Disruption to the power supply
-
‘ఏపీలో విద్యుత్‌పై ఆ వార్తలు అవాస్తవం’
సాక్షి, విజయవాడ: విండ్, సోలార్ ఎనర్జీని కొనుగోలు చేయలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కారణంగా గడచిన 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుత్పత్తి సరిగ్గాలేదని తెలిపారు. పీక్ అవర్స్‌లో విద్యుత్ జెనరేట్ కావడం లేదని.. గడచిన 10 రోజుల్లో 3 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు గాను ఒకరోజు మాత్రమే కొద్దిసేపు గరిష్టంగా 815 మెగావాట్లు వచ్చిందన్నారు. కనిష్టంగా 28 మెగావాట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. గత ఏడాది కన్నా అధికంగా నిల్వ చేసాం.. బొగ్గు నిల్వలపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. గత ఏడాదితో పోలిస్తే అధికంగానే బొగ్గును నిల్వచేసామని చెప్పారు. 2018 సెప్టెంబరు 30న జెన్కో పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు 29,543 మెట్రిక్ టన్నులు ఉన్నాయని, 2019 సెప్టెంబరు 30న బొగ్గు నిల్వలు 46,486 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు.. ముందుస్తుగా ప్లాన్ చేసుకోవడం వలనే దాదాపు 16 వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఉండేలా చూసుకున్నామన్నారు. విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం.. 2018 జూన్, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది ఎక్కువ విద్యుత్ ను ఉత్పత్తి చేశామని వెల్లడించారు. బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయాల సమయంలో ఈ అదనపు నిల్వలు కొంతమేర ఊరటనిచ్చాయని తెలిపారు. కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లింపులు పూర్తిచేశామని తెలిపారు. విద్యుత్ ఎక్స్చేంజి నుంచి నేటి నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామన్నారు. వచ్చే 7 రోజులపాటు రోజుకు 8 ర్యాక్‌ల చొప్పున సింగరేణి నుంచి బొగ్గు వస్తోందన్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షం వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో వరి, మామిడి రైతులతోపాటు ఇతర రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ జిల్లాలో వడగళ్లు, ఈదురు గాలులకు పంటల కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 2,393.4 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఏజెన్సీ ప్రాంతంలో 68.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాంనగర్ వద్ద జీడివాగు ఉప్పొం గి ప్రవహిస్తుండగా, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలమట్టం కాగా, వాహనాల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాడ్వారుు మండలంలోని మేడా రం వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా గుండ్రాతి మడుగులోని రైలు సిగ్నల్ ప్యానెల్ బ్లాంక్ డెడ్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు రైల్వే అధికారులు తెలి పారు. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో చెట్టు కింద ఉన్న బెడిద భీరయ్యతో పా టు మరో ఇద్దరు రైతులు రాజు, జయరాములు పిడుగుపాటుకు గురయ్యారు. భీరయ్య శరీరం కాలిపోగా, మిగ తా ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసుకున్న సుమారు ఐదు వందల టన్నుల ధాన్యం శుక్రవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దరుుంది. మండల వ్యాప్తంగా సుమారు కోటీ యూభై లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తం గా 470 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఉద్యానవన శాఖ ఒకటో డివిజన్ పరిధిలో 234 హెక్టార్లలో మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. కొడంగల్, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. -
వడగండ్లు.. కడగండ్లు
రంగారెడ్డి జిల్లా/ నల్లగొండ: వడగండ్లు రైతన్నకు కడగండ్లు మిగిల్చాయి. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మొయినాబాద్, యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్దఎత్తున వడగండ్లు పడ్డాయి. వరి, కూరగాయలు, మొక్కజొన్న, ఆకుకూరలు, ద్రాక్ష, బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఓ కోళ్లఫాం నేలమట్టమైంది. రాజాపేట మండలంలో మామిడితోటలు దెబ్బతిన్నాయి. తీగజాతి కూరగాయలకు, కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెరువు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో, కళ్లాలలో వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. వడగండ్లు పడడంతో వరిపొలాల్లో ధాన్యం రాలిపోయింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మునుగోడు, చండూరులలో భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు ముగ్గురి మృతి మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం నీటూరు పంచాయతీ పరిధి నర్సాపూర్‌కు చెందిన గొల్ల రాములు, వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన కేశమోని బాలస్వామి గౌడ్(50), నల్లగొండ జిల్లా హుజూర్నగర్ అంబేద్కర్‌కాలనీకి చెందిన గౌని కామేశ్వరమ్మ (45) పిడుగుపాటుకు మృతి చెందారు. -
మాయదారి వర్షం
జిల్లావ్యాప్తంగా అకాల వర్షం దెబ్బతిన్న పంటలు జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది.. గురువారం రాత్రి, శుక్రవారం వేకువజామున ఉరుములు, మెరుపులు, గాలి దుమారం, పిడుగుపాటుతో కూడిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసింది.. మొక్కజొన్న నేలవాలింది.. మామిడి తోటల పూతరాలింది.. పిడుగుపాటుకు గేదెలు, గొర్రెలు మృతిచెందారుు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.. వీధులు జలమయం అయ్యూరుు.. జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో నష్టం వాటిల్లింది.. జనగామ మండలంలో... అకాల వర్షం కొన్ని పంటలకు మేలు చేయగా.. మరికొన్నింటికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. వరి, టమాట, పుచ్చ, మొక్కజొన్న పంటలకు వర్షం ఊపిరి పోసినట్లైంది. నెల రోజుల్లో కోతకు రావాల్సిన మొక్కజొన్న పంటలు అకాల వర్షంతో నేలవాలాయి. గాలి దుమారంతో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనగామ మండల పరిధిలో సంభవించిన పిడుగుపాటుతో వెంకిర్యాలలో ఎదునూరి మల్లేశానికి చెందిన పాడి గేదె, గోపరాజుపల్లిలో లింగాల మోహన్‌రెడ్డికి చెందిన జెర్సీ ఆవు, అదే గ్రామంలోని రొంపెల్లి భూపతిరెడ్డికి చెందిన పాడి గేదె, అడవికేశ్వాపూర్‌లో ఎర్ర ఐలయ్యకు చెందిన జెర్సీ ఆవు మృతి చెందారుు. వీఆర్ఓలు పంచనామా నిర్వహించి, సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. తమకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు కోరారు. - జనగామ రూరల్ రాయపర్తి మండలంలో... రాయపర్తి మండల కేంద్రంతోపాటు పెర్కవేడు తదితర గ్రామాల్లో కురిసిన అకాలవర్షంతో మిర్చి, మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది. తడిసిన మిర్చి రంగుమారి తెల్లగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో సర్వే చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. - రాయపర్తి నల్లబెల్లి మండలంలో... అకాలవర్షంతో సుమారు 2500 ఎకరాల్లో మిరపకు నష్టం వాటిల్లింది. రంగాపురం, ముచ్చిం పుల, నందిగామ, రేలకుంట, బోల్లోనిపల్లి, రుద్రగూడెం, గొవిందాపురంలో కల్లాల్లోనే ఉన్న మిరప కాయలు తడిసిముద్దయ్యూరుు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ రాంబాబు డిమాండ్ చేశారు. - నల్లబెల్లి సంగెం మండలంలో... సుమారు రెండున్నర గంటల పాటు కురిసిన వర్షం రైతులకు దుఃఖాన్ని మిగిల్చింది. మొక్కజొన్న నేలకొరిగింది. మరి కొన్ని గ్రామాల్లో తీసిన కంకులు.. చేల్లో నిలిచిన నీటిలో తడిసిముద్దయ్యూరుు. మామిడి తోటల్లో పూలు, పిందే రాలిపోయింది. - సంగెం గణపురం మండలంలో... రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కల్లాల్లో ఉన్న మిరప తడిసిపోయింది. కొండాపురం, బంగ్లాపల్లి, అప్పయ్యపల్లి, బుద్దారం, మైలారం, గాంధీనగర్ గ్రామాల్లో మిరప పంటకు భారీ నష్టం వాటిల్లింది. - గణపురం జంగిలికొండ అతలాకుతలం గాలివాన మహబూబాబాద్ మండలంలోని జంగిలిగొండ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామశివారులో కొండారెడ్డి, గంజి యాకుబ్ రెడ్డికి చెందిన కోళ్ల ఫారమ్ గాలివానకు కూలిపోయింది. వందలాది కోళ్లు మృతిచెందగా, రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. చెట్లు , విద్యుత్ స్తంభాలు నేలమట్టంకావడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నగేష్, వెంకటనారాయణ, యుగంధర్‌కు చెం దిన షెడ్లు కూలిపోయూరుు. కొయ్యాల వెంకటరమణ ఇంటికప్పు, కొట్టం కూలిం ది. చెట్టు కూలడంతో సామయ్య కు చెందిన 3 గొర్రెలు మృతిచెందాయి. అచ్చమ్మ, పుల్లయ్య, మల్లయ్య తదితరుల ఇళ్ల పై కప్పులు కూలాయి. స్థానిక పాఠశాల గది పైకప్పు పెంకులు ఊడిపోయాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గ్రామాన్ని సందర్శించి, నష్టపరిహారంపై అంచనా వేయూలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో మిరప నీటిపాలుకావడం తో రైతులు లబోదిబోమంటున్నారు.