అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సాక్షి నెట్‌వర్క్: అకాల వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షం వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో వరి, మామిడి రైతులతోపాటు ఇతర రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ జిల్లాలో వడగళ్లు, ఈదురు గాలులకు పంటల కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 2,393.4 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఏజెన్సీ ప్రాంతంలో 68.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాంనగర్ వద్ద జీడివాగు ఉప్పొం గి ప్రవహిస్తుండగా, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలమట్టం కాగా, వాహనాల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తాడ్వారుు మండలంలోని మేడా రం వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా గుండ్రాతి మడుగులోని రైలు సిగ్నల్ ప్యానెల్ బ్లాంక్ డెడ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు రైల్వే అధికారులు తెలి పారు. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో చెట్టు కింద ఉన్న బెడిద భీరయ్యతో పా టు మరో ఇద్దరు రైతులు రాజు, జయరాములు పిడుగుపాటుకు గురయ్యారు. భీరయ్య శరీరం కాలిపోగా, మిగ తా ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసుకున్న సుమారు ఐదు వందల టన్నుల ధాన్యం శుక్రవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దరుుంది. మండల వ్యాప్తంగా సుమారు కోటీ యూభై లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తం గా 470 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఉద్యానవన శాఖ ఒకటో డివిజన్ పరిధిలో 234 హెక్టార్లలో మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. కొడంగల్, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి.