mango farmer
-
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్‌తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్‌రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
Fact Check: మామిడి రైతును ఆదుకున్నదెవరు?
సాక్షి, అమరావతి: మామిడి సహా వివిధ రకాల ఉద్యాన, వ్యవసాయ పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరోనా విపత్తులో సైతం రైతన్నలు విక్రయించుకునేలా, పొరుగు రాష్ట్రాలకు తరలించేలా రవాణా సౌకర్యాలను కల్పించింది. అనంతపురం నుంచి ఉద్యాన ఉత్పత్తులతో ఢిల్లీకి ఏకంగా ప్రత్యేక కిసాన్ రైలును అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మామిడి తోటలు విస్తరించేలా నాలుగేళ్లుగా ప్రోత్సహిస్తోంది. ఫ్రూట్ కవర్లకు రాయితీలతోపాటు తోట బడులతో ఆర్బీకేల ద్వారా రైతన్నలకు శిక్షణ ఇస్తోంది. వైపరీత్యాల్లో పంట నష్టపోయిన మామిడి రైతులకు పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తోంది. బంగినపల్లి, ఇమామ్ పసంద్ లాంటి ఫైన్ వెరైటీ మామిడి పండ్లకు టీడీపీ హయాంలో గరిష్టంగా టన్ను రూ.40 వేలు – రూ.50 వేలు మాత్రమే ధర పలుకగా ప్రస్తుతం రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పలకడం గమనార్హం. తోతాపురి మామిడి పండ్లకు టీడీపీ హయాంలో గరిష్టంగా టన్ను రూ.12 వేలు పలుకగా ప్రస్తుతం రూ.23 వేలకు పైగా దక్కుతోంది. వాస్తవాలు ఇలా ఉండగా తన పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ మామిడి రైతుకు సర్కార్ దెబ్బ అంటూ ఈనాడు విషం కక్కింది. ఆరోపణ: తోటల పునరుద్ధరణ, విస్తరణ జాడేది? వాస్తవం: రాష్ట్రంలో 9.95 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. నాలుగేళ్లలో రూ.14.53 కోట్లతో 20,682.50 ఎకరాలలో కొత్తగా మామిడి తోటలు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అధిక సాంద్రత విధానంలో తోటలు పెంచటాన్ని ప్రోత్సహిస్తోంది. సూక్ష్మ నీటి సాగు çపథకం కింద పెద్ద ఎత్తున డ్రిప్ పరికరాలను సమకూర్చడంతో పాటు పాత తోటలను పునరుద్ధరిస్తున్నారు. గత నాలుగేళ్లలో 20,585 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రూ.14.41 కోట్ల రాయితీని అందించారు. ఆరోపణ: చీడపీడల నివారణ చర్యలేవి? వాస్తవం: గత నాలుగేళ్లలో 883 తోట బడుల ద్వారా సమీకృత తెగులు, ఎరువు యాజమాన్య పద్ధతులపై మామిడి రైతులకు ఆర్బీకే స్థాయిలో శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందాలను మామిడి సాగయ్యే జిల్లాలకు పంపి చీడపీడలు, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నల్ల తామరతో సహా వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతు క్షేత్రాల్లో సామూహిక నివారణ చర్యలు చేపట్టారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించారు. తద్వారా నాణ్యత ప్రమాణాలను పెంచి దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా మన మామిడికి గిరాకీ కల్పించారు. ఆరోపణ: కానరాని మౌలిక సౌకర్యాలు వాస్తవం: రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కోత అనంతర యాజమాన్య పద్ధతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించారు రూ.35.04 కోట్ల రాయితీతో 1,752 ప్యాక్ హౌస్‌లను రైతుల పొలాల్లో నిరి్మంచారు. రూ.39.02 కోట్ల రాయితీతో 347 కలెక్షన్ సెంటర్లు మామిడి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా నిర్మించారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా కలెక్షన్ సెంటర్లలో గ్రేడింగ్, ప్యాకింగ్‌తో దూర ప్రాంత మార్కెట్లకు తరలించి మంచి ధరలు పొందే వెసులుబాటు కలిగింది. 2023–24లో మామిడి రైతుల అభివృధ్ధి కోసం రూ.22.50 కోట్ల రాయితీతో మామిడి ఎఫ్పీఓల ద్వారా 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్ల రాయితీతో రైతు క్షేత్రాల్లో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.కోటి రాయితీతో 2,802.50 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మామిడి సాగు, రూ.3.50 కోట్ల రాయితీతో 6,250 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల నాణ్యత ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు ఆమోదించారు. ఆరోపణ: పెద్దల చేతుల్లో చిత్తూరు రైతు చిత్తు వాస్తవం: చిత్తూరు జిల్లాలో ఎక్కువగా సాగయ్యే తోతాపురి రకం ధర టీడీపీ హయాంలో 2017–18లో టన్ను రూ.5 వేల కంటే తక్కువకు పడిపోయింది. గుజ్జు పరిశ్రమలు కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్న సంకల్పంతో మామిడి ధరల స్థిరీకరణ కోసం కలెక్టర్ నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం, రైతులు, ఉద్యాన, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. వారం వారం ఈ కమిటీ సమావేశమై ధరల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతుంది. మామిడి తోటలను సమీప గుజ్జు పరిశ్రమలకు అనుసంధానం చేశారు. తోతాపురి మామిడి ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధరలు పతనం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆధునిక కోత పరికరాలతో పాటు పండు ఈగ నివారణకు ఆకర్షణ బుట్టల పంపిణీని రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరు జిల్లాలో చేపట్టారు. కోయడం, నాణ్యతపై రైతులకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గుజ్జు తయారీ పరిశ్రమలకు చేరవేయడంపై ఆర్బీకే సిబ్బందికి శిక్షణ అందించారు. బలవంతపు అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. మొత్తం పండ్లను ఒకేసారి కోసి నష్టపోకుండా దశల వారీగా పండ్ల కోతలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టడంతో ఏ దశలోనూ టన్ను రూ.10 వేలకు తగ్గకుండా ఉంది. ఈ సీజన్లో గరిష్టంగా రూ.23 వేలకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.11 వేలు పలుకుతోంది. రానున్న నెల రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో మామిడి రైతులకు ఈ స్థాయిలో అండగా నిలిచిన దాఖలాలే లేవు. ఆరోపణ: ఎగుమతులకు ఏదీ ప్రోత్సాహం? వాస్తవం: ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏటా అపెడా ఆధ్వర్యంలో అమ్మకం, విక్రయదారుల సదస్సులు నిర్వహిస్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగాయి. నాలుగేళ్లలో 1,103.78 టన్నుల పండ్లతో పాటు 8 లక్షల టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేయడం గమనార్హం. ఆరోపణ: కవర్ల రాయితీలో కోత వాస్తవం: నాణ్యతకు పెద్ద పీట వేస్తూ రైతులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా డిమాండ్ మేరకు కవర్లను రాయితీపై అందిస్తున్నారు. గత నాలుగేళ్లలో రూ.1.80 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను రైతులకు పంపిణీ చేసి మామిడి పండ్ల నాణ్యత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినది. 2023–24లో కూడా డిమాండ్ మేరకు రాయితీపై కవర్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
పంటలు అస్తవ్యస్తం.. ఊహకందని నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు... వడగళ్ల వానలు... ఈదురుగాలులు రాష్ట్ర వ్యవసాయాన్ని అతలాకుతలం చేశాయి. నెలలో రెండోసారి కురిసిన వర్షాలతో అంచనాలకు మించి నష్టం జరిగి ఉండొచ్చని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నాలుగైదు లక్షల ఎకరాలే అనుకోవడానికి వీలులేదని, ఊహకందని నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పంటలు ప్రభావితం కాగా, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పంటలు ఊడ్చుకుపోయాయి. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ ఈసారి మొదట్లోనే పూత సరిగా లేదు. కాత రాలేదు. దానికితోడు గత నెల, ఇప్పుడు కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు 75 శాతం ఉత్పత్తి పడిపోతుందని ఉద్యానశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి అంచనాకుగాను, కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులే (25 శాతమే) వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మామిడి తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు, కాత అంచనా ప్రకారం రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాయలు రాలిపోవడంతో అనేకచోట్ల రైతులు వ్యాపారులకు లీజు డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్లనైతే మామిడి కాయంతా రాలి పాడైపోయింది. కనీసం తక్కువ ధరకు కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో మామిడి కాయలు, పండ్ల ధర భారీగా పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులపైనా ప్రభావం పడనుంది. పొలాల్లోనే నేలపాలు... ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి ఇప్పటివరకు 40 శాతం వరకు కోతలు పూర్తయినట్లు అంచనా. అందులో చాలావరకు ఇంకా మార్కెట్‌కు రాకపోవడంతో తడిసిపోయింది. ఆ రకంగా రైతులకు నష్టం వాటిల్లగా, మరోవైపు ఇప్పటివరకు 60 శాతం వరకు పంట కోత దశలోనే ఉంది. అంటే 33 లక్షల ఎకరాలు ఇంకా కోత దశలోనే ఉందని అంచనా. అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పొలాల్లోనే వరి గింజలు నేల రాలాయి. కొన్నిచోట్ల ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయింది. దీంతో ఊహకందని విధంగా వరికి నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతున్నాయి. అలా నేల రాలిన గింజలు ఏమాత్రం పనికి రావని, దాంతో అనేక జిల్లాల్లో రైతులు వాటిని కోయకుండా వదిలేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా చేతికి వచ్చినా అది రంగు మారి ఉంటుంది. దాన్ని అమ్ముకోవడం కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో పంటలు కేవలం నాలుగైదు లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందన్న అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ వర్గాలు నిష్పక్షపాతంగా అంచనా వేస్తే తప్ప రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మొక్కజొన్న పంటలూ దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలులకు చాలాచోట్ల మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి. -
మార్కెట్లోకి పళ్ల రారాజు.. వామ్మో! కిలో హాపస్ మామిడి ధర రూ.2000?
వేసవికాలం ప్రారంభమైంది. అంటే మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసినట్లే. మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను ఎప్పుడు ఎప్పుడు రుచి చుద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల మీద పండే దశలో ఉన్నాయి.మరో నెల రోజులు ఆగితే ఎన్నో రకాల పండ్లు ప్రతి మార్కెట్లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే భారత్‌లోని పలుప్రాంతాల్లో మామిడి పండ్లు వచ్చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బిహార్‌లోని పాట్నా మార్కెట్లోకి అడగుపెట్టాయి. సాధారణంగా మామిడి పండు వెరైటీని బట్టి వాటి ధర ఉంటుంది మనకు తెలిసినంత వరకు కేజీ వంద రూపాయలదాకా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పండ్లు అందుబాటులో ఉండడంతో కిలో ధర రూ.350 నుంచి రూ.500 పలుకుతున్నాయి. మరి కొన్ని రకాల మామిడికాయలు రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ముంబై, ఒరిస్సా, ఢిల్లీ నుంచి మామిడిపండ్లు వస్తున్నాయి.ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ.. త్వరలో విక్రయాలు పుంజుకుంటాయని పాట్నాలోని ఫ్రూట్ మార్కెట్లో పండ్లు అమ్మే ఓ వ్యక్తి తెలిపారు. ఒడిశాలోని మాల్డా, మహారాష్ట్రకు చెందిన ప్యారీతో సహా గులాబ్ఖాస్ మామిడి అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్ల ధర కిలో రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంది. అంతేగాక ఈ రకం పండు ఒక్క కాయ ధర ఏకంగా రూ.150-200 వరకు అమ్ముడవుతోంది! అల్ఫోన్సో లేదా హాపస్ అని కూడా పిలువబడే పండు మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లను ఇన్కమ్ ట్యాక్స్ గోలంబర్ ప్రాంతంలో డజను రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అల్ఫోన్సో GI ట్యాగ్ కూడా అందుకుంది. ఈ పండ్లకున్న ప్రత్యేక రుచి, సువాసన, తీపి కారణంగా జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేగాక హాపస్ మామిడి పండిన తర్వాత వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్ పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈ రకం పండ్లు అన్ని చోట్లా దొరకవు. కొన్ని ప్రత్యేక స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇది రాబోయే 10, 20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. -
ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘సచిన్’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం!
లక్నో: ఒకే చెట్టుకు 300 రకాల మామడి కాయలు కాయడం సాధ్యమేనా.. అంటే అవుననే అంటున్నారు భారత మ్యాంగో మ్యాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కలీమ్ ఉల్లా ఖాన్. తన 120 ఏళ్ల మామిడి చెట్టుకు అంటుకట్టే పద్ధతి ద్వారా 300 రకాల మామిడి కాయలు కాసేలా చేసినట్లు చెబుతున్నారు. కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి ఎంతగానే ఉపయోగపడుతుందని అంటున్నారు. అది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రార్థనలు చేసుకుని కిలోమీటరున్నర దూరంలోని తన పొలానికి వెళ్తారు కలీమ్ ఉల్లా ఖాన్. అక్కడ ఉన్న మామిడి చెట్టును చూసుకుంటారు. కొమ్మల్లో దాగి ఉన్న మామిడి కాయలను ప్రతిరోజు పరీక్షిస్తారు. 'దశాబ్దాలుగా మండే ఎండలో కష్టపడిన దానికి నా బహుమతి ఇది' అని చెబుతారు 82 ఏళ్ల వృద్ధుడు. ఆయన కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలిహాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆయన తోటలోని మామిడి చెట్టును చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ, మనసుతో పరిశీలిస్తే.. అది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి కళాశాలగా తారసపడుతుంది. చదువు మధ్యలోనే మానేసిన కలీమ్ ఉల్లా ఖాన్.. యుక్త వయసులోనే మామిడి చెట్టుపై తన తొలి ప్రయోగం చేశారు. కొత్త రకాలను తయారు చేసేందుకు వివిధ రకాల మొక్కలను అంటుకట్టారు. తొలుత ఏడు కొత్త రకాలను ఉత్పత్తి చేసేలా మార్చారు. కాని అది తుపాను ధాటికి నేలకొరిగింది. అయితే.. 1987 సంవత్సరం నుంచి తన ప్రయోగాలను కొనసాగిస్తూ.. 120 ఏళ్ల నాటి చెట్టుపై 300 రకాల మామిడి కాయలు కాసేలా చేశారు. ఒక్కోటి ఒక్కో రకమైన రుచి, రంగు, ఆకారం ఉండటం వాటి ప్రత్యేకత. సచిన్, ఐశ్వర్యలు ప్రత్యేకం.. తన తొలి నాటి ప్రయోగంతో వచ్చిన కొత్త రకం మామిడి కాయలకు బాలీవుడ్ స్టార్, 1994 మిస్ వరల్డ్ విన్నర్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరుతో ఐశ్వర్యగా నామకరణం చేశారు కలీమ్. ఇప్పటికీ ఆయన అభివృద్ధి చేసిన వాటిలో అవి ప్రత్యేకంగా నిలుస్తాయి. 'ఐశ్వర్యలాగానే ఆ మామిడి పండ్లు సైతం అందంగా ఉంటాయి. ఒక్క మామిడి కాయ కిలోకిపైగా బరువు ఉంటుంది. మందమైన తోలుతో ఎంతో తియ్యగా ఉంటుంది. ' అని పేర్కొన్నారు. మరికొన్నింటికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ హీరో సచిన్ టెండూల్కర్, అనార్కళీ వంటి పేర్లు పెట్టారు. 'మనుషులు వస్తుంటారు పోతుంటారు. కానీ, మామిడి పండ్లు శాశ్వతం. కొన్నేళ్ల తర్వాత ఎవరైనా ఈ సచిన్ మ్యాంగోను తింటే.. క్రికెట్ హీరోను గుర్తు చేసుకుంటారు.' అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! -
కందకాలుంటే భయం అక్కర్లేదు!
నాలుగేళ్ల క్రితం నుంచి విస్తృతంగా కందకాలు తవ్వుతున్నందు వల్ల తమ ఉద్యాన తోట భూమిలో నీటి తేమ పుష్కలంగా ఉందని, వచ్చే ఫిబ్రవరి నెల వరకూ ప్రత్యేకంగా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కె. చైతన్య రెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామ పరిధిలో ఆయనకు 40 ఎకరాల ఉద్యాన తోట ఉంది. ఇది ప్రధానంగా మామిడి తోట అయినప్పటికీ శ్రీగంధం, ఎర్రచంద్రనం, కొబ్బరి సహా కొన్ని సంవత్సరాల క్రితమే మొత్తం లక్ష మొక్కలు నాటటం విశేషం. గతంలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో బయటి నుంచి నీటి ట్యాంకులు తెచ్చి పోయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ జి. దామో దర్‌రెడ్డి(94407 02029)లను సంప్రదించి 4 ఏళ్ల క్రితం మొదటి విడత కందకాలు తవ్వారు. తర్వాత ప్రతి ఏటా ఖాళీ ఉన్న చోటల్లో కందకాలు తవ్వుతూనే ఉన్నారు. ఆ కందకాలలో ఆకులు అలములు వేయడం, అవి కుళ్లి కంపోస్టుగా మారిన తర్వాత కొత్తగా కొన్ని పండ్ల జాతుల మొక్కలు నాటడం.. దగ్గర్లో మళ్లీ కందకాలు తవ్వటం విశేషం. కందకాల్లో కంపోస్టుపై నాటిన మొక్కల వేళ్లు భూమి లోతుల్లోకి సులువుగా చొచ్చుకెళ్తున్నాయని, తద్వారా చెట్లు ఆరోగ్యదాయకంగా పెరగడంతోపాటు.. వాన నీరు కూడా సమర్థవంతంగా భూమిలోకి ఇంకుతున్నదని, తద్వారా లోపలి మట్టిపొరల్లోనూ నీటి తేమ నిల్వ ఉంటున్నదని చైతన్య రెడ్డి తెలిపారు. ఒక్క వానతోనే బోర్చు రీచార్జ్ ఈ ఖరీఫ్ సీజన్లో చాలా రోజుల వరకు తమ తోట వద్ద సరైన వర్షం పడలేదని, 20 రోజుల క్రితం కురిసిన ఒక్క వానతోనే కందకాల ద్వారా బోర్లు రీచార్జ్ అయ్యాయని తెలిపారు. తమ తోటకు 3 వైపులా ఎత్తయిన ప్రదేశాలుండటం వల్ల వర్షపు నీరు భారీగా తమ తోటలోకి వస్తుందని, కందకాలు విస్తృతంగా తవ్వడం వల్ల ఆ నీరు బయటకు పోకుండా ఎక్కడికక్కడే ఇంకుతున్నదన్నారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వడం వల్ల ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి ఇంకి, మట్టిలో తేమ బాగా ఉందన్నారు. ఫిబ్రవరి వరకు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మనం పైన అందించే నీరు లోపలి పొరలకు చేరదని, భూమి లోపలికి ఇంకిన నీటి తేమే తోటలను బెట్ట నుంచి రక్షిస్తుందన్నారు. రైతులు ఎవరి భూముల్లో వారు కందకాలు తవ్వుకుంటే నీటి వనరుల పరిరక్షణతోపాటు మన పొలంలోని విలువైన పైపొర మట్టి వానకు కొట్టుకుపోకుండా నిలబడుతుందని, లోపలి మట్టి పొరల్లోనూ నీటి తేమ చాలా కాలంపాటు ఉంటుందన్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షపు నీటి తేమ ఫిబ్రవరి వరకు చెట్లను నిలబెడుతుందన్నారు. ఆ తర్వాత నీటిని అందిస్తే సరిపోతుందని చైతన్య రెడ్డి(95500 23456) వివరించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన మామిడి రైతులు
-
కరువులోనూ కంటినిండా పంట..!
♦ పది ఎకరాల్లో మామిడి పంట రూ. 18 లక్షలకు అమ్మకం ♦ సేంద్రియ పద్ధతులతో సంతృప్తికరంగా దిగుబడులు ♦ తోటను ప్రదర్శన క్షేత్రంగా ప్రకటించిన ఉద్యాన శాఖ వచ్చే ఏడాది మంచి దిగుబడుల కోసం ఇప్పటి నుంచే పాటుపడాలనే స్వభావాన్ని ఒంటపట్టించుకొన్న ఓ యువ మామిడి రైతు.. కరువు కాలంలోనూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. రసాయనాల వాడకం చాలా వరకు తగ్గించుకుంటూ సంపూర్ణ సేంద్రియ సేద్యం దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది పంట దిగుబడులను, నాణ్యతను నిర్దేశించేది నేడు మనం చేపట్టే చర్యలేనని బలంగా విశ్వసిస్తారు నర్సింహారెడ్డి. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కట్కూర్. ఆ గ్రామంలో 2 కి. మీ. పరిధిలో విస్తరించిన మామిడి తోటల్లో ఈ ఏడాది పూత, కాత లేదు. అయినా నర్సింహారెడ్డి మాత్రం కరువు పరిస్థితుల్లోనూ ఎకరాకు పది టన్నులకు పైగా దిగుబడులు సాధిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. 1997లో బీడుగా ఉన్న తన పదెకరాల పొలాన్ని బాగు చేయించిన నర్సింహారెడ్డి బంగినపల్లి మామిడి మొక్కలను ఎకరాకు 50 చొప్పున నాటారు. మామిడి తోటను చంటి బిడ్డ మాదిరిగా సాకుతారాయన. మామిడి సాగులో ఫలసాయం తీసుకొని తోట గురించి మర్చిపోయినా.. కాయ కాసే ముందు మేలుకొని ఎరువు వేసినా ఫలితం ఉండదంటారు నర్సింహారెడ్డి. చెట్లు బాగా పెరిగి గాలి, వెలుతురు సోకకుండా అడ్డంగా ఉన్న కొమ్మలను ప్రూనింగ్(క త్తిరింపులు) చేస్తారు. వర్షం పడగానే రోటావీటర్‌తో దున్నుతారు. దీనివల్ల మామిడి చెట్ల నుండి రాలిన ఆకులు, కలుపు భూమిలో కలిసి సేంద్రియ ఎరువుగా మారుతుంది. నాలుగేళ్లకు కాపు ప్రారంభమైంది. రసాయనిక సేద్యంలో మొదటి ఏడాది పదెకరాలకు కలిపి 4 టన్నుల దిగుబడి వచ్చింది. ఇది 2007 కల్లా 50-60 టన్నులకు చేరింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగుబడుల్లో ఏ మాత్రం పెరుగుదల రాలేదు. చెరువుమట్టి వేసినా, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసినా దిగుబడులు పెరగలేదు. దీంతో రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువులతో ప్రయత్నించి చూడాలని నర్సింహారెడ్డి నిర్ణయించుకున్నాడు. 2012లో రూ. 60 వేలు ఖర్చు చేసి 30 ట్రక్కుల గొర్రెల ఎరువును కొని తోటకు వేశారు. దీనితోపాటు ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువును వాడారు. చె ట్ల కాండం వద్ద కాకుండా.. కొమ్మల చివర్ల నుంచి అడుగు లోపలికి పాదులు చేసి ఎరువు వేశారు. నర్సింహారెడ్డి ప్రయత్నం ఫలించింది. ఆ ఏడాది దిగుబడి 110 టన్నులకు పెరిగింది. ఆ ఏడాది తోటను పరిశీలించిన శాస్త్రవేత్తలు మరుసటి ఏడాది దిగుబడులు పడిపోతాయని చెప్పటంతో నర్సింహారెడ్డి ఆందోళనకు గురయ్యారు. ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువుతోపాటు.. రూ. లక్ష వెచ్చించి 60 ట్రక్కుల పశువుల ఎరువును కొనుగోలు చేసి తోటకు వేశారు. ఆ ఏడాది కూడా 110 టన్నుల దిగుబడితో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం లభించింది. తర్వాతి రెండు సంవత్సరాలు పశువుల ఎరువును వేయలేదు. అయినా దిగుబడి తగ్గలేదు. ఈ ఏడాది ఉసిరి, కుంకుళ్లు తదితరాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువును కొనసాగించారు. కరువు పరిస్థితులున్నప్పటికీ తోటకు నీటి కొరత రాలేదు. తెగుళ్ల నియంత్రణకు వాడే రసాయనాలను పూర్తిగా ఆపివేసి.. ఉసిరి, కుంకుళ్లతో తయారు చేసిన పొడి, వేపనూనె, ఆవుమూత్రం కలిపి 4 దఫాలు చల్లారు. 20 రోజులకోసారి 400 లీ. గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా తోటకు అందించారు. పూత సమయంలో చీడపీడలు ఆశించకుండా 10 లీ. నీటికి 1 లీ. ఆవు మూత్రాన్ని కలిపి చెట్లపై పిచికారీ చేశారు. వచ్చే ఏడాది నుంచి పురుగుల మందుల వాడకాన్ని కూడా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జూన్ నుంచే ప్రణాళి కాబద్ధంగా ప్రతి 15 రోజులకోసారి సేంద్రియ పిచికారీలు చేపట్టాలనుకుంటున్నానన్నారు. ఈ ఏడాది సేంద్రియ పిచికారీల వల్ల కాయల పరిమాణం, నాణ్యత, రంగు బావుందన్నారు. పదెకరాల్లోని మామిడి పంటకు రూ. 18 లక్షల ధర పలికింది. నర్సింహారెడ్డి తోటను ఉద్యాన శాఖ ప్రదర్శన క్షేత్రంగా ఎంపిక చేసింది. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఇటీవల స్వయంగా ఈ తోటను సందర్శించి ప్రశంసించారు. - పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా సేంద్రియ పద్ధతుల వల్లనే దిగుబడి.. మొక్క పెట్టి, కాస్తాయిలే అనుకుంటే.. కాయవు. వాటికి అన్ని రకాల పోషకాలనూ అందిస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ పద్ధతుల వల్లనే గడ్డు పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తున్నాం. మనం ఇచ్చిన దానికి చెట్లు పది రె ట్లు తిరిగి ఇస్తాయి. - గూడ నర్సింహారెడ్డి (99480 97877),కట్కూర్, భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా -
మామిడి పోతోంది!
కరువు రక్కసికి కుదేలైన మామిడి రైతు జిల్లాలో పదివేల ఎకరాల్లో ఎండిన తోటలు రూ.50 కోట్ల మేర నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతాంగం కరువు రక్కసి మామిడి రైతును కోలుకోనీయకుండా చేసింది. కంటికిరెప్పలా పెంచిన తోటలకు నీళ్లులేకుండా చేసింది. పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ముచేసింది. పచ్చని చెట్లను నిలువునా ఎండబెట్టి ఫలితం రాకుండా చేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. తిరుపతి:వరుస కరువులతో అన్నదాత తల్లడిల్లి పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చంటి బిడ్డల్లా పెంచి, పోషించుకున్న మామిడి చెట్లు కళ్లేదుటే ఎండిపోతున్నాయి. కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావటం లేదు. దీంతో ఏమి చేయలేని నిస్సాహాయక స్థితిలో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తక్కువ వ్యయప్రయాసలతో రైతు కుటుంబానికి ఆర్థికంగా అసరాగా నిలిచే మామిడి తోటలు నేడు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఎండిపోయాయి. ఇంకా కొన్ని తోటల్లో 30 నుంచి 40 శాతం చెట్లు మాడిపోయాయి. 1972 సంపత్సరంలో వచ్చిన గంజి కరువులో సైతం తోటలు ఎండలేదు. ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ కొంత మంది అన్నదాతలు గతాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎండిన మామిడి తోటలను రైతులు నరికి వేశారు. చేయూత‘ కరువు’... కష్టాల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్న మామిడి రైతుకు చేయూత కరువు అయ్యింది. మూడేళ్ల నుంచి నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్ని తోటల మధ్యలో రాళ్ల నేలలు ఉండడంతో నీటి ఎద్దడికి తట్టుకోలేక చెట్లు ఎండిపోతున్నాయి. ఒకే తోటలోనే కొన్ని పచ్చగా ఉండగా, మరికొన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. ఉద్యాన పంటలను కాపాడేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకుంటామన్నా అమలుకు నోచుకోలేదు. ఎండిన తోటలకు పరిహారం ఇవ్వటం లేదు. రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. కొత్తగా మామిడి తోటల పెంపకానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. దీంతో మామిడి తోటల సాగు తగ్గుతోంది. తోటలు కాపాడే యత్నం మామిడి చెట్లు ఎండిపోకుండా కాపాడేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నాం. పాదుల్లో ఆకులు పరచడం, పచ్చిరొట్ట ఎరువులు వేయడం, జిలుగ, జనుము చల్లిస్తున్నాం. ఎండి పోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు సరఫరా చేస్తాం. బోరుబావుల్లో నీరు అడుగంటడం, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల మామిడి తోటలు ఎండిపోయాయి. - ధర్మజా, ఉప సంచాలకులు, ఉద్యానశాఖ -
మద్దతు ధర కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాడు
నిజామాబాద్: మద్దతు ధర లేక కడుపు మండిన ఓ మామిడి రైతు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నిజామాబాద్ మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది. ఇక్కడ ఆంచూర్ (మామిడి ఒరుగులు)కు రెండు రోజలు క్రితం వరకూ క్వింటాకు రూ.18 వేలు ధర పలుకగా, గురు, శుక్ర వారాల్లో ఇది రూ.9 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఒక్కసారిగా ధర పడిపోవడం వెనుక వ్యాపారులు, మార్కెట్ యార్డు సిబ్బంది కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు సురేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ యార్డులోని నీటి ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఆంచూర్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతు సురేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
గజరాజులతో రైతుల గజగజ !
చంద్రగిరి, న్యూస్‌లైన్ : శేషాచల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు గజరాజుల దాడులతో గజగజలాడుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో ఇవి మామిడి తోటలపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం, ఆదివారం వరుసగా రాత్రి వేళ చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలోని ఓ రైతు మామిడి తోటపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా ఏళ్లుగా.. శేషాచల అటవీ ప్రాంతానికి అనుకుని వేలాది ఎకరాల పంటపొలాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల రైతులు అటవీ సరిహద్దు గ్రామాల్లో మామిడి తోటలు సాగు చేశారు. బాగా నీటివసతి ఉన్న వారు చెరకు, వరి సైతం సాగుచేస్తున్నారు. ఈ పచ్చదనమే రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా వేసవిలో ఈ ప్రాంతాల్లోని పంటపొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఇవి గుంపులు గుంపులుగా వస్తుండడంతో రైతులు సైతం వాటిని చూసి పారిపోవాల్సి వస్తోంది. ఇవి చెరకు తోటలను, మామిడి తోటలను ధ్వంసం చేస్తున్నాయి. వరి పంటను తొక్కేస్తున్నాయి. ఏడాదిపాటు కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగుల దాడిలో ధ్వంసమవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు అప్పటి స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ సరైన చర్యలు తీసుకోలేదు. గతంలో ఏనుగులు దాడి చేసి మనుషుల ప్రాణాలను సైతం హరించాయి. అయినా అధికారుల్లో స్పందన లేదు. ఒక్కసారి వచ్చాయంటే.. ఏనుగులు తరచూ వేసవిలో రావడానికి కారణం వాటికి అడవిలో నీరు, ఆహారం దొరక్కపోవడమే. ఇవి ఒక్కసారి అడవిని వదిలి సమీపంలోని పంటపొలాల్లోకి వచ్చాయంటే చాలు.. తర్వాత రోజూ వస్తూనే ఉంటాయి. రాత్రి వేళ తోటలపై పడి చెట్లను విరిచి తిని తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయి. పగలు విశ్రాంతి తీసుకుని రాత్రికాగానే మళ్లీ వస్తాయి. దీంతో ఆ ప్రాంత రైతులు, గ్రామస్తులు హడలిపోతుంటారు. అధికారులు జాగ్రత్తలకే సరి.. రోజూ ఏనుగులు వచ్చి పొలాలపై దాడులు చేస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు తోటలపై దాడి చేసి వెళ్లాక అధికారులు వచ్చి పరిశీలించి, ఇళ్ల నుంచి బయటకు రావద్దండి, కాపలా కోసం పొలాల్లో ఉండద్దండి అని సలహా ఇస్తున్నారే కానీ పటిష్టమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదంటున్నారు. ప్రతి సంవత్సరం ఏనుగుల దాడులతో లక్షలాది రూపాయల పంటలు నష్టపోతున్నామంటున్నారు. ఇకనైనా ఏనుగులు రాకుండా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాడులు మొదలయ్యాయి.. ఎండలు తీవ్రం కావడం, అడవిలోని చెట్లు, నీటి కుంటలు ఎండిపోవడం, శేషాచలంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఏనుగులకు తిండి, నీరు లేకుండా పోయాయి. దీంతో పంట పొలాలపై ఏనుగుల దాడులు మొదలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట, చిట్టేచర్ల గ్రావూలకు చెందిన రైతులు రవుణ, సుబ్రవుణ్యం మామిడితోటలపై ఏనుగులు దాడి చేశాయి. సుమారు 50 మామిడి చెట్ల కొమ్మలు విరిచేశాయి. అలాగే శనివారం రాత్రి చంద్రగిరి మండలం ఏ.రంగంపేట అటవీ చెక్‌పోస్టుకు సమీపాన రైతు కాయం భాస్కర్‌రెడ్డికి చెందిన మామడితోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సుమారు 100 మామిడి చె ట్ల కొమ్మలు విరిచేశాయి. ఈ ఘటనలో సుమారు 5 టన్నుల మామిడిపంట నష్టం వాటిల్లింది. విషయం తెలియగానే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదివారం ద్విచక్రవాహనంలో వెళ్లి తోటను పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలని అటవీ అధికారులను కోరారు. కాగా ఆదివారం రాత్రి ఏనుగులు తిరిగి ఇదే తోటపై దాడి చేసి మరిన్ని చెట్లను విరిచేశాయి. -
పంటొచ్చె.. వానొచ్చె!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలోనే అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. వారంపది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు వరి సాగుచేసిన రైతులను నష్టాలపాలు చేశాయి. తాజాగా అల్పపీడనం, దానికి తోడు ఉపరితల ఆవర్తనంతో వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. గురువారం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అంతేకాకుండా మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన ప్రకటన జిల్లా రైతాంగం గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇటీవల వర్షాల దాటికి చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో కన్నీరుమున్నీరైన రైతు.. మిగిలిన కాస్తోకుస్తో పంటను రక్షించుకునేందుకు ఉపక్రమించాడు. కానీ తాజాగా కురుస్తున్న వర్షాలు రైతు కంట్లో కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ నష్టం.. పక్షం రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురిశాయి. అయితే అవన్నీ పెనుగాలులు, వడగ ళ్లతో కూడిన వర్షాలు కావడంతో పంటనష్టం పెద్దఎత్తున జరిగింది. రెండున్నర వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కేవలం 1,777 హెక్టార్లలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. అధికంగా ఇబ్రహీపట్నం డివిజన్ పరిధిలో ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత గత వర్షాకాలం జిల్లా రైతాంగానికి కొంత ఊరటనిచ్చింది. దీంతో జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలు వరిపంటపై పెను ప్రభావాన్నే చూపాయి. అధికారుల ప్రాథమిక గణాంకాలు ఇలా ఉన్నప్పటికీ తుది జాబితా రూపొందించే నాటికి నష్టం భారీగా నమోదు కానుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పొడిగా ఉంటేనే.. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో చాలాచోట్ల పంటపొలాల్లో నీళ్లు నిలిచాయి. వరిపైరు మొత్తం నేలపై వాలింది. వాతావరణం పొడిగా పొలాల్లోని నీటిని తీసి వరి కోసుకునే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా వాతావరణం మారడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. మామిడిపై దాడి.. పెనుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో జిల్లాలో మామిడి పంట భారీగా నష్టాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు 350 హెక్టార్లలో మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. సుమారు రూ.రెండు కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.అసలే ధర పలకక సతమతమవుతున్న మామిడి రైతును తాజా వర్షాలు మరింత వణికిస్తున్నాయి. వరుసగా వర్షాలు కురిస్తే పండ్లకు వైరస్ సోకే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మామిడి చెట్ల బీమాపై రైతులకు అవగాహన కరువు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : మామిడి రైతులకు ప్రయోజనం కలిగించే వాతావరణ ఆధారిత బీమా పథకంపై జిల్లాలో ప్రచారం కొరవడింది. బీమా పథకంపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇన్సూరెన్స్ చెల్లించే గడువు కేవలం ఒక్కరోజే మిగిలి ఉన్నా.. ఇంత వరకు రైతులకు తెలియజెప్పే నాథుడే లేడు. దీంతో రైతులు మామిడి తోటలకు బీమా చేయించే పరిస్థితులు కనిపించడం లేదు. మామిడి తోటల పెంపకంలో జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచింది. జిల్లాలో సుమారు 22 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 15 వేల హెక్టార్లలో మామిడి తోటలు కాపు వస్తుండగా, మిగిలిన 7 హెక్టార్లలో ఐదేళ్లలోపు చెట్లు ఉన్నాయి. నెన్నెల, జైపూర్, తాండూర్, బెల్లంపల్లి, కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్, కడెం, ఖానాపూర్, దిలావర్పూర్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా మామిడి తోటలు సాగు చేశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏటా మామిడి చెట్లకు పూత సరిగా రాక, కాపు పడిపోతోంది. ఈ కారణంగా మామిడి తోటలపైనే ప్రధానంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా ఆ పథకాన్ని అమలు చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం దాని ప్రాధాన్యతను రైతులకు వివరించడం లేదు. గ్రామాల్లో ప్రచారం కూడా చేయడం లేదు. దీంతో రైతు లు మామిడి చెట్లకు బీమా చేయించలేకపోతున్నారు. ఆ పథకాన్ని విని యోగించుకోవడంలో మామిడి రైతులు ఇతర జిల్లాల రైతుల కన్న ఎంతో వెనుకబడిపోతున్నారు. ఈయేడు కూడా బీమా పథకాన్ని జిల్లాకు వర్తింపజేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ జీవో నం.1340ను జారీ చేసింది. ఈ నెల 14వ తేదీతో బీమా చేయించే గడువు ముగుస్తుంది. ఇంత వరకు గ్రామాల్లో ఎక్కడా ప్రచారం చేయించలేదు. కనీసం ఏ ఒక్క రైతుకు కూడా తెలియజేసిన పాపాన పోలేదు. చెట్ల వయస్సును బట్టి బీమా.. మామిడి చెట్లను రెండు రకాలుగా విభజించారు. సాధారణం గా ఐదేళ్ల వయస్సున్న చెట్లకు మామిడి పూత ఆపుతారు. అప్ప టి నుంచి కాపు ప్రారంభమవుతుంది. 5 నుంచి 15 ఏళ్ల వయ స్సు కలిగిన ఒక్కో మామిడి చెట్టుకు రూ.52 బీమా ప్రీమి యం చెల్లించాల్సి ఉంటుంది. అందులో మామిడి రైతు రూ. 26 ప్రీమియం చెల్లిస్తే మిగతా సగం రూ.26 ప్రభుత్వం భరిస్తుంది. 16 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన ఒక్కో చెట్టు కు రూ.92 బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందు లో రూ.46 రైతులు ప్రీమియం కడితే మరో రూ.46 ప్రభుత్వం వాటా చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యంతో మామిడి కా పునకు నష్టం కలిగితే 5-15 ఏళ్ల చెట్టు ఒక్కంటికి రూ.450 చొప్పున, 16-50 ఏళ్లలోపు వయస్సు కలిగిన చెట్టుకు రూ. 800 చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అప్పు తీసుకున్న రైతులకు సైతం.. పంట రుణాల కింద ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెం బర్ 15వ తేదీ వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్న మా మిడి రైతులకు కూడా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని వర్తింపజేశారు. రుణాలు పొందని మామిడి రైతులు తుది గడువులోపు ఇన్సూరెన్స్ చెల్లించడానికి వీలు కల్పించారు. ఆసక్తిగల రైతులు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పేరు మీద నిర్ధేశించిన ప్రకారం బీమా ప్రీమియం డీడీ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు ఈ బీమాపై గతేడాది కూడా సరైన ప్రచారం చేయకపోవడంతో కేవలం 60 మంది మాత్రమే బీమా చేసినట్లు సమాచారం. అధికారులు మిన్నకుండిపోవడంతో ఇన్సూరెన్స్ పట్ల రైతులకు అవగాహన లేకుండా పోయిందనేది సత్యం. గట్లుంటదని మాకు తెల్వది మామిడి చెట్లకు సుత ఇన్సూరెన్స్ చేయిస్తారనేది మాకు తెల్వది. గట్ల ఎవలు సుత చెప్పలేదు. ఏటా గాలి వానకు పూత రాలిపోయి నట్టపోతున్నం. ఇన్సూరెన్స్ చేయిస్తేనన్న కొంత డబ్బు వచ్చేది. మా అసొంటోళ్లకు అధికారులు ఎందుకో గని తెలియజెప్తలేరు. - మొండక్క, మామిడి రైతు అధికారులు చెప్పలేదు మామిడి చెట్లకు ఇన్సూరెన్స్ చేయించాలనేది ఇంత వరకు మాకు అధికారులు చెప్పలేదు. ఏటా ఇట్లనే జరుగుతంది. ఉద్యానవన అధికారులు రైతులకు ఇన్సూరెన్స్‌పై కనీస అవగాహన కూడా కల్పించడం లేదు. దీంతో ఇన్సూరెన్స్ చేయించలేకపోతున్నాం. - ఎండి ఆరీఫ్‌ఖాన్, మామిడి రైతు చెట్లతో లాభం లేదు ఎన్నో ఏళ్ల క్రితం మామిడి తోటలు పెట్టినం. ఎప్పుడు మాకు నష్టం అచ్చుడే తప్పా ఫాయిదా లేదు. మామిడి తోటలు పెంచుకొని ఎన్నో బాధలు పడుతున్నం. చెట్లకు ఇన్సూరెన్స్ ఉంటదని ఆల్లీల్లు అనుకొంగ ఇనుడేగాని సార్లచ్చి మాకు చెప్పింది లేదు. మేము చేయించింది లేదు. - పెద్ద శంకరయ్య , మామిడి రైతు