మాయదారి వర్షం | Untimely rain | Sakshi
Sakshi News home page

మాయదారి వర్షం

Published Sat, Mar 7 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

మాయదారి వర్షం

మాయదారి వర్షం

జిల్లావ్యాప్తంగా అకాల వర్షం       
దెబ్బతిన్న పంటలు

 
జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.. గురువారం రాత్రి, శుక్రవారం వేకువజామున ఉరుములు, మెరుపులు, గాలి దుమారం, పిడుగుపాటుతో కూడిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసింది.. మొక్కజొన్న నేలవాలింది.. మామిడి తోటల పూతరాలింది.. పిడుగుపాటుకు గేదెలు, గొర్రెలు మృతిచెందారుు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.. వీధులు జలమయం అయ్యూరుు.. జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో నష్టం వాటిల్లింది..
 
జనగామ మండలంలో...

అకాల వర్షం కొన్ని పంటలకు మేలు చేయగా.. మరికొన్నింటికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. వరి, టమాట, పుచ్చ, మొక్కజొన్న పంటలకు వర్షం ఊపిరి పోసినట్లైంది. నెల రోజుల్లో కోతకు రావాల్సిన మొక్కజొన్న పంటలు అకాల వర్షంతో నేలవాలాయి. గాలి దుమారంతో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనగామ మండల పరిధిలో సంభవించిన పిడుగుపాటుతో వెంకిర్యాలలో ఎదునూరి మల్లేశానికి చెందిన పాడి గేదె, గోపరాజుపల్లిలో లింగాల మోహన్‌రెడ్డికి చెందిన జెర్సీ ఆవు, అదే గ్రామంలోని రొంపెల్లి భూపతిరెడ్డికి చెందిన పాడి గేదె, అడవికేశ్వాపూర్‌లో ఎర్ర ఐలయ్యకు చెందిన జెర్సీ ఆవు మృతి చెందారుు. వీఆర్‌ఓలు పంచనామా నిర్వహించి, సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. తమకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు  కోరారు.    - జనగామ రూరల్
 
రాయపర్తి మండలంలో...

రాయపర్తి మండల కేంద్రంతోపాటు  పెర్కవేడు తదితర గ్రామాల్లో కురిసిన అకాలవర్షంతో మిర్చి, మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది.  తడిసిన మిర్చి రంగుమారి తెల్లగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో సర్వే చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
 - రాయపర్తి
 
నల్లబెల్లి మండలంలో...

అకాలవర్షంతో  సుమారు 2500 ఎకరాల్లో మిరపకు నష్టం వాటిల్లింది. రంగాపురం, ముచ్చిం పుల, నందిగామ, రేలకుంట, బోల్లోనిపల్లి, రుద్రగూడెం, గొవిందాపురంలో కల్లాల్లోనే ఉన్న మిరప కాయలు తడిసిముద్దయ్యూరుు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ రాంబాబు డిమాండ్ చేశారు.    - నల్లబెల్లి
 
సంగెం మండలంలో...

సుమారు రెండున్నర గంటల పాటు కురిసిన వర్షం రైతులకు దుఃఖాన్ని మిగిల్చింది. మొక్కజొన్న నేలకొరిగింది. మరి కొన్ని గ్రామాల్లో తీసిన కంకులు.. చేల్లో నిలిచిన నీటిలో తడిసిముద్దయ్యూరుు. మామిడి తోటల్లో పూలు, పిందే రాలిపోయింది.
 - సంగెం
 
గణపురం మండలంలో...

రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కల్లాల్లో ఉన్న మిరప తడిసిపోయింది. కొండాపురం, బంగ్లాపల్లి, అప్పయ్యపల్లి, బుద్దారం, మైలారం, గాంధీనగర్ గ్రామాల్లో మిరప పంటకు భారీ నష్టం వాటిల్లింది.
 - గణపురం  
 
జంగిలికొండ అతలాకుతలం

గాలివాన మహబూబాబాద్ మండలంలోని జంగిలిగొండ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామశివారులో కొండారెడ్డి, గంజి యాకుబ్ రెడ్డికి చెందిన కోళ్ల  ఫారమ్ గాలివానకు కూలిపోయింది. వందలాది కోళ్లు మృతిచెందగా, రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. చెట్లు , విద్యుత్ స్తంభాలు నేలమట్టంకావడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నగేష్, వెంకటనారాయణ, యుగంధర్‌కు చెం దిన  షెడ్లు కూలిపోయూరుు. కొయ్యాల వెంకటరమణ ఇంటికప్పు, కొట్టం కూలిం ది. చెట్టు కూలడంతో సామయ్య కు చెందిన 3 గొర్రెలు మృతిచెందాయి. అచ్చమ్మ, పుల్లయ్య, మల్లయ్య తదితరుల ఇళ్ల పై కప్పులు కూలాయి. స్థానిక పాఠశాల గది పైకప్పు పెంకులు ఊడిపోయాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గ్రామాన్ని సందర్శించి, నష్టపరిహారంపై అంచనా వేయూలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో మిరప నీటిపాలుకావడం తో రైతులు లబోదిబోమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement