తమ గళం వినిపిస్తూనే ఉన్నారని నీలాంజన భౌమిక్ రాసిన ఆ కథనం పేర్కొంది. -
మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్
రెండు నెలలుగా ఢిల్లీలో రైతుల పోరు. మళ్లీ ఈరోజు ప్రభుత్వంతో చర్చలు. నేటి చర్చల్లో ప్రభుత్వం ‘ఓకే’ అనలేదా.. ఈ ఏడాది ఢిల్లీలో రెండు పరేడ్లు! ఒకటి.. గణతంత్ర దినోత్సవ శకటాల పరేడ్. రెండు.. రైతుల రణన్నినాద ట్రాక్టర్ పరేడ్. ట్రాక్టర్ పరేడ్‌లోకి మహిళలూ దిగుతున్నారు. అందుకోసమే వాళ్లు హైవే పైకి వచ్చి.. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు! బండెనక బండి కట్టి మహిళలు కదలక ముందే.. ప్రభుత్వంలో కదలిక వస్తుందా? రైతులకు, ప్రభుత్వానికి కొద్ది వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పరోక్ష యుద్ధం జరుగుతోంది. రైతుల కోసం గత సెప్టెంబరులో పార్లమెంటు తెచ్చిన చట్టాలు మంచివని ప్రభుత్వం అంటుంటే.. ఆ చట్టాలు తమ బతుకును కోరేవి కాకపోగా బలి తీసుకునేవని రైతులు భావిస్తున్నారు. అందుకే ఆ చట్టాలను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి నలువైపులా ఎండకు, వానకు, చలికి చలించకుండా సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని కూర్చున్నారు. మళ్లీ ఈ రోజు (జనవరి 8) చర్చలు జరుగుతున్నాయి. ఇవీ విఫలమైతే? విఫలమైన మరుక్షణం నుంచే రైతు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి రైతులు ట్రాక్టర్లు వేసుకుని ఢిల్లీ బయల్దేరతారు. జనవరి 26 నాటికి ఢిల్లీ చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్‌డే పరేడ్కి సమాంతరంగా ట్రాక్టర్ పరేడ్ జరుపుతారు. రైతు సంఘాల పోరు ప్రణాళిక ఇది. ఇందుకు మహిళా రైతులూ ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ నడపడం రాని మహిళలు సైతం హైవే మీదకు వెళ్లి ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నారు. మొదట ఇందుకు హర్యానా మహిళా రైతులు మార్గదర్శకులు అయ్యారు. హర్యానాలోని రొహ్టాక్లో ట్రాక్టర్ పరేడ్‌కు రిహార్సల్స్ వేస్తున్న మహిళా రైతులు ట్రాక్టర్ పరేడ్ కోసమే మహిళలు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం పోరాట పథానికి ఒక కొత్త ఆదర్శం అయింది. అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్లూ డ్రైవింగ్ నేర్చుకుని టూ–వీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతున్నప్పటికీ అదంతా ఆసక్తి ఉన్నందువల్లనో, అవసరం అయినందు వల్లో. అయితే ఒక ఉద్యమ పోరాటంలో పాల్పంచుకోడానికి మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడమే మరింతగా అభినందించాల్సిన సంగతి. అయితే మహిళా రైతు ఉద్యమకారులెవరూ అభినందనల్ని పట్టించుకునేంత స్థిమితంగా లేరు. హర్యానాలోని జింద్ జిల్లాలో గత సోమవారం నుంచీ జింద్–పటియాలా నేషనల్ హైవే మీద ఖట్కర్ టోల్ ప్లాజా సమీపంలో మహిళలు దీక్షగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. టోల్ ప్లాజా వాళ్లు కూడా వారి దగ్గర రుసుమేమీ వసూలు చేయడం లేదు! అదీ ఒక విధంగా రైతు ఉద్యమానికి మద్ధతు తెలియజేయడం అనుకోవాలి. ఆ ప్రదేశంలో డ్రైవింగ్ శిక్షణ పగలంతా మూడు విడతలుగా జరుగుతోంది. ట్రాక్టర్ స్టార్ట్ చెయ్యడం, స్టీరింగ్ తిప్పడం, వాహనానికి రెండువైపులా వచ్చే వాహనాలను అద్దాల్లో చూస్తూ రోడ్డు రెండు వైపులను పరిశీలిస్తూ ట్రాక్టర్ నడపడం వంటి ప్రాథమిక విషయాలను డ్రైవింగ్ వచ్చిన బంధువుల నుండి, ప్రత్యేక శిక్షకుల ద్వారా ఈ మహిళలంతా నేర్చుకుంటున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం దిగి రాకుంటే ఈసారి నేరుగా ఎర్రకోటలోకే మా ట్రాక్టర్లు దూసుకువెళ్తాయి’’ అని 38 ఏళ్ల నైన్ అంటున్నారు. ట్రైనింగ్ అవుతున్న మహిళలో నైన్ ఒకరు. నైన్ ఖట్కర్ గ్రామ మహిళ. అదే గ్రామం నుంచి ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చిన వారిలో సరోజ్ కూడా ఉన్నారు. ఆమెకు 35 ఏళ్లు. ‘‘నేను రైతు కూతుర్ని. రైతులపై ప్రభుత్వం ఇప్పటికే అనేక అరాచకాలకు పాల్పడింది. ఇప్పుడైతే మేము అస్సలు వెనక్కు తగ్గాలని అనుకోవడం లేదు. ఇది రెండో స్వాతంత్య్ర సంగ్రామం అనుకోండి’’ అంటున్నారు సరోజ్. విజయేందర్ సిం«ధూ, సత్బీర్ పెహల్వాల్ కూడా అదే మాట చెబుతున్నారు. సత్బీర్ వయసులో పెద్దావిడ. అయినా ధైర్యంగా ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మేము మౌనంగా ఉంటే, మా తర్వాతి తరం వారికి ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా నోరు తెరిచే అవకాశమే ఉండదు. మా పిల్లలు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్నారు. మా భర్తల్ని మాత్రం లోనికి పోనివ్వకుండా ఢిల్లీసరిహద్దుల్లోనే ఆపేశారు. ఏమైనా న్యాయంగా ఉందా?’’ అని సత్బీర్ అడుగుతున్నారు. రైతు సంఘాల వారికి, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. ఒక్కటీ సఫలం కాలేదు. ఎనిమిదో రౌంyŠ చర్చలు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి. రైతులు కోరుతున్నట్లు ఆ మూడు సాగుచట్టాల్ని ప్రభుత్వం రద్దు చేసిందా, కనీసం మార్పులు చేర్పులు చేసిందా.. ఢిల్లీలో ఒకే పరేడ్ జరుగుతుంది... గణతంత్ర దినోత్సవ పరేడ్. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం తలవొగ్గలేదా.. ట్రాక్టర్ పరేడ్ తప్పని వాతావరణం ఏర్పడుతుంది. ‘‘ఇప్పటి వరకు రైతు ఉద్యమాన్ని మాత్రమే ప్రభుత్వం చూసింది. ఇకముందు మహిళా రైతు దళం బలాన్ని కూడా కూడగట్టుకున్న రైతు మహోద్యమాన్ని చూడవలసి ఉంటుంది. అది మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్న హర్యానా మహిళలు. -
తియ్యండ్రా బండ్లు
ధైర్యాన్ని సడలించే చలి గాలులు. నిరసనను నీరుగార్చే అకాలవర్షం. టియర్ గ్యాస్.. జల ఫిరంగులు. ఉండటానికి లేదు. తినడానికి లేదు. వసతి లేదు. సదుపాయం లేదు. నెలలుగా రోడ్ల మీదే జీవనం. ప్రదర్శనలో సహచరుల మరణం! ఏడుసార్లు చర్చలు విఫలం. ఏ వైపునా కనిపించని ఆశాకిరణం. ఢిల్లీలో రైతు పోరు గెలుస్తుందా? ‘గెలిపిస్తాం’ అంటున్నారు మహిళా రైతులు! ‘తియ్యండ్రా బండ్లు’ అంటూ.. స్టీరింగ్ అందుకుంటున్నారు! పొలంలో కలుపును గుర్తించగల రైతులు పాలకుల నలుపు ఆలోచనల్ని పట్టేయలేరా! ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తెచ్చింది సెప్టెంబరులోనే అయినప్పటికీ, వాటిని తేబోతున్నట్లు ముందే గ్రహించిన రైతులు ఆగస్టు నుంచే ఢిల్లీకి చేరుకోవడం మొదలు పెట్టారు. వారిని ఢిల్లీలోకి రానివ్వకుండా కేంద్రం ప్రవేశ ద్వారాలను మూసేసింది. సరిహద్దులైన తిక్రీ, సింఘు ప్రాంతాలలోనే వారిని నిలిపేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు సరిహద్దులనే తమ నిరసన శిబిరాలుగా చేసుకున్నారు. వీధుల్లోనే నినాదం, వీధుల్లోనే నివాసం. మహిళా నిరసనకారులకైతే ఇంకా కష్టం. కాలకృత్యాలకు మరింత కష్టం. అయినా వెరవలేదు. ఏ విధంగానూ అనుకూలం కాని ఆ ఆరుబయలు చలిని, ఎండను, అప్పుడప్పుడూ పడే వానను తట్టుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. ఆ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట ఆగస్టు 9న సన్నగా మొదలై, డిసెంబరులో ఉద్ధృతమైన రైతు ఉద్యమ పోరాటంలో ఇంతవరకు 25 మంది వరకు రైతులు గుండెపోటుతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. ప్రభుత్వం దిగిరాలేదు. వస్తుందన్న ఆశా కనిపించడం లేదు. ఈ తరుణం లో రైతు ఉద్యమం మెల్లిగా మహిళల చేతుల్లోకి చేరుకుంది. రైతు ఉద్యమం మహిళా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న సూచనలూ కనిపిస్తున్నాయి. అంటే.. రైతు ఉద్యమం గెలుపునకు దగ్గరగా ఉందనే. పొలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కష్టపడతారు. దేశంలోని సాగు భూమిలో 12 శాతానికి మాత్రమే హక్కుదారులైన మహిళలు సాగు పనుల్లో 75 శాతం వరకు ఉన్నారు. ఈ శక్తి చాలదా.. ప్రభుత్వాన్ని తూర్పార పట్టడానికి. తాలు చట్టాలను వదిలించడానికి. ∙∙ బుధవారం మంజీత్ కౌర్ అనే 62 ఏళ్ల మహిళా రైతు పంజాబ్‌లోని పటియాలా నుంచి ఢిల్లీలో రైతుల నిరసన స్థలి అయిన సింఘూ వరకు 257 కి.మీ. దూరం తనే స్వయంగా జీపును నడుపుకుంటూ వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. తనతోపాటు ఆమె మరో ఐదుగురు మహిళా రైతులను ఎక్కించుకుని వచ్చారు. ఈ సీన్ అచ్చంగా మన తెలుగు సినిమాల్లో వినిపించే ‘తియ్యండ్రా బండ్లు’ అనే పాపులర్ డైలాగ్ కి అతికినట్లుగా ఉంది. ట్విట్టర్లో మంజీత్ కు దేశవ్యాప్తంగా పూలమాలలు, అభినందనలు! ప్రభుత్వంతో కాయో పండో తేల్చుకోవాలన్న స్థిరచిత్తంతో ఢిల్లీకి చేరుకుంటున్న పెద్ద వయసు మహిళల్లో మంజీత్ ఒకరు మాత్రమే. వీళ్లంతా.. నిరాశ చెందుతున్న పురుష సహచరులలో పోరాట పటిమను పునరుజ్జీవింపజేస్తున్నారు. మంజీత్లానే.. బల్జీత్ కౌర్, కుల్వీందర్, ముల్కీత్, జస్పాల్, సుర్జీత్, పరమ్‌జీత్, పర్మీందర్ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి సెగ తగిలేలా సరిహద్దుల్లో నిరసనల వేడిని చల్లారనివ్వకుండా రాజేస్తున్నారు. మహిళా రైతు భూమాత అంశ మరి. తనను నమ్ముకున్న వారిలో సత్తువ నింపకుండా ఉంటుందా?! ఇప్పుడే గొంతెత్తాలి వ్యవసాయం మాకు ఉపాధి కాదు. అది మా రక్తంలోనే ఉంది. నేనిప్పుడు మా పొలంలో ఉండాలి. కానీ ఎక్కడున్నాను! ఢిల్లీ టిక్రీ సరిహద్దులో. ఏం కర్మ. పొలంలో పంట పండించాల్సిన వాళ్లం నెల రోజులుగా రోడ్డు మీద ఉన్నాం. ప్రభుత్వానికి అర్థం కాదా?! మాకు ప్రయోజనం లేని కాలీ కానూన్లను (చీకటి చట్టాలను) తెస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఇప్పుడు గొంతెత్తకపోతే మాకెప్పటికీ న్యాయం జరగదు. – బల్జీత్ కౌర్ (50) పిల్లల్ని ఎలా పోషించాలి?! కొత్త చట్టాలు మా పంటకు స్థిరమైన ధర లేకుండా చేస్తాయి. మా బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయి. పంటను ఎలా అమ్ముకోవాలి? మా పిల్లల్ని ఎలా పోషించాలి? నిరసన తొలిరోజు నుంచీ మేము ఇక్కడే ఉన్నాం. చట్టాలను రద్దు చేసేవరకు ఇక్కడి నుంచి కదలం. బతుకు మీద తప్ప ఇంటి మీద మాకు బెంగ లేదు. – కుల్వీందర్ కౌర్ పని ఉన్నా పొట్ట నిండదు ఏ పనీ తేలిక కాదు. తినాలంటే పని చేయాలి. మాకు తెలిసిన పని వ్యవసాయం. ఇప్పుడీ కొత్త చట్టాల వల్ల పని ఉన్నా మాకు తినడానికి ఉండదు. పెద్ద కంపెనీలకు మేలు చెయ్యడానికి రైతుల పొట్టలు కొడుతున్నారు. ఆ కంపెనీలు మా పంటలను ‘దొంగిలించి’ నాలుగు రెట్ల ధరకు నగరాలలో అమ్ముకుంటాయి. ఎంత అన్యాయం?! ప్రభుత్వానికి మా గోడు పట్టదా? – పర్మీందర్ కౌర్ మేమెక్కడికి వెళ్లాలి?! మా దిగుబడి ఎంతున్నా కనీస మద్దతు ధర లేకుంటే మా రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మేము ఎక్కడికి వలస వెళ్లాలి? ముప్పై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. పురుషుల కంటే మహిళలే పంట పనులు ఎక్కువగా చేస్తారు. కొత్తచట్టాలు అమలయితే వాటి ప్రభావం ముందుగా పడేది మహిళల మీదే. – ముల్కీత్ కౌర్ -
రైతుకు చేయూత
సాక్షి, రంగారెడ్డి: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు స్వతహాగా కొనుగోలు చేయలేని రైతుల కోసం మండలానికో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో దాదాపు 50 శాతానికి.. సన్న, చిన్న కారు రైతులకు మార్కెట్ ధరలో కొంచెం తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) నిధులతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి 31 సీహెచ్‌సీలు రాగా.. 29 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున గ్రాంట్ మంజూరయ్యాయి. హైదరాబాద్ మినహా జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. మహిళలే నిర్వాహకులు.. వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సంఘాల్లోని సభ్యులే ఈ సీహెచ్‌సీల నిర్వాహకు లు. ఇలా ఒక మండలంలోని మహిళా రైతులంతా కలసి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూ ప్ (ఎఫ్‌పీజీ)గా ఏర్పడతారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 31 మండలాల్లోని ఎఫ్పీజీలకు.. సీహెచ్‌సీ ఏర్పాటుకు కావాల్సిన కేంద్ర గ్రాంట్ అందింది. ఈ నిధులతో స్థానిక వ్యవసాయ పంటలకు కావాల్సిన పరికరాలు, పనిముట్లను కొనుగోలు చేసి కేంద్రాలను వినియోగంలోకి తెస్తున్నారు. అందుబాటులో ఉన్న పనిముట్లు.. ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్ల ర్, టార్పాలిన్లు, పవర్ స్ప్రేయర్స్, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ట్రాక్టర్ ఆపరేటర్ తదితర పనిముట్లు, పరికరాలు కస్టమ్ హైరిం గ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 29 జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం శక్తికి మించి భారం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రైతులే 80 శాతం మంది ఉన్నారు. వీరికి యాంత్రీకరణను చేరువ చేయడంలో సీహెచ్‌సీలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. అలాగే పెట్టుబడులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అధిక విస్తీర్ణంలో పంటల సాగు కూడా సులభం కానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. సీహెచ్‌సీలకు మంచి స్పందన లభిస్తుండటంతో వీటి సేవలు విస్తరించాలన్న డిమాండ్ వస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నారు. పట్టణ ప్రాంత సెగ్మెంట్లు మినహా.. గ్రామీణంలో ఉన్న సుమారు 75 నియోజకవర్గాల్లో త్వరలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 31 సెగ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటయ్యే సీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభించదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పరికరాలు, పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయంలోంచి రుణాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను చూసుకోవాలి. రైతులకు ఎంతో మేలు.. సీహెచ్‌సీలతో పేద, మధ్య తరగతి రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మహిళా సంఘాల ద్వారా మా వంతు సహకారం అందించనున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అధికంగా వ్యవసాయం చేసే మూడు గ్రామాలను గుర్తించి యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశాం. ఫోన్ నంబర్లు ఇచ్చి ఒక సీసీతో పాటు అకౌంటెంట్‌ను పర్యవేక్షణకు నియమిస్తున్నాం. బయటి కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నాం. – వట్నాల శ్యామల, రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
స్వయం ఆధారిత పర్యావరణ సేద్యం!
స్వావలంబన (స్వయం ఆధారిత), స్థానికత.. కొవిడ్ తదనంతర కాలపు ఎజెండా ఇది. నిజానికి.. అచ్చం ఇదే ఎజెండాను జహీరాబాద్ ప్రాంత దళిత మహిళా రైతులు 30 ఏళ్లుగా అమలు చేస్తున్నారు. ఈ వర్షాకాలపు పంట(ఖరీఫ్) కాలంలో సుమారు 30 గ్రామాల్లో 1200 ఎకరాల్లో ఎప్పటి మాదిరిగానే తమదైన ప్రత్యేక పర్యావరణ వ్యవసాయం చేపట్టడానికి వెయ్యి మంది మహిళా రైతులు సన్నద్ధమవుతున్నారు. అంతగా సారం లేని తమ ఎర్ర నేలల్లో వర్షాధార పంటలను.. మార్కెట్ కోసం కాదు, మా కోసం, మా సంప్రదాయ పద్ధతుల్లోనే పండించుకుంటామని ఇటీవల ముక్తకంఠంతో ప్రతినబూనారు. } పొలంలో వేసే ఎరువు మొదలుకొని భిన్నరకాల(చిరు/ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు..) విత్తనాలు.. పర్యావరణానికి, మనుషులకి, గొడ్డుగోదకు హాని చేయని తెగులు నివారణ ద్రావణాలు, కషాయాల పిచికారీలు.. సేంద్రియ ఎరువుల వరకు ప్రతి దాన్నీ తమ దగ్గర ఉన్న వనరులతోనే రైతులు స్వయంగా తయారు చేసుకుంటారు. పంట కోసం అప్పుతేవడం గానీ, ఇతరుల నుంచి ఒక్క రుపాయి తీసుకోవడం గానీ, సర్కారు ఎరువులు వాడడం గానీ చేయరు. పంట సీజన్ ముగిసే సరికి సంప్రదాయ సాగులోని విభిన్న పద్ధతులు, పర్యావరణ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెబుతారు. ఇది పర్యావరణ వ్యవసాయం యొక్క అత్యంత విలువైన లక్షణం. ఈ మొత్తం పంటల సాగు ప్రక్రియలో వాడే ప్రతిదీ స్థానికమే అని సగౌరవంగా చాటి చెబుతారు. సాగు పద్ధతి ఇదీ.. ► 1200 ఎకరాలకు 48,000 టన్నులకు (ఎకరానికి 40 టన్నులకు) పైగా పశువుల ఎరువు, ప్రత్యేకమైన ‘సమృద్ధి ఎరువు’ వాడతారు. ► విత్తన శుద్ధికి, పంట పెరుగుదలకు ఉపయోగపడే 2000 లీటర్ల బీజామృతం తయారు చేసుకొని వాడతారు. ► పంచగవ్య వంటి సుమారు 5,000 లీటర్ల ‘టానిక్స్’ వాడటం ద్వారా పంటల పెరుగుదల క్రమాన్ని బలోపేతం చేస్తారు. ► పూత ఎక్కువ రావడానికి, మొక్కలపెరుగుదలకు సహాయపడటానికి 48,000 లీటర్ల వర్మివాష్ 1200 ఎకరాలకు పిచికారీ చేస్తారు. ► ఈ మహిళలు జీవవైవిధ్య సాగు కోసం 10–15 రకాల 12,000 కిలోల సొంత విత్తనాలను తమ చేలల్లో నాటనున్నారు. ► ఈ ఖరీఫ్ పంట సీజన్‌నులో ఈ భూములపై తమ శ్రమతోపాటు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చు పెట్టనున్నారు. ► ఇక ఆర్థిక రాబడి ఎంతంటారా?.. నీటివసతి లేని ఈ ఎర్రనేలల నుంచి ఎకరానికి రూ.55,000 వరకు రాబడి తీస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈ పంటల విధానం చిన్న కమతాలున్న మహిళా రైతుల అవసరాలను తీరుస్తుంది. తిండికి, పౌష్టికాహానికి, ఆరోగ్యానికి, జీవనోపాధికి భద్రతనివ్వడంతోపాటు పశువుల మేతకూ భద్రత ఇస్తోంది. ఎందుకంటే ఇక్కడ రసాయనిక మందుల వాడకం అంటూ ఉండదు. ఈ ప్రకృతిసిద్ధమైన పంటల వల్ల కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని మహిళా రైతులు మనోధైర్యంతో చెబుతున్నారు. సొంత కాళ్లపై నిలబడి సొంత వనరులతో మహిళా రైతులు చిన్నపాటి కమతాల్లో చేపట్టే ఈ పర్యావరణ జీవవైవిధ్య వ్యవసాయానికి జేజేలు పలుకుదాం! -
బండి నిండుగా పండుగ
సంక్రాంతి పండుగ వచ్చింది. వస్తూ వస్తూ బండెడు ధాన్యాన్ని మోసుకొచ్చింది. ఏడాదంతా రైతులు పొలంలో పడిన కష్టానికి ప్రతిఫలం. ఈ పండుగ సందర్భంగా.. ‘రాబోయే ఏడాదికి ఈ పంటలు వేసి చూడండి..’ అంటూ అంతరించి పోతున్న పంట విత్తనాల ప్రదర్శన పెట్టారు మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్ గ్రామ మహిళా రైతులు. సంక్రాంతి.. పంటల పండుగే కాదు, విత్తనాల పండుగ కూడా అంటున్నారు ఈ మహిళా రైతులు. బండిని, ఎడ్లను అలంకరించి అరుదైన విత్తనాలను పెట్టెల్లో పెట్టి ఊరూరా తిప్పుతున్నారు. ఈ వేడుకను చూడడానికి విదేశాల నుంచి కూడా మహిళా రైతు ప్రతినిధులు పస్తాపూర్ వచ్చారు. వెస్ట్ ఆఫ్రికాలోని మాలి అనే చిన్న దేశం నుంచి వచ్చిన అలిమాత ట్రావోరే... మెదక్ జిల్లాలో ఇరవై ఏళ్లుగా జీవ వైవిధ్య పంటల సాగు చేస్తున్న మహిళా రైతులతో సమావేశమయ్యారు. నిన్న భోగి పండుగ రోజు ప్రారంభమైన జీవ వైవిధ్య సంచార జాతర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. మీ నుంచి నేర్చుకున్నాం ‘‘భారతదేశం నుంచి అనేక మంది మహిళలు 2014లో వెస్ట్ ఆఫ్రికాలోని డిజిమినిలో జరిగిన విత్తన మేళాకు హాజరయ్యారు. డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) మహిళలు అవలంబిస్తున్న విత్తన బ్యాంకు విధానాన్ని మేము కూడా అనుసరిస్తున్నాం. ఈ గ్రామీణ మహిళల స్పూర్తితో మా దేశాల్లో కూడా గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయగలిగాం. విత్తనాలను భద్రపరుస్తున్నాం. చిరు ధాన్యాల ప్రాసెసింగ్, మిల్లెట్ మార్కెటింగ్, చెట్ల మందులు తదితర వాటిపై వీడియోలు తీయడం కూడా నేర్చుకున్నారు’’ అని చెప్పారు ట్రావోరే. ఈ సమావేశానికి వచ్చిన సెనెగల్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్టర్, మహిళా రైతు ఫ్రాన్సిస్కాడౌఫ్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ మహిళల ఆహార పంటల సేద్యం చాలా బాగుంది. సేంద్రీయ వ్యవసాయం చేయడం ఎంతో గొప్ప విషయం. జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను, ఇక్కడి అనుభవాల గురించి తెలుసుకునేందుకు వచ్చాను’’ అన్నారు. ప్రాన్స్ కు చెందిన జీవ వైవిద్య వినిమయం, అనుభవాలను పంచుకునే సంస్థ ప్రతినిధి ఆనె బర్సో మాట్లాడుతూ ‘‘మేము జీవ వైవిద్యం, ఆహారం కోసం పనిచేసే ఇతర సంస్థలను కలుపుకుని పనిచేస్తున్నాం. మా వ్యవసాయానికి, ఆహార భద్రతకు వాణిజ్య సంస్థల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలో ఒక కొత్త గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలన్నదే మా ప్రయత్నం’’ అని పేర్కొన్నారు. జీవ వైవిద్యాన్ని పరిరక్షించుకునేందుకు గాను మనమంతా కలిసి మన గొంతుకలను పెద్దవిగా చేసి వినిపించాల్సిన అవసరం ఉందని మహిళా రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. – శ్రీనివాసరెడ్డి, సాక్షి, జహీరాబాద్ ఫొటోలు : బి. శివప్రసాద్ సాక్షి, సంగారెడ్డి -
సంప్రదాయసాగుపై అ‘సెస్’మెంట్
సాక్షి, హైదరాబాద్: ‘మెట్ట రైతులు అనాదిగా అనుసరిస్తున్న సమీకృత సంప్రదాయ వ్యవసాయకజ్ఞానం ప్రతికూల వాతావరణంలో సైతం పౌష్టికాహార, ఆదాయ భద్రతను అందిస్తుంది. రైతుల భావోద్వేగాలు, ఆచారాలు, సంస్కృతితో ఈ వ్యవసాయం ముడిపడి ఉంది. వర్షం ఉన్నప్పుడు ఏ పంటలు వేయాలి, కరువొచ్చినప్పుడు ఏ యే భూముల్లో ఏ యే పంటలు కలిపి వేసుకోవాలన్న సంప్రదాయ విజ్ఞానం జీవవైవిధ్య సంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో అంతర్భాగం’అని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) తదితర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. సెస్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డి.డి.ఎస్.), న్యూఫీల్డ్ ఫౌండేషన్(యు.ఎస్.) ఆధ్వర్యంలో గత ఏడాది ఖరీఫ్, రబీల్లో జహీరాబాద్ ప్రాంత రైతుల సాగు, జీవన స్థితిగతులపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ పరిశోధనా సంచాలకులు ఆర్.ఉమారెడ్డి, సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్‌రెడ్డి, డీడీఎస్ కమ్యూనిటీ మీడియా ట్రస్టు అధిపతి చిన్న నరసమ్మ, డీడీఎస్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ దంతలూరి తేజస్వి, డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్ అధ్యయనం చేశారు. వివరాలను వారు మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం... జహీరాబాద్ ప్రాంతంలోని 11 గ్రామాల్లో 20–30 మంది రైతులను 2017 జూన్ నుంచి 2018 మే వరకు అనేక దఫాలుగా కలుసుకొని, వారి సాగువిధానాన్ని సునిశితంగా పరిశీలించామని సెస్ అసోసియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త సురేశ్‌రెడ్డి తెలిపారు. తాము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకోని విషయాలెన్నో ఆ రైతుల వద్ద నుంచి తెలుసుకున్నామన్నారు. ‘విత్తనాన్ని బుట్టల్లో బూడిద, వేపాకు, ఎర్రమట్టి కలిపి దాచుకుంటారు. దిగుబడి ఎన్ని బస్తాలు? అనేది ఒక్కటే కాదు, పశువులకు మేత, భూమికి బలిమినిచ్చేవి ఏ పంటలు అని వాళ్లు చూసుకుంటారు. వాళ్ల పొలాల్లో సాగు చేయకుండా పెరిగే మొక్కలు పోషక, ఔషధ విలువలున్న అద్భుతమైన ఆకుకూరలు, వాళ్ల భూములు కూడా జవజీవాలతో ఉన్నాయి. వీళ్ల వ్యవసాయం జూదప్రాయం కాదు. అప్పులు, ఆత్మహత్యలుండవు. వ్యవసాయ సంక్షోభం నివారణకు ఇది అనుసరణీయం’ అని సురేశ్‌రెడ్డి అన్నారు. -
స్కూటీతో సేద్యానికి...
‘నాకు రాదు’అంటే ఏదీ రాదు!లక్ష్మీపూర్ అయితే అసలే ఊరుకోదు.‘బండి నేర్చుకో’ అంటుంది.ఆ ఊళ్లో ఏడాదంతా పంటకాలమే.మహిళలు బండి వెనుక కూర్చున్నంతకాలంకాలంతో పోటీపడలేకపోయారు.బండి ముందు కూర్చున్నాకకాలమే వారితో పోటీ పడలేకపోతోంది!ఇప్పుడు వాళ్లు.. బండెనక బండి కడుతున్నారు.ఊరికి ధాన్య‘లక్ష్మీకళ’ను తెస్తున్నారు. ఆ గ్రామంలో యువ మహిళా రైతులు చదివింది పదోతరగతి లేదంటే ఇంటర్మీడియట్. అయినప్పటికీ.. ఓ వైపు సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూనే, మరోవైపు దానికి ఆధునికతను జోడిస్తూ పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడూ భర్త చాటు భార్యగా మోటర్ సైకిల్‌పై వెనుక సీట్లోనే కూర్చుని వెళ్లేవారు ఇప్పుడు అదే మోటర్ సైకిల్‌పై డ్రైవింగ్ సీట్లో కూర్చుని తాము ముందుకు వెళ్లడమే కాదు, కుటుంబాన్ని సైతం ముందుకు తీసుకెళ్లుతున్నారు! ఈ దృశ్యం మీకు.. ఇప్పటికే రైతుల ఐకమత్యంతో లక్ష్మీపూర్ రైస్, లక్ష్మీపూర్ సీడ్‌తో రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వెలుగొందిన లక్ష్మీపూర్‌లోనే కనిపిస్తుంది. ఇప్పుడా ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ ఓ స్కూటీ ఉందంటే అశ్చర్యం కలుగక మానదు. ఆ గ్రామ మహిళా యువ రైతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఏడాదంతా వ్యవసాయం! జగిత్యాల జిల్లా కేంద్రానికి 7 కి.మీ దూరంలో ఉండే లక్ష్మీపూర్ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎంత చదువుకున్నా వ్యవసాయాన్ని వదిలిపెట్టరు. అలాగే, వారి భార్యలు సైతం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిందే. ఈ గ్రామంలో ఏదో ఒక్క పంటనే పండించకుండా పసుపు, వరి, మొక్కజొన్న, వేరుశెనగ.. ఇలా అన్నిరకాల పంటలు పండిస్తూ మిశ్రమ వ్యవసాయ సాగు చేస్తూ, ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఎండకాలంలో 10–20 రోజులు మినహాయిస్తే, ఏడాది మొత్తం వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు. గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో, వారి కుటుంబ నిర్వహణలో కూడా అధునికత సంతరించుకుంటుంది. దీంతో ఈ గ్రామానికి ఆడపిల్లను ఇచ్చేందుకు తల్లితండ్రులు పోటీ పడుతుంటే, మరికొందరు ఆడపిల్లలు మాత్రం వ్యవసాయంపై ఉన్న అభిమానంతోనే ఇక్కడి వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటి వరకు కాలే జీలకు వెళ్లిన ఆడపిల్లలు సైతం ఒకరిని చూసి ఒకరు వ్యవసాయం చేసేందుకే ఉత్సాహం చూపించడమే కాకుండా.. పాత వ్యవసాయ పనులకు భిన్నంగా నూతన ఒరవడితో సాగును ముందుకు తీసుకెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏడాది పొడవునా పురుష రైతులతో సమానంగా మహిళా రైతులు తోటలకు వెళ్లి వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుంది. రైతులు ఉదయాన్నే పనులకు వెళ్లుతుంటే, వారి భార్యలు, పిల్లలను స్కూళ్లకు పంపించి, అన్నం వండుకుని, నడుచుకుంటూ 2–3 కి.మీ దూరంలో ఉన్న పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. భార్యాభర్తలకు తోడు మరో ఇద్దరు కూలీలు అవసరమైనప్పుడు, వారిని తోటల వద్దకు తీసుకెళ్లడం కష్టంగా మారడంతో.. స్కూటీలు వారి పనిని సుళువు చేశాయి. ధైర్యం చేసి నేర్చుకున్నారు వివిధ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు, ప్రతిరోజూ మహిళా రైతులను తమ మోటర్ సైకిల్‌పై తోట వద్ద విడిచిపెట్టడం కుదరడం లేదు. దీంతో, మూడేళ్ల క్రితం కొంతమేర చదువుకుని, ధైర్యంగా ఉండే యువ మహిళా రైతుల్లో ఒకరిద్దరు నూతన మోడళ్లలో వచ్చిన స్కూటీలను కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టారు. ఆ స్ఫూర్తితో దాదాపు 50 నుండి 60 మంది మహిళా రైతులు స్కూటీలు కొనుగోలు చేసి, వాటిపై కూలీలను, తోటి మహిళా రైతులను ఎక్కించుకుని రయ్..రయ్ మంటూ పంటపొలాలకు వెళ్లుతున్నారు. అంతేకాదు, దగ్గర్లోని బంధువు ఇళ్లకు, జగిత్యాల లాంటి పట్టణాలకు వచ్చినప్పుడల్లా తమ స్కూటీపైనే వస్తుంటారు. రైతులు జగిత్యాలకు వచ్చినప్పుడు పెట్రోల్ కొని తీసుకెళ్లి, స్కూటీల్లో పోస్తుంటారు. దీంతో, తోటలో వ్యవసాయ పని ఉన్నప్పుడల్లా భర్త కోసం ఎదురు చూడకుండా, తోటలో అవసరమయ్యే ఒకరిద్దరు కూలీలను ఎక్కించుకుని పనికి వెళ్లుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో భర్తకోసం భార్య, భార్య కోసం భర్త ఇలా.. ఒక్కరి కోసం ఒకరి సాయం కోసం ఒకరు చూసే అవసరం లేకుండా పోయింది. ఎవరి మోటర్ సైకిళ్లపై వారు వెళ్తున్నారు. స్కూటీ కంపెనీల ఆశ్చర్యం గ్రామానికి చెందిన మహిళా యువ రైతులు పోటీ పడి స్కూటీలు కొనుగోలు చేస్తుండటంతో, చాల కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, చివరకు ఈ గ్రామంలో స్కూటీ మోటర్ సైకిల్ మేళాలు కూడా ఏర్పాటు చేసాయి. మహిళా యువ రైతులను ఆకర్షించేందుకు కంపెనీలు పలు ఆఫర్లు కూడా ప్రకటించాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుని, వ్యవసాయ పనులతో పాటు మహిళలు పలు శుభకార్యాలకు తమ బంధువులను ఎక్కించుకుని వెళ్లడానికి కుదురుతోంది. ఇదిలా ఉంటే, లక్ష్మీపూర్‌కి ఎవరైనా చుట్టం చూపుగా వచ్చిన వారు ఆ గ్రామ మహిళా యువ రైతులు స్కూటీలపై వెళ్లడం చూసి నోరు వెళ్లడం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల ఫొటోలు : ఏలేటి శైలేందర్ రెడ్డి బర్రెకు గడ్డి సైతం తోటలకు వెళ్లిన తర్వాత, అక్కడ గట్ల వెంబడి ఉండే గడ్డిని స్కూటీపై బర్రెలకు తీసుకు వస్తాను. మొదట స్కూటీ నడపడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు స్కూటీ నడపడం తేలిక కావడంతో రోజు స్కూటీపైనే వ్యవసాయ పనులకు వెళుతున్నాను. నాతోపాటు కూలీలను సైతం తీసుకెళ్తున్నాను. – మిట్టపల్లి వరలక్ష్మి సామానంతా స్కూటీపైనే వ్యవసాయ పనులకు అవసరమైన పార, గుల్ల, ఇతర సామానంతా స్కూటీపైనే తీసుకుని వెళ్తాను. తోటలు దూరంగా ఉండటంతో స్కూటీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తోట వద్ద దించి రావాలంటే భర్తకు కూడా కష్టమే. అందుకే స్కూటీ నేర్చుకుని నేను నడుపుతున్నా. కూలీలను ఎక్కించుకుని వెళ్తున్నా ప్రతిరోజూ ఇద్దరు కూలీలను ఎక్కించుకుని వ్యవసాయ పనులకు వెళుతుంటాను. మొదట స్కూటీ కొనిచ్చేందుకు నా భర్త భయపడ్డాడు. ఇప్పుడు నేనే స్వయంగా నడుపుకుంటూ వ్యవసాయ పనులకు వెళుతుండటంతో, నా భర్త ఇతర వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. -
నిన్నెలా నమ్మాలి లోకేశ్?
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేశ్‌కు అడుగడుగునా నిలదీతలు, సొంత పార్టీ నేతల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు ఇవ్వని రైతులను వేధించడంతో రైతులంతా ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకుంటామని చెప్పి బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని 10 గ్రామాల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భూములు కాపాడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారని, ఐదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ 10 గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు ఉన్నారు. వీరంతా ఇప్పుడు లోకేశ్‌ను ఓడించేందుకు సిద్ధమయ్యారు. కొండ మీద ఇళ్లు తొలగించాలని నోటీసులు పర్యాటకాభివృద్ధి పేరుతో తాడేపల్లి మండలంలో కొండల మీద ఉన్న సుమారు 4 వేల ఇళ్లను తొలగించాలని ఇదివరకే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీంతో వీరంతా టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. గతంలోనూ చాలా హామీలు ఇచ్చారు! గత ఎన్నికలకు ముందు కూడా అధికారంలోకి రావడానికి టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని.. అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా హామీలు ఇస్తున్నారని.. అయితే ఎన్నికలు అయిపోగానే తమ పని తాము చేసుకుపోయేందుకు టీడీపీ నాయకులు ఏ మాత్రం వెనుకాడరని భావిస్తున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఇళ్లు తొలగించిన వారికి ఇళ్లు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రశాంతంగా జీవించాలంటే లోకేశ్‌కు బై బై చెప్పాలి..! నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా జీవించాలంటే లోకేశ్‌కు ‘బై బై’ చెప్పాలనే నినాదం జోరుగా వినిపిస్తోంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సంప్రదాయం టీడీపీకి లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే కుంచనపల్లిలో 171 ఎకరాలను రిజర్వ్ జోన్లో ఉంచి తమ పార్టీ నాయకులకు మేలు చేకూర్చిన విషయాలను వారు చర్చించుకుంటున్నారు. ఇక్కడ లోకేశ్‌ను గెలిపిస్తే భూములు బలవంతంగా లాక్కుంటారని.. మంగళగిరిని కబ్జాలకు అడ్డాగా మార్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘‘అయిదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములివ్వని రైతులను వేధించారు. భూసేకరణ కింద భూములు కాజేసేందుకు తీవ్రంగా యత్నించారు. మా భూములు కాపాడుకునేందుకు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారు.?’’ – గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రచారానికి వచ్చిన లోకేశ్‌ను నిలదీసిన మహిళా రైతు ‘‘ 2015 కృష్ణా పుష్కరాల సమయంలో ఇళ్లను తొలగించారు. నాలుగేళ్లవుతున్నా స్థలాలు చూపించలేదు. ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. తాడేపల్లి, ఉండవల్లిలో కొండ మీద ఉన్న ఇళ్లను తొలగించాలని నోటీసులిచ్చారు. ఈ అయిదేళ్లలో ఒక్కసారైనా మా బాధలు విన్నారా? ఇప్పుడు ఎన్నికలు రాగానే మేము కనిపించామా?’’ – ఇవీ తాడేపల్లిలో లోకేశ్ నిర్వహించిన ప్రచారంలో స్థానికుల నుంచి ఎదురైన ప్రశ్నలు -
మల్బరీ సాగులో మహిళా రైతులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు. మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే మల్బరీ పంటపై దృష్టి సారించారు. పంట కాలం తక్కువ.. లాభం ఎక్కువ.. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్ నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ అవగాహన పెంచుకుంటే నష్టం రాదు నాకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేస్తున్నా. సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు పట్టు గూళ్ల దిగుబడి పొందవచ్చు. తక్కువ వ్యవధిలో, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అయితే, మల్బరీ పంట సాగుపై అవగాహన పెంచుకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. మా ఊళ్లో చాలా మంది రైతులు మల్బరీ పంటనే సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. – గోపగాని సరిత, మహిళా రైతు, తుమ్మనపల్లి హేళన చేసిన వారే సాగులోకి వస్తున్నారు నాకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి మల్బరీ సాగుచేస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించుకుని మల్బరీ పంట సాగు మొదలు పెట్టాను. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళనగా చూశారు. పంట చేతికి వచ్చిన తర్వాత లాభాల గురించి తెలుసుకుని వాళ్లు కూడా మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఆహార పంటల కంటే మల్బరీ సాగే ఉత్తమం. – నిమ్మల వనజారెడ్డి, మహిళా రైతు, తుమ్మనపల్లి ఆరేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేపట్టేందుకు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాను. వారు మల్బరీ సాగు విధానం గురించి వివరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నా. మల్బరీ సాగులో ఏమైనా సందేహాలు వస్తే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటున్నా. ఉద్యోగిలా నెల నెలా ఆదాయం పొందుతున్నా. సంతోషంగా ఉంది. – కాసిరెడ్డి కవిత, మహిళా రైతు, తుమ్మనపల్లి