అప్పుల బాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది
అప్పుల బాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరమ్మ(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.